హనుమకొండ నయీమ్ నగర్‌లో తెలంగాణ రాజ్యాధికార పార్టీ భూపాలపల్లి జిల్లా నాయకుడు వైద్య లక్ష్మణ్ ఆధ్వర్యంలో నూతన జాబ్ కన్సల్టెన్సీ ఆఫీస్ ప్రారంభమైంది. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి జిల్లా అధ్యక్షుడు రవి పటేల్ ముఖ్య అతిథిగా హాజరై రిబ్బన్ కట్ చేసి కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడంలో ఈ కన్సల్టెన్సీ కీలక పాత్ర పోషించాలని ఆకాంక్షించారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు సమాజానికి ఎంతో ఉపయోగకరమని, యువతకు మార్గదర్శకంగా నిలుస్తాయని పేర్కొన్నారు.వైద్య లక్ష్మణ్ చేపట్టిన ఈ ప్రయత్నాన్ని అభినందిస్తూ, కొత్తగా ప్రారంభమైన ఈ ఆఫీస్ విజయవంతంగా కొనసాగాలని, మరింత అభివృద్ధి సాధించాలని శుభాకాంక్షలు తెలియజేశారు.
Home
hanamkonda (హనుమకొండ)
హనుమకొండలో నూతన జాబ్ కన్సల్టెన్సీ ఆఫీస్ ప్రారంభం – యువతకు ఉపాధి అవకాశాలపై దృష్టి


Post A Comment: