April 2026
Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

విజయవంతం చేయాలని సిపిఐ ఎంల్ లిబరేషన్ జిల్లా కార్యదర్శి మారపెల్లి మల్లేష్ కోరారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో లక్షలాదిమంది కార్మికులు సంఘటిత, అసంఘటిత, ఉద్యోగ సేవారంగాలలో శ్రమజీవులుగా, చాలీ చాలని అతి తక్కువ వేతనాలు, జీతాలతో పని భద్రత లేకుండా 8 గంటల పని కన్నా అదనపు గంటలు యజమానులు చెప్పిన సమయం వరకు అదనపు శ్రమదోపిడికి గురి అవుతూ కాంట్రాక్టురంగా కార్మికులుగా కనీస వేతనాలు లేకుండా కార్మికులు మరింత పేదరికంలోకి మారి కుటుంబాల పోషణకు అప్పులు చేస్తూ జీవితాలు మరింత దుర్భరం గా మారుతున్నాయి. మేడే స్పూర్తితో పోరాడి చట్టబద్దంగా కార్మికహక్కులు సాధించుకుని, కార్మికులు అంటే బానిసలు కాదని, సంపదలో భాగస్వాములని ప్రభుత్వాల పెట్టుబడిదారుల నుండి శ్రమకు తగిన ఫలితం దక్కే వరకు పోరాడదమని *పోరాడితే పోయేది ఏమీ లేదు బానిస సంకెళ్లు తప్ప* మేడే స్పూర్తితో 8గంటల పని దినాలను సాధించుకున్నాం. 2026 మేడే స్పూర్తితో 4 లేబర్ కోడ్స్ రద్దుకై పోరాడుదాం. శ్రమశక్తిని అందించే సమస్తరంగాల కార్మికులు చేసే శ్రమజీవుల రక్తం చెమటగా మారుస్తున్న కార్మికుల ఐక్యతలో  బలం ఉంది.కార్మికుల హక్కుల కోసం నిరంతరం ఉద్యమం చేద్దామని ఆయన కోరారు.. వి సి కె పార్టీ యూత్ రాష్ట్ర అధ్యక్షులు అనిల్ కుమార్  ఏఐసీసీ టు జిల్లా కార్యదర్శి కన్నూరు డానియల్... పార్టీ జిల్లా నాయకులు బంధు కాంతి  సుజాత ఆత్కూరిశ్రీకాంత్ ఐసా రాష్ట్ర నాయకులు శిలపాక నరేష్ పాల్గొన్నారు
Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

 

కాటారం, ఏప్రిల్ 28: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా కాటారం మండలంలోని కాటారం గ్రామపంచాయతీ కార్యాలయంలో మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కిశోర బాలికలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. బాలల భద్రత రక్షణ మరియు మాదక ద్రవ్యాల వ్యతిరేక సంక్షేమ వారోత్సవాల సందర్భంగా ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సర్పంచ్‌ల ఫోరం డివిజన్ అధ్యక్షుడు, కాటారం సర్పంచ్ పంతకాని సడవలి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాలబాలికలు చదువులో ముందంజలో ఉండి తమ లక్ష్యాలను సాధించాలని, ఈనాటి యువతే రేపటి దేశానికి వెన్నెముకవంటివారని తెలిపారు. తల్లిదండ్రుల కష్టాన్ని గౌరవిస్తూ సమాజంలో మంచి పేరు తెచ్చుకునేలా కృషి చేయాలని సూచించారు. మెడికల్ ఆఫీసర్ డాక్టర్ మౌనిక మాట్లాడుతూ బాలికలు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని, తరచూ ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. హిమోగ్లోబిన్ స్థాయిని సరిగా ఉంచుకోవడం అవసరమని తెలిపారు. అలాగే ప్రతి మంగళవారం నిర్వహించే ‘ఆరోగ్య మహిళా’ క్యాంపులకు హాజరై పరీక్షలు చేయించుకోవాలని కోరారు. సఖి సెంటర్ ప్రతినిధి గాయత్రి మాట్లాడుతూ కిశోర బాలికలు జంక్ ఫుడ్స్‌కు దూరంగా ఉండి ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవాటు చేసుకోవాలని చెప్పారు. ఎదుగుతున్న వయసులో అనవసర ఆకర్షణలకు లోనుకాకుండా తమ లక్ష్యాలపై దృష్టి పెట్టాలని సూచించారు. సమస్యలు ఎదురైతే వెంటనే తల్లిదండ్రులు లేదా బాధ్యత వహించే వ్యక్తులతో పంచుకోవాలని, అవసరమైతే హెల్ప్‌లైన్ నంబర్లు 1098, 181, 100లను వినియోగించుకోవాలని వివరించారు. సూపర్వైజర్ శివరాణి మాట్లాడుతూ రక్తహీనత నివారణ కోసం చిరుధాన్యాలు మరియు అంగన్వాడీ కేంద్రాల్లో అందించే పోషకాహారం తప్పనిసరిగా తీసుకోవాలని చెప్పారు. వ్యక్తిగత సమస్యలపై అంగన్వాడీ టీచర్ల సహాయం అందుబాటులో ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ మౌనిక, ఏపీఎం రవికుమార్, సఖి DHEW గాయత్రి, సూపర్వైజర్లు శివరాణి, వీణ, ఎండి పర్జన, మహిళా సంఘ ప్రతినిధులు, సీసీలు, వీవోఏలు, అంగన్వాడీ టీచర్లు మరియు కిశోర బాలికలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

 

క్యాంపు కార్యాలయంలో ఆన్‌లైన్ ద్వారా జనగణనను స్వీయ నమోదు చేసుకున్న భూపాలపల్లి శాసన సభ్యులు గండ్ర సత్యనారాయణ రావు. ఈ నెల 26న జిల్లా వ్యాప్తంగా జనగణన స్వీయ గణన డిజిటల్ నమోదు కార్యక్రమం ప్రారంభమైన సందర్భంగా మంగళవారం శాసన సభ్యులు క్యాంపు కార్యాలయంలో స్వీయ గణన ప్రక్రియను స్వయంగా ఆన్‌లైన్‌లో నమోదు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 26వ తేదీ నుండి మే 10వ తేదీ వరకు సెల్ఫ్ ఎన్యూమరేషన్ ప్రక్రియ కొనసాగుతుందని తెలిపారు. ప్రజలు స్వీయ గనణలో తమ వివరాలు నమోదు చేసుకోవడం వల్ల సమయం ఆదా అవుతుందని అన్నారు. సెల్ఫ్ ఎన్యూమ రేషన్ కొరకు https://se.census.gov.in లింక్ ఓపెన్ చేసి మొబైల్ నంబర్ నమోదు చేయాలని, ఓటిపి నమోదు చేసి జిల్లా, పట్టణం, గ్రామం, పిన్ కోడ్ నమోదు చేయాలని తెలిపారు. ఆన్లైన్ ద్వారా స్వీయ గనణలో ప్రతి ఒక్కరూ తమ వివరాలను నమోదు చేసుకోవాలని సూచించారు. జిళ్లలో మే 10వ తేదీ వరకు స్వీయ గణన జరుగుతుందని తదుపరి మే 11వ తేదీ నుండి ఎన్యూమరేటర్లు ప్రతి ఇంటికి వచ్చి వివరాలు సేకరిస్తారని, ఎన్యూమ రేటర్లుకు సెల్ఫ్ ఎన్యూమరేషన్ చేసిన సమయంలో వచ్చిన ఐడి నంబర్‌ తెలియచేయాలని సూచించారు. సెల్ఫ్ ఎన్యూమ రేషన్ చేసిన ప్రతి ఒక్కరూ ఐడి నంబర్‌ను జాగ్రత్తగా భద్రపరచుకోవాలని తెలిపారు. జిల్లా ప్రజలు అందరూ జనగణన కార్యక్రమంలో తమ వివరాలు నమోదు చేసుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో సీపీఓ జవహర్, డిప్యూటీ ఎస్ఓ సతీష్ తదితరులు పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

పెద్దపల్లి,గోదావరిఖని,ఏప్రిల్,28 : సింగరేణి సంరక్షణకై–మొండి  బకాయిలు వెంటనే చెల్లించాలి:సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్(సీఐటీయు)డిమాండ్:సింగరేణి కాలరీస్ సంస్థను ఆర్థిక సంక్షోభం నుండిగట్టెక్కించాలని,జెన్‌కో(టిజిజిఇన్కో)ట్రాన్స్‌కోసంస్థలు చెల్లించాల్సిన వేలకోట్ల రూపాయల బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ,మంగళవారం హైదరాబాద్ విద్యుత్ సౌదా  వద్ద సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్(సీఐటీయూ)ఆధ్వర్యంలో భారీ ధర్నా నిర్వహించరు,అనంతరం యూనియన్ నాయకులు(టిజీజీఇఎన్ సిఓ)ఛైర్మన్&మేనేజింగ్ డైరెక్టర్ కు వినతిపత్రం సమర్పించారు.​ఈ సందర్భంగా యూనియన్ రాష్ట్ర నాయకులు మాట్లాడరు.​ఆర్థిక సంక్షోభంతో సింగరేణి సంస్థలో సుమారు 40,000 మంది శాశ్వత ఉద్యోగులు,27,000 మంది కాంట్రాక్ట్ కార్మికులు ఉన్న సింగరేణి సంస్థ నేడు తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది.కార్మికుల జీతభత్యాలు,సంక్షేమ పథకాలు,కనీస పనిముట్లు,ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టులలో బొగ్గు ఉత్పత్తికి కీలకమైన హెవీ ఎక్విప్మెంట్ మిషనరీ,డీజిల్ డోజర్లు,భూగర్భగనులలో  ఎల్ హెచ్ డి మిషనరీలు  కొనుగోలుకు కూడా నిధుల కొరత ఏర్పడటం శోచనీయం,డబ్బులు లేక సింగరేణి కార్మికుల సంక్షేమాన్ని,రక్షణని గాలికి వదిలేయాల్సిన పరిస్థితి నెలకొందిఅని,భారీగా పేరుకుపోయిన బకాయిలు, 2014 నుండి ఇప్పటివరకు విద్యుత్ సంస్థల నుండి సింగరేణికి రావాల్సిన బకాయిలు,46,000 కోట్లకు చేరుకున్నాయి.ఇప్పటివరకు జన్కోనుండి రూ.19000 కోట్లు బకాయిలు,ట్రాన్స్కో నుండి 27000 కోట్లు బకాయి ఉన్నట్లు ఆగ్రహం వ్యక్తం చేశారు.గత రెండేళ్లలోనే(2023-25) వరకు 10,000 కోట్లు పెరగడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనంఅని అవినీతి ప్రభుత్వం అని దుయ్యబట్టారు,ప్రభుత్వ గ్యారెంటీతో బొగ్గు సరఫరా చేసిన సింగరేణికి,ఇతర ప్రభుత్వ సంస్థలైన జెన్‌కో,ట్రాన్స్‌కోల నుండి బకాయిలు ఇప్పించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉంది,ఒక ప్రభుత్వ సంస్థను కాపాడటానికి మరో సంస్థ బకాయిలు చెల్లించకపోవడం వల్ల సింగరేణి మనుగడ ప్రశ్నార్థకంగా మారిందని ఆవేదన వ్యక్తపరిచారు: డిమాండ్లు(టిజిజిఇన్కో),ట్రాన్స్‌కో నుండి రావాల్సిన.46,000 కోట్ల బకాయిలను వెంటనే వడ్డీతో సహా చెల్లించాలి.సింగరేణి కార్మికుల సంక్షేమానికి,సంస్థ అభివృద్ధికి ఆటంకం కలగకుండా నిధులు విడుదల చేయాలి.బ్యాంకుల వద్ద అప్పులు తెచ్చే పరిస్థితి నుండి సంస్థను విముక్తి చేయాలని పేర్కొన్నారు,​ఈ కార్యక్రమంలో యూనియన్ గౌరవాధ్యక్షులు కామ్రేడ్ భూపాల్,రాష్ట్ర అధ్యక్షులు మందా నర్సింహారావు,రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తుమ్మల రాజారెడ్డి,ఆర్టి-టూఏరియా సెక్రెటరీ కుంట ప్రవీణ్ కుమార్,అధ్యక్షులు బానోత్ వినయ్ లు సింగరేణి వ్యాప్తంగా ఉన్న అధ్యక్ష కార్యదర్శులతో పాటు నాయకులు కార్యకర్తలు కార్మికులు తదితరులు పాల్గొన్నారు...

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

 

మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ మండలంలోని నాంచారిమడూరు గ్రామంలో ఉన్న మహాత్మ జ్యోతిబాఫూలే డిగ్రీ గురుకుల కళాశాలలో విషాద ఘటన చోటుచేసుకుంది. కళాశాలలో చదువుతున్న ఓ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం. భూపాలపల్లి జిల్లా గోరికొత్తపల్లి గ్రామానికి చెందిన రాచర్ల కార్తీక్ (19) అనే విద్యార్థి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిసింది. సంఘటన సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ ప్రారంభించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం వర్ధన్నపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. స్థానికంగా ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

జయశంకర్ భూపాలపల్లి జిల్లా, ఏప్రిల్ 25: భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యాలయంలో ఈరోజు రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు చందుపట్ల కీర్తి రెడ్డి అధ్యక్షతన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు, కార్పొరేటర్ చాడ స్వాతి మరియు రాష్ట్ర అధికార ప్రతినిధి వన్నాల వెంకటరమణ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, మహిళా సాధికారత, దేశంలో జరుగుతున్న తాజా పరిణామాలు మరియు కాంగ్రెస్ పార్టీ వైఖరిపై విస్తృతంగా మాట్లాడారు. మహిళల సాధికారతకు అత్యంత కీలకమైన సమయంలో కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ వైఖరిని ప్రదర్శించిందని బీజేపీ నాయకులు తీవ్రంగా విమర్శించారు. లోక్‌సభలో మహిళా రిజర్వేషన్ చట్ట సవరణ బిల్లును అడ్డుకోవడం ద్వారా కాంగ్రెస్ మహిళల ఆశయాలను దెబ్బతీసిందని మండిపడ్డారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం మహిళలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్ కల్పించేందుకు ‘మహిళా రిజర్వేషన్ చట్ట సవరణ బిల్లు-2026’ను ప్రవేశపెట్టిందని, 2029 నాటికి అమలు చేయాలనే లక్ష్యంతో తీసుకున్న నిర్ణయాన్ని కాంగ్రెస్ అడ్డుకోవడం అన్యాయమని పేర్కొన్నారు. మహిళా సాధికారతపై పెద్దలు మాట్లాడుతున్న కాంగ్రెస్ నాయకుల అసలు వైఖరి పార్లమెంటులో బయటపడిందని, ఇది మహిళా వ్యతిరేక కూటమిగా స్పష్టమవుతోందని అన్నారు. మహిళలకు సముచిత ప్రతినిధిత్వం కల్పించే చారిత్రాత్మక నిర్ణయాన్ని అడ్డుకోవడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని వ్యాఖ్యానించారు. ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా ప్రతిపక్షాల ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చినా, రాజకీయ ప్రయోజనాల కోసమే కాంగ్రెస్ ఈ బిల్లును అడ్డుకుందని ఆరోపించారు. గతంలో కూడా కాంగ్రెస్ మహిళా రిజర్వేషన్ విషయంలో నిర్లక్ష్య వైఖరినే చూపిందని విమర్శించారు. మహిళల హక్కులను అడ్డుకునే విషయంలో కాంగ్రెస్ మరియు మిత్రపక్షాలు ఏకమయ్యాయని, భవిష్యత్తులో మహిళలు తగిన సమాధానం ఇస్తారని హెచ్చరించారు. మహిళా సాధికారతే దేశ అభివృద్ధికి పునాదిగా భావిస్తూ, మహిళల గౌరవం, హక్కుల పరిరక్షణ కోసం బీజేపీ కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పార్లమెంట్ కో-కన్వీనర్ లింగంపల్లి ప్రసాద్ రావు, జిల్లా ఉపాధ్యక్షుడు దాసరి తిరుపతిరెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శులు దొంగల రాజేందర్, పెండ్యాల రాజు, రాష్ట్ర నాయకులు బట్టు రవి, అర్బన్ అధ్యక్షుడు గీస సంపత్, కౌన్సిలర్ ఎరుకల రేణుక, మీడియా ఇంచార్జ్ మునీందర్, బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు సయ్యద్ గాలిఫ్, మహిళా మోర్చా నాయకురాలు బూర పద్మ తదితరులు పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

జయశంకర్ భూపాలపల్లి జిల్లా తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఆధ్వర్యంలో “చలో ఇందిరా పార్క్” కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిస్తూ, విద్య హక్కు చట్టం–2009 అమలు కోసం హైదరాబాద్ ఇందిరా పార్క్‌లో భారీ స్థాయిలో ధర్నా నిర్వహించబడుతుంది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న గారు అధ్యక్షత వహించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా పేద, బడుగు, బలహీన వర్గాల విద్యార్థుల తల్లిదండ్రులు లక్షలాదిగా హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో భూపాలపల్లి జిల్లా నుండి కూడా భారీగా తరలిరావాలని తెలంగాణ రాజ్యాధికార పార్టీ జిల్లా అధ్యక్షుడు రవి పటేల్ పిలుపునిచ్చారు. ప్రస్తుతం ఎల్కేజీ సీటు పొందాలంటే లక్షల రూపాయలు ఖర్చు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. పుస్తకాలు, యూనిఫామ్, బెల్ట్, బూట్లు తదితరాల పేరుతో అధిక ఫీజులు వసూలు చేస్తూ ప్రైవేట్ విద్యాసంస్థలు తల్లిదండ్రులను దోచుకుంటున్నాయి. ఈ భారాన్ని భరించలేక ప్రజలు అప్పులపాలు అవుతూ, తమ ఆస్తులు అమ్ముకునే దుస్థితి ఏర్పడింది. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఈ విద్యా దోపిడీ ఇప్పటికే ఆగిపోయేదని, కానీ పాలకుల అండదండలతో విద్యా మాఫియా రెచ్చిపోతుందని రవి పటేల్ విమర్శించారు. విద్య హక్కు చట్టం–2009ను పూర్తిగా అమలు చేస్తే సామాన్యుడి బిడ్డ కూడా కార్పొరేట్ పాఠశాలలో ఉచితంగా చదువుకునే అవకాశం లభిస్తుందని, ప్రైవేట్ పాఠశాలల ఫీజులపై నియంత్రణ ఏర్పడుతుందని, విద్యా వ్యవస్థలో జవాబుదారితనం పెరుగుతుందని తెలిపారు. తెలంగాణ సమాజం ఇకనైనా మేల్కొని, పిల్లల విద్య కోసం అప్పులపాలు కావడం ఆపాలని ఆయన పిలుపునిచ్చారు. “చదువు అమ్ముకునే వస్తువు కాదు – ఇది ప్రతి బిడ్డ హక్కు” అని స్పష్టం చేశారు. తెలంగాణలో వెంటనే విద్య హక్కు చట్టం అమలు చేయాలని, ప్రైవేట్ విద్యా దోపిడిని అరికట్టాలని, పేదవారి పిల్లలకు నాణ్యమైన ఉచిత విద్య అందే వరకు ఈ పోరాటం కొనసాగుతుందని తెలిపారు. అందువల్ల విద్యార్థుల తల్లిదండ్రులు పెద్ద ఎత్తున రేపు ఉదయం 9 గంటలకు హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద జరిగే ధర్నాకు హాజరై విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. మన హక్కులను సాధించాలంటే మరో ఉద్యమం తప్పదని, అందరం కలసి పోరాడాలని రవి పటేల్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు ఇనుగాల ప్రణయ్ రాజ్, మడే సంతోష్, వైద్య లక్ష్మణ్, రామ్ చరణ్, రేణుకుంట్ల సునీల్, లక్ష్మణ్ బన్నీ తదితరులు పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

జయశంకర్ భూపాలపల్లి జిల్లా, రేగొండ మండలం గూడేపల్లి గ్రామంలో ఇటీవల మరణించిన లింగంపల్లి సమ్మక్క కుటుంబాన్ని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు చందుపట్ల కీర్తి రెడ్డి పరామర్శించారు. ఈ సందర్భంగా ఆమె మృతురాలి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేసి, వారికి ధైర్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆమె వెంట పార్లమెంట్ కో-కన్వీనర్ లింగంపల్లి ప్రసాద్ రావు, జిల్లా ఉపాధ్యక్షులు దాసరి తిరుపతి రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి పెండ్యాల రాజు, కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు పొలసాని తిరుపతి రావు, బూత్ అధ్యక్షులు రాజేశ్వరరావు, నాయకులు పాపారావు, తిరుపతి రావు, సోషల్ మీడియా కన్వీనర్ ఎర్ర రాకేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

 

అంగన్వాడి కేంద్రాలు చిన్నారుల అభివృద్ధికి పునాది వేస్తూ ‘అమ్మవడి మొదటి బడి’గా నిలుస్తున్నాయని భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణ రావు పేర్కొన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని పుష్ప గ్రాండ్‌లో మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన భూపాలపల్లి డివిజన్ అంగన్వాడి టీచర్లకు స్మార్ట్‌ఫోన్‌ల పంపిణీ కార్యక్రమం, సంక్షేమ వారోత్సవాల సందర్భంగా ఆయన జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గర్భిణీలు, బాలింతలు మరియు చిన్నారుల ఆరోగ్య సంరక్షణలో మహిళా శిశు సంక్షేమ శాఖ సిబ్బంది అందిస్తున్న సేవలను అభినందించారు. ప్రైవేట్ భవనాల్లో కొనసాగుతున్న అంగన్వాడి కేంద్రాల జాబితాను సమర్పించాలని, వాటికి స్థలాలు కేటాయించి నిధులు మంజూరు చేసి భవనాల నిర్మాణం చేపడతామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అంగన్ వాడిల అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. అంగన్వాడి కార్యకర్తలు, ఆశా వర్కర్లు గ్రామ స్థాయిలో సేవలందించే సైనికులని పేర్కొంటూ, గర్భిణీలు ఆరోగ్యంగా ఉండేందుకు వారి సేవలు ఎంతో దోహదపడు తున్నాయని అన్నారు. ప్రతి బిడ్డకు కనీసం ఆరు నెలలు తల్లిపాలు అందేలా చూడాలని, పోషకాహారం తీసుకునేలా గర్భిణీలు, బాలింతలు, చిన్నారులను చైతన్యపరచాలని సూచించారు. అంగన్వాడి సేవలను మరింత పారదర్శకంగా చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని, అందులో భాగంగా స్మార్ట్‌ఫోన్లు అందజేస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ నిర్వహిస్తున్న వివిధ సర్వేల్లో అంగన్వాడి సిబ్బంది భాగస్వాములు అవుతూ కీలక పాత్ర పోషిస్తున్నారని కొనియాడారు. జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ మాట్లాడుతూ ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు భూపాలపల్లి డివిజన్‌లోని 418 మంది అంగన్వాడి సిబ్బందికి స్మార్ట్‌ఫోన్లు అందజేసినట్లు తెలిపారు. 99 రోజుల ప్రగతి ప్రణాళికలో భాగంగా పోషణ మాసం నిర్వహించినట్లు పేర్కొన్నారు. క్షేత్ర స్థాయిలో గర్భిణీలు, చిన్నారులకు సేవలు అందించడంలో అంగన్వాడి సిబ్బంది ప్రముఖ పాత్ర పోషిస్తున్నారని అభినందించారు. ప్రతి చిన్నారి, గర్భిణి వివరాలను సమగ్రంగా నమోదు చేయాలని, పథకాల సమర్థవంతమైన అమలుకు అది దోహదపడుతుందని సూచించారు. ప్రతి కేంద్రంలో పిల్లల ఆరోగ్య రక్షణకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మారుమూల ప్రాంతాల్లో కూడా మహిళా శిశు సంక్షేమ శాఖ సిబ్బంది అందిస్తున్న సేవలను ఆయన కొనియాడారు. అనంతరం చిన్నారులకు ప్రోగ్రెస్ రిపోర్ట్స్ అందచేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, గ్రంధాలయ సంస్థల ఛైర్మన్ రాజబాబు, మున్సిపల్ చైర్మన్ బుర్ర కొమరయ్య, మున్సిపల్ వైస్ చైర్మన్ అంబాల శ్రీనివాస్, మహిళా శిశు సంక్షేమ అధికారి మల్లీశ్వరి, కౌన్సిలర్లు, ఆర్టీఐ సభ్యులు రామచంద్రయ్య తదితరులు పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day
జయశంకర్ భూపాలపల్లి జిల్లా తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఆధ్వర్యంలో ఆర్టీసీ కార్మికుల మూడవ రోజు సమ్మెకు మద్దతుగా ఈరోజు భారీ నిరసన ర్యాలీ నిర్వహించబడింది. ఈ సందర్భంగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు రవి పటేల్ మాట్లాడుతూ, ఆర్టీసీ కార్మికుల హక్కుల కోసం నర్సంపేటలో శంకర్ గౌడ్ అనే కార్మికుడు ఆత్మహత్య చేసుకోవడం అత్యంత దురదృష్టకరమని తెలిపారు. ఈ ఘటనకు నిరసనగా ఈరోజు భారీ ర్యాలీ నిర్వహించినట్లు చెప్పారు. శంకర్ గౌడ్ మరణం ముమ్మాటికీ ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని, ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు. అలాగే నల్గొండ, భూపాలపల్లి జిల్లాల్లో పలువురు కార్మికులు ఆత్మహత్యాయత్నాలకు పాల్పడుతున్న నేపథ్యంలో ప్రభుత్వం తన వైఖరిని మార్చుకుని ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరిపి వారి న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలన్నారు. మరణించిన శంకర్ గౌడ్ కుటుంబానికి తక్షణమే రూ.1 కోటి ఎక్స్‌గ్రేషియా ప్రకటించి, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. ఆర్టీసీ కార్మికులు అడుగుతున్నవి తమ స్వంత డిమాండ్లు కాకుండా, కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరుతున్నారని తెలిపారు. కార్మికులు ఉంచిన 30 డిమాండ్లపై ప్రభుత్వం వెంటనే చర్చలు జరిపి అమలు చేయాలని కోరారు. లేదంటే తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం కొనసాగిస్తామని హెచ్చరించారు. కార్మికులకు ఏ సమస్య వచ్చినా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ అండగా నిలుస్తుందని, వారి సమస్యలు పరిష్కారం అయ్యే వరకు తీన్మార్ మల్లన్న నేతృత్వంలో పోరాటం కొనసాగిస్తామని తెలిపారు. “కార్మికులు లేనిదే ఏ ప్రభుత్వం నిలవదు. ఇంతమంది ప్రాణాలు కోల్పోతున్నా ప్రభుత్వం స్పందించకపోవడం బాధాకరం. వెంటనే కార్మికుల డిమాండ్లు నెరవేర్చకపోతే రాస్తారోకాలు, పెద్ద ఎత్తున నిరసనలు చేపడతాం” అని ప్రభుత్వం ను హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు ఇనుగాల ప్రణయ్ రాజ్, జిల్లా కార్మిక మరియు ఉపాధ్యక్షుడు అనంతుల సంపత్ బొట్టు, జిల్లా కోశాధికారి జినూకల శ్రీను, జిల్లా మహిళా అధ్యక్షురాలు సామల శ్రీలత, జిల్లా క్రమశిక్షణ కమిటీ అధ్యక్షుడు గండు కరుణాకర్, జిల్లా నాయకులు రాజేందర్, లక్ష్మణ్ తదితరులు పాల్గొని కార్మికులకు మద్దతు తెలిపారు.


Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

 కాటారం మండలంలోని అంకుషాపూర్ అంగన్వాడీ కేంద్రంలో పోషణ పక్వాడ ప్రోగ్రాము నిర్వహించడం జరిగినది ఈ కార్యక్రమమునకు ముఖ్యఅతిథిగా సర్పంచ్ కల్పన దేవయ్య  హాజరవడం జరిగినది ఆమె మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రంలో అందించే సేవలను సద్వినియోగపరుచుకోవాలని సూచించడం జరిగినది అలాగే చిరుధాన్యాలకు మన ఆహారంలో భాగం చేసుకోవాలని సూచించడం జరిగినది. సూపర్వైజర్ శివరాణి  మాట్లాడుతూ తల్లిపాల ప్రాముఖ్యతను ముర్రుపాల ప్రాముఖ్యతను గురించి వివరించడం జరిగినది అలాగే వెయ్యి రోజుల ( గర్భిణీ దశ నుండి రెండు సంవత్సరముల పిల్లల వరకు జరిగే అభివృద్ధి )ప్రాముఖ్యతను గురించి వివరించడం జరిగినది ప్రీస్కూలు ఆవశ్యకతను గురించి వివరించడం జరిగినది. పిల్లలు అంగన్వాడీ కేంద్రంలో స్వేచ్ఛ వాతావరణంలో ఆటపాటల ద్వారా విద్యను అందించడం వలన సమగ్ర అభివృద్ధి జరుగుతుందని వివరించడం జరిగినదిప్రథమ్ ఎన్జీవో సమ్మయ్య గారు పాఠశాల సంసిద్ధత మరియు బాలమేళా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో తదనంతరము గ్రాడ్యుయేషన్ డే నిర్వహించడం జరిగినది ఈ కార్యక్రమంలో సర్పంచ్ కల్పన దేవయ్య ఉపసర్పంచ్ ఉమా శంకర్ అంగన్వాడి సూపర్వైజర్స్ శివరాణి రమాదేవి వ్రతం ఎన్జీవో సమ్మయ్య గారు కార్యదర్శి రజిత వార్డు మెంబర్స్ అంగన్వాడీ టీచర్స్ గ్రామస్తుల భారీ సంఖ్యలో పాల్గొనడం జరిగినది.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

తెలంగాణ ప్రజా ఫ్రంట్ (టీపీఎఫ్) జిల్లా అధ్యక్షుడు పీక కిరణ్ మాట్లాడుతూ తెలంగాణ వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు చేస్తున్న న్యాయమైన సమ్మెకు తెలంగాణ ప్రజా ఫ్రంట్ TPF సంపూర్ణ మద్దతును తెలియజేస్తున్నది. 41 రోజులుగా తమ సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వానికి సమ్మె నోటీసు ఇచ్చినప్పటికీ కనీసం స్పందించకుండా 41 రోజుల తర్వాత ఐఏఎస్ తో  కమిటీ వేశామని కార్మిక వర్గాన్ని తప్పుదోవ పట్టించే విధంగా వ్యవహరించింది. గత ఎన్నికలలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మాట నిలబెట్టుకోవడంలో పూర్తిగా వైఫల్యం చెందింది. ఆర్టీసీలో ఎన్నికలు నిర్వహించకుండా కార్మికుల సమస్యలు పరిష్కరించకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులను వంచనకు గురిచేసింది. ఈ స్థితిలో అనివార్యమైన పరిస్థితుల్లో ఆర్టీసీ కార్మికులంతా తమ సమస్యల పరిష్కారానికి సమ్మెబాట పట్టింది. సమ్మెను పరిష్కరించాల్సిన ప్రభుత్వం సమ్మెను విచ్ఛిన్నం చేసేందుకు కుటిల ప్రయత్నాలు చేస్తున్నది. తెలంగాణ ప్రజలంతా ఆర్టీసీ కార్మిక వర్గానికి అండగా నిలవాల్సిన అవసరం ఉన్నది. కార్మికులంతా తమ సమస్యలు పరిష్కారం అయ్యేంతవరకు ఐక్యంగా ఉండాలని, ఎన్ని ఒత్తిడిలు ఎంత నిర్బంధం ఎదురైనా చైతన్యంతో సమ్మెను కొనసాగించాలని కిరణ్ పిలుపునిచ్చారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

వర్షాకాలానికి ముందే అన్ని సంక్షేమ వసతి గృహాలు,  పాఠశాలలో మరమ్మత్తు పనులు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ఇంజనీరింగ్ అధికారులను  ఆదేశించారు. బుధవారం మొగుళ్లపల్లి మండలంలోని మహాత్మ జ్యోతిబాపూలే పాఠశాలను జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలలో మరమ్మతులు చేయాల్సిన పనులను ఆయన పరిశీలించారు.  అనంతరం ఆయన మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ, బీసీ మైనారిటీ,  మహాత్మ జ్యోతిబాపూలే, మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలలు,  ప్రభుత్వ పాఠశాలలో మరమత్తులకు సంబంధించి ప్రతిపాదనలు అందజేయాలని ఆయన సంబందిత ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు.  31 పాఠశాలల్లో చేపట్టిన మరుగుదొడ్లు పనులను పూర్తి చేయాలని ఆదేశించారు.  అన్ని పాఠశాలలో నూరు శాతం మంచినీరు, మరుగుదొడ్లు, విద్యుత్ సరఫరా ఉండాలని స్పష్టంచేశారు. అంగన్వాడీ కేంద్రాల్లో మరుగుదొడ్లు, మంచినీటి సరఫరా పునరుద్ధరణ పనులను మే 10  వరకు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.   టెండర్ ప్రక్రియ పూర్తి అయిన పనులకు అగ్రిమెంట్ పూర్తి చేసి పనులు ప్రారంభించాలని తెలిపారు. టెండర్ పూర్తి అయిన పనులను తక్షణమే మరమ్మతులు చేపట్టే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా ఏప్రిల్ 20వ తేదీ నుండి 26వ తేదీ వరకు నిర్వహించనున్న "వెల్ఫేర్ వీక్" సందర్భంగా అన్ని రకాల సంక్షేమ హాస్టల్లో సంబంధిత శాఖల సంక్షేమ అధికారులు ప్రణాళిక ప్రకారం నిర్వహించాలని సూచించారు. ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ప్రణాళిక కార్యక్రమాల  లక్ష్యాలను సాధించేందుకు అన్ని శాఖలు  సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఏప్రిల్ 20 నుండి ఏప్రిల్ 26 వరకు "వెల్ఫేర్ వీక్" నిర్వహణలో భాగంగా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. వాటిలో ముఖ్యంగా ఏప్రిల్ 20 నుండి 26 వరకు సంక్షేమ హాస్టళ్లను  అధికారులు  సందర్శించి హాస్టల్ భవనాలు మరియు విద్యార్థులకు అన్ని రకాల సదుపాయాలు అందే విధంగా చూడాలన్నారు. ఏప్రిల్ 23న అన్ని పాఠశాలల్లో తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయుల సమావేశాలు నిర్వహించి పాఠశాల అభివృద్ధి గురించి విద్యార్థుల పురోగతి గురించి చర్చించడం,  తల్లిదండ్రులను మాట్లాడించడం మరియు వారి  నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకోవడం చేయాలన్నారు. అలాగే ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను సన్మానించాలని తెలిపారు. ఏప్రిల్ 24 తేదీన నైపుణ్య శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని, దీనిలో భాగంగా విద్యార్థులు, నిరుద్యోగ యువత కోసం వివిధ అవకాశాలపై అవగాహన కల్పించడం, వాటిలో నమోదు అయ్యేలా చూడడం మరియు ఉపాధి అవకాశాల కల్పించే ఉద్దేశంలో  నైపుణ్యాభివృద్ధి మరియు ఉపాధి కార్యక్రమాలు నిర్వహించాలన్నారు.  భూపాలపల్లి, కాటారం ఏటిసి కేంద్రాల్లో విద్యార్థులకు వృత్తి నైపుణ్యం తరగతులు నిర్వహించాలని సూచించారు. ఏప్రిల్ 25 తేదీన విద్యార్థులకు సమ్మర్ క్యాంపులు నిర్వహించి క్రీడలు, కళలు, హస్తకళలు, సంగీతం, డిజిటల్ లెర్నింగ్ మరియు వ్యక్తిత్వ వికాసం వంటి అంశాలపై అవగహన కల్పించాలని సూచించారు. ఏప్రిల్ 26 తేదీన బడిబాట /హాస్టల్ బాట కార్యక్రమం నిర్వహించాలని, దీనిలో భాగంగా పాఠశాలలో ఖాళీలను గుర్తించడం ప్రత్యేక డ్రైవ్ పెట్టి విద్యార్థులను గుర్తించాలని,  అలాగే కమ్యూనిటీ ఇన్వాల్వ్మెంట్ చేయడం ద్వారా ఖాళీ లను భర్తీ చేయాలని సూచించారు. వెల్ఫేర్ వీక్ కార్యక్రమంలో భాగంగా ప్రతిరోజు జరిగే కార్యక్రమానికి  రిపోర్టులు పంపాలని తెలిపారు. ఈ సమావేశంలో స్థానిక సంస్థలు అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, డీఈఓ రాజేందర్, బిసి సంక్షేమ అధికారి ఇందిర, పీఆర్, గిరిజన, టీడబ్లుఐడిసి ఇంజనీరింగ్ అధికారులు, తహసీల్దార్ సునీత, ఎంపిడివో  సురేందర్, సర్పంచ్ విజయ, ప్రిన్సిపల్ శ్యామల తదితరులు పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

 

జయశంకర్ భూపాలపల్లి జిల్లా TGSRTC జాయింట్ ఆక్షన్ కమిటీ ఆధ్వర్యంలో భూపాలపల్లి డిపో ముందు జరుగుతున్న ఆర్టీసీ కార్మికుల సమ్మెలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ జిల్లా అధ్యక్షుడు రవి పటేల్ పాల్గొని కార్మికులకు పూర్తి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన డిపో ముందు కార్మికులతో కలిసి కూర్చొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం కార్మికుల సమస్యలపై మాట్లాడుతూ రవి పటేల్ గారు ప్రభుత్వాన్ని ఉద్దేశించి పలు కీలక డిమాండ్లు చేశారు. ఆర్టీసీ ఉద్యోగులను వెంటనే ప్రభుత్వంలో విలీనం చేయాలని, 2021 వేతన సవరణలో 30% ఫిట్మెంట్ అమలు చేయాలని, అలాగే 2025 వేతన సవరణను వెంటనే అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అలాగే ప్రతి నెల ప్రభుత్వం ఆర్టీసీకి ₹400 కోట్లు ఆర్థిక సహాయం అందించాలని, ఆర్టీసీ కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. ట్రేడ్ యూనియన్ గుర్తింపు సంఘం ఎన్నికలను నిర్వహించాలని, కార్మికులపై ఉన్న పనిభారం తగ్గించాలని ఆయన పేర్కొన్నారు. ఎలక్ట్రిక్ బస్సులను కొనుగోలు చేసి వెంటనే ఆర్టీసీకి అందించాలని, అద్దె బస్సు డ్రైవర్లను ఆర్టీసీలో విలీనం చేయాలని, అధిక సంఖ్యలో బస్సులను పునరుద్ధరించాలని కూడా ఆయన డిమాండ్ చేశారు. కార్మికులు ఇచ్చిన సమ్మె నోటీసులో పేర్కొన్న అన్ని న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలని రవి పటేల్ గారు స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ఆర్టీసీ కార్మికులు రాష్ట్రవ్యాప్తంగా కొనసాగిస్తున్న సమ్మెకు తెలంగాణ రాజ్యాధికార పార్టీ పూర్తి మద్దతు ఇస్తుందని, కార్మికుల న్యాయపరమైన పోరాటంలో తమ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని రవి పటేల్ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు ఇనుగాల ప్రణయ్ రాజ్, జిల్లా కార్మిక సంఘం నాయకులు, జిల్లా ఉపాధ్యక్షుడు అనంతల సంపత్, జిల్లా కోశాధికారి జిలకర శ్రీను, జిల్లా కమిటీ సభ్యుడు వైద్య లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.



Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

జయశంకర్ భూపాలపల్లి జిల్లా,: తెలంగాణ రాజ్యాధికార పార్టీ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు రవి పటేల్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. రేపు తెలంగాణ వ్యాప్తంగా జరుగుతున్న ఆర్టీసీ సమ్మెకు మద్దతుగా, టిఆర్పి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న గారి పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా టిఆర్పి పార్టీ సమ్మెలో పాల్గొంటుందని తెలిపారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కూడా టిఆర్పి పార్టీ ఆర్టీసీ సమ్మెకు పూర్తి మద్దతు ఇస్తుందని రవి పటేల్ స్పష్టం చేశారు. ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్లు నెరవేర్చేంతవరకు భూపాలపల్లిలో ఒక్క బస్సు కూడా డిపో నుండి బయటకు వెళ్లనివ్వమని హెచ్చరించారు. కార్మికులు తమ కష్టంతో ఆర్టీసీని నిలబెట్టుకుంటున్నారని, వారి న్యాయమైన 32 డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో, టిఆర్పి పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు ఇనుగాల ప్రణయ్ రాజ్, మోటపోతుల సమ్మయ్య, కౌటం సురేందర్, స్వామి తదితరులు పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

 

కాటారం: ప్రజా పాలనలో భాగంగా స్థానిక ట్రైబల్ వెల్ఫేర్ గురుకుల బాలుర కళాశాలలో హ్యాండ్‌బాల్ సమ్మర్ కోచింగ్ క్యాంప్‌ను సోమవారం ప్రారంభించారు. ఈ క్యాంప్ ఈనెల 20వ తేదీ నుండి 29వ తేదీ వరకు కొనసాగనుంది. ఈ కార్యక్రమాన్ని కళాశాల ప్రిన్సిపాల్ సోమోజీ  ప్రారంభించగా, గర్ల్స్ స్కూల్ ప్రిన్సిపాల్ నాగలక్ష్మి , సీనియర్ వైస్ ప్రిన్సిపాల్ ఎ. మాధవి , జూనియర్ వైస్ ప్రిన్సిపాల్ ఎం. వెంకటయ్య, పాల్గొన్నారు. ఈ సందర్భంగా కళాశాల పీడీ కె. కల్పన , కుడిమేత మహేందర్ , పీటీ మంతెన శ్రీనివాస్ , కోచ్ మూల వెంకటేష్ , డిప్యూటీ వార్డెన్ రజనీకాంత్  మరియు ఇతర ఉపాధ్యాయులు హాజరయ్యారు. విద్యార్థుల్లో క్రీడల పట్ల ఆసక్తిని పెంపొందించేందుకు ఇలాంటి శిక్షణ శిబిరాలు ఉపయోగపడతాయని నిర్వాహకులు తెలిపారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

 

జయశంకర్ భూపాలపల్లి జిల్లా: జిల్లా న్యాయవాదుల ఆధ్వర్యంలో  సీనియర్ సివిల్ కోర్టు న్యాయమూర్తి శ్రీ ఏ. నాగరాజు  ఘనంగా వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు. గద్వాల జిల్లా కి బదిలీపై వెళ్తున్న సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా న్యాయవాదులు నాగరాజు  సేవలను కొనియాడుతూ, ఆయన న్యాయపరమైన కృషి మరియు నిష్పక్షపాత ధోరణిని ప్రశంసించారు. అనంతరం శాలువా కప్పి సన్మానించారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు కూనూరు సురేష్ కుమార్, ప్రధాన కార్యదర్శి ఆకుల రాములు, ట్రెజరర్ ఇందారపు శివకుమార్ పాల్గొన్నారు. అలాగే న్యాయవాదులు రవికుమార్, రాజేందర్, నీలం ప్రశాంత్, చీర్ల అశోక్, సతీష్, సురేందర్, ఎండీ రఫీ, రాయం రమేష్, శ్రీనివాస్ చారి, వసంత, ప్రియాంక, సంధ్య తదితరులు హాజరయ్యారు. న్యాయమూర్తి నాగరాజు  మాట్లాడుతూ, భూపాలపల్లి జిల్లా ప్రజల ప్రేమ, సహకారం ఎప్పటికీ మరిచిపోలేనని తెలిపారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయ సంస్థ 2026 -27 విద్యా సంవత్సరానికి గాను ప్రవేశానికి ఈనెల 6వ తేదీ నుండి 25వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తున్నామని హాసన్ పర్తి గురుకుల కళాశాల ప్రిన్సిపల్ పి. సుధా కృష్ణ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సంవత్సరం పదో తరగతి పరీక్షలు హాజరైన విద్యార్థిని విద్యార్థులు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవచ్చని పేర్కొన్నారు. కామన్ ఎంట్రన్స్ టెస్ట్ లో సెలెక్ట్ అయిన అభ్యర్థులకు సిఓఈ వృత్తి విద్యలు సైనిక కళాశాలలో శిక్షణ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. అంతేగాక జూనియర్ కళాశాలలో ఎంపీసీ, బైపీసీ,ఎంఈసి, సీఈసీ, హెచ్ఈసి మొదలైన గ్రూపులలో ప్రవేశం పొందవచ్చు అని తెలిపారు పూర్తి వివరాల కోసం సమీపంలోని గురుకుల కళాశాలలో సంప్రదించవచ్చని హసన్పర్తి ప్రిన్సిపల్ పి .సుధాకృష్ణ తెలిపారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

పెద్దపల్లి,గోదావరిఖని,ఏప్రిల్ 20: పెద్దపల్లి,అనారోగ్యంతో పోరాడుతున్న డయాలసిస్ రోగికి సమాజం నుంచి అందిన సహాయం మరోసారి మానవత్వాన్ని ప్రతిబింబించింది.పెద్దపల్లి పట్టణానికి చెందిన శివసాయి మల్టీ ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్ ఆధ్వర్యంలో,సోమవారం,తురకల మద్దికుంట గ్రామానికి చెందిన డయాలసిస్ బాధితుడు రాచకొండ లక్ష్మణ్‌కు ఆర్థిక సహాయం అందజేశారు.ఈ సహాయాన్ని పెద్దపల్లి మున్సిపల్ కౌన్సిలర్ ములుగురి కమల్ చేతుల మీదుగా బాధిత కుటుంబానికి అందజేశారు.ఈ సందర్భంగా కౌన్సిలర్ ములుగురి కమల్ మాట్లాడరు,శివసాయి సంస్థ తమ లాభాల్లో భాగాన్ని కష్టాల్లో ఉన్నవారికి పంచడం గొప్ప విషయం అని అన్నారు.ఇటువంటి సహాయ కార్యక్రమాలు బాధిత కుటుంబాలకు కొంత ఊరటనిచ్చే ప్రయత్నమని పేర్కొన్నారు.సమాజంలో ఇలాంటి సేవా కార్యక్రమాలు మరింత పెరగాలని ఆకాంక్షించారు.శివసాయి సంస్థ చైర్మన్,డైరెక్టర్లు పెద్దపల్లి ప్రాంతంలో ప్రత్యేక శ్రద్ధతో సామాజిక సేవా కార్యక్రమాలు చేపడుతున్న తీరు ప్రశంసనీయం అని కమల్ అన్నారు.సంస్థ సేవలు వ్యాపార అభివృద్ధితో పాటు సామాజిక బాధ్యతను కూడా ప్రతిబింబిస్తున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు.మహిళల సాధికారతకు ప్రాధాన్యత ఇస్తూ,పెద్దపల్లి బ్రాంచ్‌లో కూడా కుట్టు శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేయాలని కౌన్సిలర్ సూచించారు.ప్రభుత్వం అందజేస్తున్న స్కూల్ యూనిఫాంల కుట్టు పనులను మహిళలకు అప్పగించేలా చైర్మన్,కమిషనర్‌లతో చర్చించి వారికి ఆర్థిక అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.శివసాయి సొసైటీ చేపడుతున్న సేవా కార్యక్రమాలు ఇతర సంస్థలకు ఆదర్శంగా నిలుస్తున్నాయని స్థానికులు పేర్కొన్నారు.కష్టాల్లో ఉన్నవారికి చేయూత అందించడంలో సమాజం ముందుకు రావడం అవసరమని ఈ సందర్భంగా పలువురు అభిప్రాయపడ్డారు

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

 కాళేశ్వరం ఆలయ పునఃప్రతిష్ఠ పనులకు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనమల రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయనున్న నేపథ్యంలో జిల్లా యంత్రాంగం ఏర్పాట్లను వేగవంతం చేసింది. ఈ క్రమంలో జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, జిల్లా ఎస్పీ సిరిసెట్టి సంకీర్త్, ఐఎస్‌డబ్ల్యూ అధికారులతో కలిసి కార్యక్రమ ఏర్పాట్లను సమగ్రంగా పరిశీలించారు. ఈ సందర్భంగా హెలిప్యాడ్ నిర్మాణం, అప్రోచ్ రోడ్ల పనులను ప్రత్యక్షంగా తనిఖీ చేశారు. కార్యక్రమం సజావుగా జరిగేలా అన్ని విభాగాల మధ్య సమన్వయం అవసరమని అధికారులు సూచించారు. అత్యవసర పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని అంబులెన్సులు సిద్ధంగా ఉంచాలని, తక్షణ వైద్య సేవల కోసం వైద్యులను అందుబాటులో ఉంచాలని జిల్లా వైద్యాధికారికి ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా భద్రతా పరమైన చర్యల్లో భాగంగా సేఫ్ హౌస్ ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి పర్యటనను దృష్టిలో ఉంచుకుని అన్ని ఏర్పాట్లు సమయానికి పూర్తి చేయాలని జిల్లా యంత్రాంగానికి కలెక్టర్ సూచించారు.
Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

 

మహాముత్తారం మండలం (రెడ్డిపల్లి): మహాముత్తారం మండలం రెడ్డిపల్లి గ్రామ కాంగ్రెస్ పార్టీ శాఖకు కొత్త అధ్యక్షునిగా ధరం సోత్ సారయ్యను నియమించారు. ఈ నియామకం ఐటీ మరియు పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఆదేశాల మేరకు చేపట్టినట్లు నాయకులు తెలిపారు. ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పక్కల సడవలి, నూతన అధ్యక్షుడికి పార్టీ కండువా కప్పి శుభాకాంక్షలు తెలియజేశారు. పార్టీ బలోపేతానికి కృషి చేయాలని, గ్రామ స్థాయిలో కాంగ్రెస్ పార్టీని మరింత బలపరచాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ ZPTC లింగమళ్ల శారద దుర్గయ్య, గ్రామ సర్పంచ్ సగుళం అనసూయ, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు జాటోత్ వంశీ రాజ్, మాజీ PACS చైర్మన్ ముక్కెర రాజమల్లు గౌడ్, మాజీ ZPTC మడిపల్లి సమ్మయ్య, మాజీ ఉపసర్పంచ్ వేముల మధుకర్ గౌడ్, నాయకులు నూకల రవి, సాగుళం నర్సింహా తదితరులు పాల్గొన్నారు. పార్టీ నాయకత్వం పట్ల కృతజ్ఞతలు తెలుపుతూ, గ్రామ అభివృద్ధి కోసం కృషి చేస్తానని నూతన అధ్యక్షుడు ధరం సోత్ సారయ్య తెలిపారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

 

కాటారం మండలం నస్తురుపల్లి గ్రామంలో రేపు జరగనున్న బహిరంగ సభ ఏర్పాట్లపై ఈరోజు ప్రముఖ నేతలు సమీక్ష నిర్వహించారు. రైతన్నలకు ప్రజా ప్రభుత్వం అందించనున్న “తీపి కబురు”గా ఏప్రిల్ 20న రైతు భరోసా రెండో విడత నిధుల విడుదల కార్యక్రమం జరగనుంది. ఈ నేపథ్యంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్‌లో ఐటీ మరియు శాసనసభ వ్యవహారాల మంత్రివర్యులు శ్రీధర్ బాబు , వ్యవసాయ శాఖ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు  పాల్గొన్నారు. కార్యక్రమానికి సంబంధించి ఏర్పాట్లను వారు సమీక్షిస్తూ అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ ప్రెస్ మీట్‌లో భూపాలపల్లి జిల్లా కలెక్టర్, స్థానిక ఎమ్మెల్యే , ప్రజాప్రతినిధులు, అధికారులు హాజరయ్యారు. రేపటి సభ విజయవంతం కావడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

కాటారం, ఏప్రిల్ 19:  ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం నస్తూరుపల్లిలో ఏర్పాటు చేస్తున్న బహిరంగ సభా స్థలాన్ని అధికారులు సమగ్రంగా పరిశీలించారు. అడిషనల్ కలెక్టర్ (లోకల్ బాడీస్)  సభా ప్రాంగణాన్ని సందర్శించి వివిధ ఏర్పాట్లపై అధికారులకు కీలక సూచనలు జారీ చేశారు. సభకు వచ్చే ప్రజల సంఖ్యను దృష్టిలో ఉంచుకుని జనరల్ పార్కింగ్‌తో పాటు VIP, VVIP పార్కింగ్ స్థలాలను సక్రమంగా ఏర్పాటు చేయాలని సూచించారు. అలాగే త్రాగునీటి సౌకర్యాలు, తగిన లైటింగ్ ఏర్పాట్లు, శుభ్రమైన టాయిలెట్ సౌకర్యాలను కల్పించేందుకు ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని ఆదేశించారు. పనులు వేగవంతంగా పూర్తి చేసి ఎలాంటి ఇబ్బందులు లేకుండా సభ నిర్వహణ జరగేలా చర్యలు తీసుకోవాలని ఆర్గనైజర్లకు స్పష్టం చేశారు. భద్రతా పరమైన అంశాలపై కూడా అప్రమత్తంగా ఉండాలని సంబంధిత శాఖలను ఆదేశించారు. ఈ పరిశీలన కార్యక్రమంలో డివిజనల్ పంచాయతీ అధికారి, ఎంపీడీవో, తహసీల్దార్, ఎంపీవో, ఆర్ అండ్ బి, మిషన్ భగీరథ శాఖల అధికారులు, ఎస్‌ఐ, పంచాయతీ కార్యదర్శులు మరియు ఇతర సంబంధిత అధికారులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి పర్యటనకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసే దిశగా అధికారులు కసరత్తు వేగవంతం చేశారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

 

బసవేశ్వరుడు (1134–1196) హైందవ మతాన్ని ఉద్దరించిన ప్రముఖులలో ఒకడు. ఈతడిని బసవన్న, బసవుడు అని మరియు విశ్వగురు అని పిలుస్తారు. సమాజంలో కుల వ్వవస్థను, వర్ణ భేదాలను, లింగ వివక్షతను సమూలంగా వ్యతిరేకించిన అభ్యుదయ వాది. వీరశైవం ఇతను బోధించిన మార్గం. కర్ణాటకలోని బాగేవాడి ఇతని జన్మస్థలం. తండ్రి మాదిరాజు, తల్లి మాదాంబ. చిన్న వయసులోనే శైవ పురాణ గాధలను అవగతం చేసుకున్న బసవనికి కర్మకాండపై విశ్వాసం పోయింది. ఉపనయనం చేయ నిశ్చయించిన తల్లిదండ్రులను వదలి కూడలి అనే పుణ్యక్షేత్రం చేరిన బసవుడు అక్కడ వేంచేసియున్న సంగమేశ్వరుణ్ణి నిష్టతో ధ్యానించాడు. శివుడు అతని కలలో కనిపించి అభయమిచ్చాడని, నందీశ్వరుడు పంచాక్షరీ మంత్రం ఉపదేశించాడని చెబుతారు. శివుని ఆనతి మేరకు మంగళవాడ (కళ్యాణ పురం) చేరుకుంటాడు. ఇతడు 12వ శతాబ్దంలో కర్ణాటక   రాష్ట్రాని పాలించిన బిజ్జలుని కొలువులో చిన్న ఉద్యోగిగా చేరి, అతని భాండాగారానికి ప్రధాన అధికారియై భండారీ బసవడుగ ఖ్యాతినొందాడు. సామర్ధ్యమునకు నిజాయితీ తోడుకాగా భక్త భండారి బిజ్జలుని ప్రధానామాత్యుడిగా పదవి అందుకున్నాడు. ఒక వైపు రాజ్యపాలనలో ప్రధాన భూమిక నిర్వహిస్తూ బసవడు భగవద్భక్తి వ్యాప్తికి నిరంతర కృషి చేశాడు. అతని బోధనలలోని సమదృష్టి పలువురిని ఆకర్షించింది. వీరశైవ మతానికి తిరిగి పట్టం కట్టిన బసవని ఖ్యాతి కర్ణాటక ఎల్లలు దాటి ఆంధ్రదేశంలోను వ్యాప్తి చెందినది. ప్రతిరోజు లక్షా తొంభై ఆరువేల మంది జంగములకు మృష్టాన్నములతో అర్చించి అనంతరం తాను భుజించేవాడట. బసవడు తన ఉపదేశాలు ప్రజలకు అందుబాటులో ఉండే రీతిగా వచనాలు వ్రాసాడు. వీటిలో సూక్ష్మమైన తత్త్వం సులువుగా బోధపడేది. సాహిత్య పరంగా కూడా బసవేశ్వరుని వచనాలకు చక్కని గౌరవం లభించింది. ఇతడు మొత్తం 64 లక్షల వచనాలు కూర్చినట్లు ప్రతీతి. కానీ, ఈనాడు కొన్ని వేలు మాత్రమే మనకు లభ్యమైనాయి. బసవేశ్వరుడు స్థాపించిన వేదాంత గోష్టికి 'అనుభవ మండపం' అని పేరు. బసవేశవరుడు తన చేతుల మీదుగా ఒక వర్ణాంతర వివాహం జరిపాడు. అది ఆనాటి సంఘంలో తీవ్ర వ్యతిరేకతకు దారి తీసింది. నూతన దంపదుతులు హత్యకు గురౌతారు. ఈ సంఘటన బసవుని హృదయాన్ని కలచివేస్తుంది. తన అమాత్య పదవిని వదలి బసవేశ్వరుడు కూడలి సంగమేశ్వరుని సన్నిధికి చేరి, కొంతకాలానికి ఆయనలో లీనమైపోతాడు. బసవేశ్వరుడు బోధించిన సంప్రదాయమే అనంతర కాలంలో "లింగాయత ధర్మం"గా స్థిరపడింది. పాల్కురికి సోమనాథుడు తెలుగులో బసవపురాణం రాశాడు. వైదిక కర్మలంటే చిన్నతనం నుంచీ బసవేశ్వరుడికి పడేదికాదు. 


ఉపనయనం చేయాలని తండ్రి ప్రయత్నిస్తే బసవేశ్వరుడు ఇంటినుంచి పారిపోయాడు.

శివుడే సర్వేశ్వరుడు, శివుడిని మించిన వాడులేడన్న విశ్వాసంతో శివతత్వ ప్రచారానికి పూనుకున్నాడు. అలా వీరశైవ మతానికి బీజాలు వేశాడు. ఆయన ఉపదేశాలు: 


మనుషులందరూ ఒక్కటే. కులాలు, ఉపకులాలు లేవు. 

శివుడే సత్యం, నిత్యం. 

దేహమే దేవాలయం. 

స్త్రీ పురుష భేదంలేదు. 

శ్రమను మించిన సౌందర్యంలేదు. 

భక్తికన్నా సత్ప్రవర్తనే ముఖ్యం. 


దొంగలింపకు, హత్యలు చేయకు 

 ఆబద్దలు అడాకు, కోపగింపకు ఆత్మస్తుతి పరనిందల చెయ్యరాధు.


అన్నమయ్య, వేమన, వీరబ్రహ్మం భావాల్లో విప్లవాత్మక మార్పులు రావడానికి పరోక్షంగా బసవేశ్వరుడే కారణం అని అంటారు. 


బసవేశ్వరూని వచనాలు:

కాయమే (శరీరం) కైలాసమని చాటి శ్రమ జీవనానికి గౌరవస్థానం కల్పించిన బసవేశ్వరుడు నందీశ్వరుని అవతారంగా భావిస్తారు. బసవేశ్వరుని దివ్య జీవితగాధను పాల్కురికి సోమనాధుడు రచించిన 'బసవ పురాణం' తెలుగు సాహిత్యంలో ప్రసిద్ధమయింది. 

మానవతావాది బసవన్న :

 ఒక్కరోజు సాయంత్రం వేళ దీపం వెలుతురులో మహాత్మా బసవేశ్వరుడు ఏదో చదువుతూ కూర్చొన్నాడు. ఆయన్ని కలవడానికి కొందరు పెద్దలు వచ్చారు. అందరూ బసవేశ్వరుడికి నమస్కరించి కూర్చొన్నారు. వారంతా ఏదో కార్యార్థమై తనవద్దకు వచ్చారని గ్రహించిన బసవేశ్వరుడు ‘‘నావద్దకు వ్యక్తిగత పని గురించి వచ్చారా? లేదంటే ప్రభుత్వ పని గురించి వచ్చారా? (బసవేశ్వరుడు బిజ్జల మహారాజు కొలువులో మహామంత్రి)’’ అని ప్రశ్నించాడు. 

‘‘మతపరమైన చర్చ గురించి మీవద్దకు వచ్చాం’’ అన్నారు పెద్దలు.  

వెంటనే బసవేశ్వరుడు అప్పటివరకు ఏ దీపం వెలుగులో తాను పనిచేసుకుంటున్నాడో, ఆ దీపాన్ని ఆర్పివేసి, మరో దీపం వెలిగించి వారితో మాట్లాడటానికి ఉపక్రమించాడు. 

విషయం పెద్దలకు అర్థంకాలేదు. దీపం మార్చడంలో ఆంతర్యం ఏమిటో? అన్నట్లు బసవేశ్వరునివైపు చూసారు. మొదటి దీపం ప్రభుత్వానిది, రెండవది నా స్వంతానిది అన్నాడు బసవేశ్వరుడు. మతపరమైన చర్చ ధర్మసంబంధంగా నా వ్యక్తిగత విషయం. ఇందుకు ప్రభుత్వం వారి సొమ్ము వాడటం ‘తగదని’ అలా చేసాను అని బదులిచ్చాడు. ఒకచోట ఇసుమంతయినను పసిడి నాకెందుకు? అంటాడు. కాని ఈనాటి పరిస్థితి? 

దాదాపు 800 ఏళ్ళ క్రితమే ఇంత గొప్ప రాజనీతి దృక్పథాన్ని మనకు అందించి నైతిక విలువలను ఆచరించి చూపిన మహనీయుడు బసవేశ్వరుడు. క్రీ.శ.1130-1170 మధ్య మాదలాంబిక, మాదిరాజు దంపతులకు కర్ణాటక రాష్ట్రంలోని ‘హింగుళేశ్వర బాగెవాడ’ జన్మించాడు బసవేశ్వరుడు. బసవేశ్వరుడి ప్రభావం కర్ణాటక ప్రాంతంలో చాలా ఎక్కువ. ఆయన చెప్పిన ‘మాటలు’ వచనాలుగా ప్రసిద్ధి చెందాయి. ఆయన ప్రభావంతోనే తెలుగులో పాల్కురికి సోమనాథుడు విశేషమైన రచనలు చేశాడు. తెలుగులో మొట్టమొదటి దేశిపురాణం బసవపురాణం. మొదటి శతకం వృషాధిప శతకం. ఈ రెండూ సోమనాథుడు బసవేశ్వరుని ప్రభావంతో రచించినవే. పాల్కురికి సోమనాథుడు బసవేశ్వరుని రెండవ శంకరుడు అని సంబోదిన్చెవాడు. 

కుల రహిత సమాజాన్ని 12వ శతాబ్దంలో ప్రబోధించి ఆచరించి చూపించిన ఘనుడు బసవణ్ణ. శెట్టి అయిన సిరియాళుణ్ణి, రజకుడైన మడివాలు మాచయ్యను, చండాలుడిగా చెప్పే కక్కయ్యను, మాదిగ కులస్థుడైన చెన్నయ్యను, బాలిక అయిన గొడ గూచిని, స్ర్తి అయిన అక్కమహాదేవిని కుల, బాల, స్ర్తి, పురుష బేధం పాటించకుండా శివభక్తి ప్రస్థానంలో మహోన్నత స్థానంలో నిలబెట్టాడు బసవేశ్వరుడు. 

అలనాడు కులాంతర వివాహమును జరిపించి కులాలు మానవ సృష్టియే అని పలికిన మహాత్ముడు బసవన్న. శివనాగుమ్య యనెడి యంత్యజుడుండెను. అతడు దీక్షను స్వీకరించి లింగాంగుడయ్యెను. అతడు దాసోహము చేయగా బసవన్న యతని యింటికేగా ప్రసాదమును బడసెను. గుణవంతులందరు సమానముగా గౌరవింపదగిన వారని తెలిపెను. 

కులాన్ని త్రోసి రాజని సర్వమానముల చేతిలో చిన్న లింగాన్ని పెట్టి లింగార్చన చేయమన్నాడు. పరమేశ్వరుణ్ణి ప్రతి మనిషి ఎదపై నిలిపే లింగధారణ చేయించాడు. దేవుణ్ణి ప్రతివారి హస్తంలో సుప్రతిష్ఠం చేసి కులపు కుళ్ళును కడిగివేసాడు. ఎంత మాలిన్యమైన హృదయమైనా పరమేశ్వరతత్వం పరిఢవిల్లినపుడు ‘‘అంతా ఈశ్వరమనే’’ సత్యాన్ని లోకానికి చాటి చెప్పాడు బసవేశ్వరుడు. ఈ లింగార్చన ఒక ధ్యానయోగం. ఈ రోజుల్లో ఎందరో తమ మనస్సు శాంతి, ఏకాగ్రత కొరకు ధ్యానం అభ్యాసం చేస్తున్నారు. కాని బసవణ్ణి ఆ రోజుల్లోనే సహజంగానే ధ్యానం కుదిరే పద్ధతి వ్యాప్తి చేసాడు. 

ధనమే ప్రధానం అనుకొనేవాడికి శివుణ్ణి చేరడం సాధ్యంకాదు అంటాడు బసవన్న. వడ్డీ వ్యాపారం మానవుల ఆర్థిక అసమానతలకు కారణం అని ఆనాడే నిరసించాడు. ధనవ్యామోహం దుర్బలమైంది అనేది బసవణ్ణ ప్రగాఢ విశ్వాసం. సత్యమే దైవము మరియు అన్ని ప్రాణుల యెడల దయకు మించిన దైవము మరొకటి లేదంటాడు. బసవేశ్వరుడు అస్పృశ్యతా నివారణ, స్ర్తిగౌరవము పెంపుదల, స్ర్తి సమానత్వము, కుటీర పరిశ్రమల పెంపు, ఎకనమిక్ ఈక్వాలిటీ మొదలైన సంస్కరణలు ఆరోజుల్లో అమలుపరచి సత్ఫలితాలను సాధించాడు. సత్యము, అహింస, భూతదయ గురించి ఎన్నో అనుసరించదగిన వచనాలను వచించిన మహాపురుషుడు బసవన్న. 

 గొప్ప మానవతావాది, సంఘ సంస్కర్త, రాజనీతిజ్ఞుడు, సద్గుణ సంపన్నుడు, అసమాన మేధాసంపన్నుడు అయిన మహాత్మా బసవేశ్వర జయంతి ప్రతి సంవత్సరము అక్షయ తృతీయ రోజు ప్రపంచమంతా జరుపబడును. ఇది వారి 892వ జయంతి సంద్బంగా ఇవే మా శతాకోటి వందనాలు.



                                                                                  K.NAGARAJ

                                                               ADVOCATE Cell.No.8096755811

                                  

                              


Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

 

జయశంకర్ భూపాలపల్లి జిల్లా, అంబేద్కర్ చౌరస్తా: తెలంగాణ రాజ్యాధికార పార్టీ (టీఆర్పీ) ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నకు గురువారం ఘనంగా పాలాభిషేకం నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు రవి పటేల్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన కులగణన సర్వే నివేదికను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం టీఆర్పీ పార్టీ సాధించిన రెండో విజయమని పేర్కొన్నారు. శాసన మండలిలో ప్రభుత్వాన్ని నిలదీస్తూ, ఈ నివేదికను పబ్లిక్ డొమైన్‌లో ఉంచడంలో తీన్మార్ మల్లన్న కీలక పాత్ర పోషించారని తెలిపారు. రాష్ట్రంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలు కలిపి 94 శాతం ఉన్నాయని, వారి అభ్యున్నతి కోసం టీఆర్పీ నిరంతరం పోరాటం కొనసాగిస్తోందన్నారు. పేద, బడుగు, బలహీన వర్గాల హక్కుల కోసం కట్టుబడి పనిచేస్తున్న ఏకైక పార్టీ టీఆర్పీదేనని పేర్కొన్నారు. అలాగే గతంలో “ముగ్గురు పిల్లల నిబంధన” ఎత్తివేయడంలో కూడా తీన్మార్ మల్లన్న పోరాటం ఫలించిందని, అది పార్టీకి తొలి విజయమైతే, కులగణన నివేదిక విడుదల రెండో విజయమని వివరించారు. శాసన మండలిలో ప్రజా సమస్యలపై నిరంతరం ప్రశ్నిస్తూ, బడుగు వర్గాల పక్షాన నిలబడుతున్నామని అన్నారు. రాబోయే రోజుల్లో ప్రజలు మార్పు కోరుకుంటారని, 2028లో టీఆర్పీ అధికారంలోకి వస్తుందనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. విద్య, వైద్యం వంటి రంగాల్లో కార్పొరేట్ స్థాయి సేవలను ప్రజలకు అందించేందుకు పోరాటం కొనసాగిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు ఇనుగాల ప్రణయ్, జిల్లా క్రమశిక్షణ కమిటీ అధ్యక్షుడు గండు కరుణాకర్, యువజన విభాగం అధ్యక్షుడు బండి సునీల్, మహిళా విభాగం అధ్యక్షురాలు సామల శ్రీలత, జిల్లా కోశాధికారి జినూకల శ్రీను, ఎలక్ట్రిషన్ యూనియన్ అధ్యక్షుడు అశోక్ తదితర నాయకులు పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

జయశంకర్ భూపాలపల్లి జిల్లా, కాటారం మండలం బయ్యారం గ్రామంలో సర్పంచ్ ఇనుగాల లింగయ్య ఆధ్వర్యంలో గ్రామసభను గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా డీసీవో పర్యవేక్షణ అధికారి కృష్ణ మాట్లాడుతూ చిన్న కాళేశ్వరం ప్రాజెక్ట్ పరిధిలో కాలువ నిర్మాణం కారణంగా భూములు కోల్పోయిన భూనిర్వాసితుల పేర్లను గ్రామసభలో చదివించారు. వారికి ఎలాంటి అభ్యంతరాలు ఉన్నా లిఖితపూర్వకంగా పంచాయతీ కార్యదర్శి లేదా తహసీల్దార్ కార్యాలయానికి సమర్పించాలని సూచించారు. అనంతరం భూములు కోల్పోయిన రైతులు మాట్లాడుతూ ప్రస్తుత మార్కెట్ ధర కంటే అధికంగా నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా సంవత్సరాలుగా భూమిని సాగుచేస్తున్న రైతులకు పట్టాలు మరియు యాజమాన్య హక్కులు కల్పించాలని డిప్యూటీ తహసీల్దార్‌ను కోరారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ జాగిరి శ్రీనివాస్ గౌడ్, వార్డు సభ్యులు గుంటి శ్రీనివాస్, సురేందర్, మహేష్, పంచాయతీ కార్యదర్శి లక్ష్మి, ఇరిగేషన్ ఏఈ, డిప్యూటీ తహసీల్దార్ రాంమోహన్ గౌడ్, జూనియర్ అసిస్టెంట్ రమా, విఆర్‌ఏలు ఓదెలు, భాను ప్రసాద్, మాజీ సర్పంచ్ సంజీవయ్య, కాంగ్రెస్ గ్రామశాఖ అధ్యక్షుడు జాగిరి రాజబాబు, నాయకులు అయిలి శ్రీనివాస్, గోగు సమ్మయ్య, మాజీ పీఏసీఎస్ డైరెక్టర్ అయిలి రాజబాబు, కారోబార్ మీర్జా సాబీర్ బేగ్, పారిశుధ్య సిబ్బంది, గ్రామ ప్రజలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

 

హనుమకొండ నయీమ్ నగర్‌లో తెలంగాణ రాజ్యాధికార పార్టీ భూపాలపల్లి జిల్లా నాయకుడు వైద్య లక్ష్మణ్ ఆధ్వర్యంలో నూతన జాబ్ కన్సల్టెన్సీ ఆఫీస్ ప్రారంభమైంది. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి జిల్లా అధ్యక్షుడు రవి పటేల్ ముఖ్య అతిథిగా హాజరై రిబ్బన్ కట్ చేసి కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడంలో ఈ కన్సల్టెన్సీ కీలక పాత్ర పోషించాలని ఆకాంక్షించారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు సమాజానికి ఎంతో ఉపయోగకరమని, యువతకు మార్గదర్శకంగా నిలుస్తాయని పేర్కొన్నారు.

వైద్య లక్ష్మణ్ చేపట్టిన ఈ ప్రయత్నాన్ని అభినందిస్తూ, కొత్తగా ప్రారంభమైన ఈ ఆఫీస్ విజయవంతంగా కొనసాగాలని, మరింత అభివృద్ధి సాధించాలని శుభాకాంక్షలు తెలియజేశారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

 


హనుమకొండలో తెలంగాణ ప్రజా సాంస్కృతిక కళాకారుల సంఘం రాష్ట్ర, జిల్లా కమిటీ సభ్యులు డప్పు, కోలాటం, భజన కళాకారులతో కలిసి కీలక సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాజ్యాధికార పార్టీ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు రవి పటేల్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

సమావేశంలో రాష్ట్ర, జిల్లా కమిటీ సభ్యులు పరస్పరం పరిచయ కార్యక్రమం నిర్వహించుకుని, అనంతరం కళాకారులు తమ సమస్యలను విపులంగా చర్చించారు. ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కుడుముల కుమార్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో సాంప్రదాయ కళలను కొనసాగిస్తున్న కళాకారుల పరిస్థితి దయనీయంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. కళాకారుల సమస్యలను పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న దృష్టికి తీసుకెళ్లనున్నట్లు తెలిపారు.


ముఖ్య అతిథి రవి పటేల్ మాట్లాడుతూ కళాకారుల సమస్యలను ఎమ్మెల్సీ మల్లన్నకు వివరించి, శాసన మండలిలో చర్చకు తీసుకెళ్లేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కళాకారులకు గుర్తింపు కార్డులు ఇవ్వడం, ప్రభుత్వ కార్యక్రమాల్లో ప్రాధాన్యత కల్పించడం వంటి అంశాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానన్నారు.

అలాగే త్వరలోనే ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి, కళాకారులు తమ సమస్యలను నేరుగా తెలియజేసే అవకాశాన్ని కల్పిస్తామని పేర్కొన్నారు. కార్యక్రమానికి ఆహ్వానించినందుకు సంఘం నాయకులకు, కళాకారులకు రవి పటేల్ కృతజ్ఞతలు తెలిపారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

 

భూపాలపల్లి: రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారిన కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు సంబంధించిన పీసీ ఘోష్ కమిషన్ నివేదికపై హైకోర్టు తీర్పు మరోసారి వాయిదా పడింది. ఇప్పటికే వాదనలు పూర్తయిన ఈ కేసులో, తుది తీర్పును ఈ నెల 22వ తేదీన వెల్లడించనున్నట్లు ఉన్నత న్యాయస్థానం తెలిపింది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం, ఖర్చులు, సాంకేతిక అంశాలపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ప్రభుత్వం పీసీ ఘోష్ కమిషన్‌ను నియమించింది. కమిషన్ సమర్పించిన నివేదికపై వివిధ అభ్యంతరాలు వ్యక్తమవడంతో, దాన్ని సవాలు చేస్తూ పలువురు ప్రముఖులు హైకోర్టును ఆశ్రయించారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి హరీశ్ రావు, సీనియర్ ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్, ఎస్కే జోషి వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. కమిషన్ విధానం, దాని పరిధి, నివేదిక చట్టబద్ధతపై వారు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. కమిషన్ నియామకం రాజ్యాంగ విరుద్ధమని, సహజ న్యాయ సూత్రాలు పాటించలేదని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు వాదించారు. ఇదే సమయంలో ప్రభుత్వం తరఫు న్యాయవాదులు కమిషన్ నియామకం పూర్తిగా చట్టబద్ధమని, ప్రజా ప్రయోజనాల దృష్ట్యా తీసుకున్న నిర్ణయమని కోర్టుకు వివరించారు. కాళేశ్వరం వంటి భారీ ప్రాజెక్టుపై వచ్చిన అనుమానాలను నివృత్తి చేయడం అవసరమని, అందుకే కమిషన్ ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. ఈ కేసులో ఇరు పక్షాల వాదనలు సమగ్రంగా విన్న హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. అయితే, నిర్ణయాన్ని ప్రకటించాల్సిన రోజున మరోసారి వాయిదా వేయడం ఆసక్తికరంగా మారింది. ఈ వ్యవహారం రాష్ట్ర రాజకీయాల్లో ప్రభావం చూపే అవకాశముండటంతో, అన్ని వర్గాల దృష్టి ఇప్పుడు 22వ తేదీపై నిలిచింది. కాళేశ్వరం ప్రాజెక్టు ఇప్పటికే రాజకీయ వివాదాలకు కేంద్రబిందువుగా మారిన నేపథ్యంలో, హైకోర్టు తుది తీర్పు కీలక మలుపు తిప్పే అవకాశముంది. కమిషన్ నివేదిక చెల్లుబాటు అవుతుందా? లేక రద్దవుతుందా? అనే అంశంపై స్పష్టత రానుంది. తుది తీర్పుతో రాష్ట్ర రాజకీయాల్లో ఏ మార్పులు చోటుచేసుకుంటాయో చూడాలి.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

 

భూపాలపల్లి, ఏప్రిల్ 9 : జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో విద్యుత్ ఆర్టిజన్ కార్మికుల నిరవధిక సమ్మెకు తెలంగాణ రాజ్యాధికార పార్టీ జిల్లా అధ్యక్షుడు రవి పటేల్ సంపూర్ణ మద్దతు ప్రకటించారు. భూపాలపల్లి KTPP ప్రధాన ద్వారం ఎదుట తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్ ఎంప్లాయిస్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో జరుగుతున్న సమ్మెలో ఆయన పాల్గొన్నారు. గత రెండు రోజులుగా తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం ఆర్టిజన్ కార్మికులు చేపట్టిన సమ్మె నేపథ్యంలో, వారి సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకున్న రవి పటేల్ అనంతరం మాట్లాడారు. ఆర్టిజన్ కార్మికులకు వెంటనే APSEB సర్వీస్ రూల్స్ అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఇంకా ఆర్టిజన్లుగా విలీనం కాని కార్మికులను తక్షణమే ఆర్టిజన్లుగా గుర్తించి, వారి విద్యార్హతలకు అనుగుణంగా కన్వర్షన్ కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. అలాగే భూపాలపల్లి డివిజన్ కార్యాలయం ముందు కొనసాగుతున్న నిరసన దీక్షలకు కూడా ఆయన సంఘీభావం తెలిపారు. జిల్లాలో పనిచేస్తున్న అన్మాండ్ కార్మికులను ఆర్టిజన్లుగా గుర్తించి, వారికి భద్రతా చర్యలు కల్పించాలని, విద్యార్హతల ఆధారంగా పదోన్నతులు ఇవ్వాలని రవి పటేల్ డిమాండ్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 23 వేల మంది ఆర్టిజన్ కార్మికులు ప్రాణాలను పణంగా పెట్టి సేవలు అందిస్తున్నారని పేర్కొన్నారు. విద్యుత్ శాఖ ఈ కార్మికుల సేవలపై ఆధారపడి ఉందని, వారి సమస్యలను విద్యుత్ శాఖ మరియు రాష్ట్ర ప్రభుత్వం సమన్వయంతో తక్షణమే పరిష్కరించాలని ఆయన కోరారు. ఆర్టిజన్ కార్మికులు లేకుండా విద్యుత్ శాఖ ఒక్కరోజు కూడా ముందుకు సాగలేదని స్పష్టం చేశారు. డిమాండ్లపై ప్రభుత్వం స్పందించకపోతే రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించిన రవి పటేల్, భూపాలపల్లి జిల్లాలో కార్మికులు ఎప్పుడైనా పిలుపునిచ్చినా పార్టీ నాయకులు, కార్యకర్తలు ముందుండి పోరాడతారని హామీ ఇచ్చారు. కార్మికులు ధైర్యం కోల్పోవద్దని, పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సింగరేణి కార్మిక విభాగం జిల్లా అధ్యక్షులు అనంతల సంపత్ (బొట్టు), ఎలక్ట్రిషియన్ కార్మిక విభాగం జిల్లా అధ్యక్షుడు అశోక్, జిల్లా నాయకులు ప్రణయ్, రామ్ చరణ్ తదితరులు పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

 

హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఆరు గ్యారెంటీల అమలుపై మంత్రి శ్రీధర్ బాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం ఇచ్చిన ప్రతి హామీని నూటికి నూరు శాతం అమలు చేయడం తమ బాధ్యతగా భావిస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. ముఖ్యంగా ఆడబిడ్డల పెళ్లిళ్లకు తులం బంగారం అందించే హామీతో సహా అన్ని సంక్షేమ పథకాలను ఈ ఐదేళ్ల పదవీకాలంలో పూర్తిగా అమలు చేస్తామని తెలిపారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చిన తర్వాతే మళ్లీ ఓట్ల కోసం వారి ముందుకు వెళ్తామని ఆయన స్పష్టంచేశారు. ప్రభుత్వం మాట తప్పదని, ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవడమే తమ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమం రెండింటినీ సమానంగా ముందుకు తీసుకెళ్తున్నామని చెప్పారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్‌పై మంత్రి శ్రీధర్ బాబు విమర్శలు గుప్పించారు. ప్రతిపక్ష పార్టీ కావాలనే తప్పుడు ప్రచారం చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. ప్రభుత్వ పనితీరును దెబ్బతీయడానికే అబద్ధపు వార్తలను వ్యాప్తి చేస్తున్నారని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం సమన్వయంతో పనిచేస్తోందని, మంత్రులందరూ కలిసి సంక్షేమ కార్యక్రమాల అమలుపై దృష్టి సారిస్తున్నారని తెలిపారు. ప్రతి వర్గానికి న్యాయం చేసే విధంగా పథకాలను అమలు చేస్తూ ముందుకు సాగుతున్నామని చెప్పారు. రాష్ట్ర ప్రజల సంక్షేమమే తమ ప్రభుత్వ ధ్యేయమని, ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకునే వరకు విశ్రాంతి తీసుకోమని మంత్రి శ్రీధర్ బాబు స్పష్టం చేశారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

 

జయశంకర్ భూపాలపల్లి జిల్లా రూరల్ మొగుళ్లపల్లి మండలంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ యూత్ అధ్యక్షుడు రవి కుమార్ యాదవ్ సోదరి వివాహం ఘనంగా జరిగింది. ఈ శుభకార్యానికి తెలంగాణ రాజ్యాధికార పార్టీ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు రవి పటేల్ ముఖ్య అతిథిగా హాజరై నూతన దంపతులు బండారి శివాని – అశోక్ యాదవ్‌లను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా ఆయన వధూవరులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, సుఖసంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు. వివాహ వేడుకలో జిల్లా ఉపాధ్యక్షులు ఇనుగాల ప్రణయ్ రాజ్, జిల్లా సింగరేణి కార్మిక విభాగం అధ్యక్షుడు అనంతుల సంపత్ బొట్టు, జిల్లా క్రమశిక్షణ కమిటీ అధ్యక్షుడు గండు కరుణాకర్, జిల్లా నాయకులు వైద్య లక్ష్మణ్ తదితరులు పాల్గొని దంపతులను ఆశీర్వదించారు. ఈ వేడుకకు పెద్ద సంఖ్యలో పార్టీ కార్యకర్తలు, స్థానిక ప్రజలు హాజరై సందడి చేశారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

 

కాటారం మండలంలోని బయ్యారం నుంచి పోతులవాయి గ్రామం వరకు వెళ్లే ప్రధాన రహదారి గుంతలతో దెబ్బతిని వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తోంది. ఈ మార్గంలో అనేక చోట్ల పెద్ద గుంతలు ఏర్పడటంతో ప్రయాణం ప్రమాదకరంగా మారింది. ప్రతిరోజూ ఈ రహదారిని వినియోగించే ద్విచక్ర వాహనదారులు, ఆటో డ్రైవర్లు ప్రమాద భయంతో ప్రయాణిస్తున్నారు. ముఖ్యంగా రాత్రి సమయంలో గుంతలు స్పష్టంగా కనిపించకపోవడంతో ప్రమాదాలు సంభవించే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పలు సందర్భాల్లో చిన్నపాటి ప్రమాదాలు కూడా చోటుచేసుకున్నట్లు సమాచారం. అయినప్పటికీ ఇప్పటివరకు సంబంధిత అధికారులు స్పందించకపోవడం పట్ల ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు తక్షణమే స్పందించి రహదారి మరమ్మతులు చేపట్టి ప్రజలకు సురక్షిత ప్రయాణం కల్పించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

 

TG: మానవత్వాన్ని మర్చిపోయేలా చేసిన దారుణ ఘటన హనుమకొండ జిల్లా పున్నేలులో చోటుచేసుకుంది. కొడుకు కావాలనే అంధ విశ్వాసం, మూర్ఖమైన ఆశ ఒక తండ్రిని కిరాతకుడిగా మార్చింది. అజహరుద్దీన్ అనే వ్యక్తి తన గర్భిణి భార్యతో పాటు ఇద్దరు అమాయక కూతుళ్లను స్విమ్మింగ్ పూల్‌లో ముంచి హత్య చేసిన ఘటన రాష్ట్రాన్ని కుదిపేస్తోంది. ఇంకోసారి కూడా ఆడపిల్ల పుడుతుందేమోనన్న అనుమానంతో, తనకే ప్రాణంగా ఉండాల్సిన కుటుంబాన్ని చంపేయడం ప్రతి ఒక్కరినీ కలచివేస్తోంది. “నాన్న” అని పిలిచిన ఆ చిన్నారుల ప్రేమ కూడా అతని గుండెను కరిగించలేకపోయింది. ఈ ఘటనపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కూతుళ్లపై వివక్ష ఇంకా సమాజంలో బతికే ఉందనే చేదు నిజాన్ని ఈ దారుణం మరోసారి బయటపెట్టింది.