Articles by "జయశంకర్ భూపాలపల్లి జిల్లా"
Showing posts with label జయశంకర్ భూపాలపల్లి జిల్లా. Show all posts
Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

జయశంకర్ భూపాలపల్లి జిల్లా  తెలంగాణ తొలి, మలి దశ ఉద్యమాలకు ఊపిరిపోసి, బడుగు, బలహీన వర్గాలు, చేనేత కార్మికుల హక్కుల కోసం విశేషంగా కృషి చేసిన ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలు భావితరాలకు మార్గదర్శకమని తెలంగాణ రాజ్యాధికార పార్టీ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు రవి పటేల్ అన్నారు. బాపూజీ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు.

ఈ సందర్భంగా రవి పటేల్ మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజల హక్కులు, స్వరాష్ట్ర సాధన కోసం కొండా లక్ష్మణ్ బాపూజీ తన మంత్రి పదవిని సైతం త్యాగం చేశారని గుర్తుచేశారు. పదవుల కంటే ప్రజల ఆకాంక్షలకే ప్రాధాన్యతనిచ్చిన ఆయన త్యాగం, పోరాట స్ఫూర్తి అందరికీ ఆదర్శమన్నారు. బడుగు, బలహీన వర్గాలు, చేనేత కార్మికుల అభ్యున్నతికి బాపూజీ చేసిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు.

బాపూజీ ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని రవి పటేల్ పిలుపునిచ్చారు. సామాజిక న్యాయం కోసం ఆయన చూపిన మార్గంలో పయనించడమే బాపూజీకి అందించే నిజమైన నివాళి అని అన్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, ప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొని బాపూజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day


 జయశంకర్ భూపాలపల్లి జిల్లా: స్వాతంత్య్ర పోరాటం, నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేక ఉద్యమం, ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమాల్లో కీలక పాత్ర పోషించిన ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ మూడు తరాల ఉద్యమ నేతగా చిరస్మరణీయులని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. ఆదివారం కొండా లక్ష్మణ్ బాపూజీ 111వ జయంతి వేడుకలను బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఐడీఓసీలో ఘనంగా నిర్వహించారు.

తొలుత మంజూరునగర్‌లోని కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావుతో పాటు ప్రజాప్రతినిధులు, అధికారులు, బీసీ సంఘాల నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. బాపూజీ నిజాయితీ, నిస్వార్థతకు ప్రతీకగా నిలిచారని అన్నారు. ఐదుసార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా ప్రజలకు విశేష సేవలందించారని తెలిపారు.

ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం మంత్రి పదవికి రాజీనామా చేసి ఉద్యమంలో పాల్గొనడం ఆయన నిబద్ధతకు నిదర్శనమన్నారు. తెలంగాణ కోసం ఢిల్లీలో ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన మహనీయుడని కొనియాడారు. బాపూజీ ఆశయాలు, సిద్ధాంతాలను నేటి తరం ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. తెలంగాణ ఆత్మగౌరవ పోరాటంలో ఆయన చేసిన సేవలు, త్యాగాలు తరతరాలకు స్ఫూర్తినిస్తాయని అన్నారు.

ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ అధికారి ఇ. ఇందిర, ఆర్డీఓ హరికృష్ణ, మున్సిపల్ చైర్మన్ బుర్ర కొమురయ్య, వైస్ చైర్మన్ అంబాల శ్రీనివాస్, కౌన్సిలర్ అప్పం కిషన్, పద్మశాలి సంఘం జిల్లా అధ్యక్షుడు క్యాతం సతీష్, ఎలగొండ రాజేంద్ర ప్రసాద్, సత్యనారాయణ, గూట్ల తిరుపతి, కృష్ణమోహన్, అడ్డగట్ల శ్రీధర్, భాగవతం భిక్షపతి, కూచన కిషన్ ప్రసాద్, గొనె భాస్కర్, శేఖర్, పాశికంటి శ్రీనివాస్, షేరు కుమారస్వామి, గుండా వీరస్వామి, సుజాత, ప్రభాకర్, శ్రీధర్‌తో పాటు వివిధ బీసీ సంఘాల ప్రతినిధులు, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ బీసీ సంక్షేమ శాఖ అధికారి ఇ. ఇందిర కృతజ్ఞతలు తెలిపారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

జయశంకర్ భూపాలపల్లి జిల్లా: వీరనారి చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తితో సామాజిక న్యాయం, సమానత్వం కోసం ఉద్యమించాలని తెలంగాణ రాజ్యాధికార పార్టీ జిల్లా అధ్యక్షుడు రవి పటేల్ పిలుపునిచ్చారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఆధ్వర్యంలో శనివారం చాకలి ఐలమ్మ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. జిల్లా అధ్యక్షుడు రవి పటేల్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో చాకలి ఐలమ్మ చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా రవి పటేల్ మాట్లాడుతూ.. చాకలి ఐలమ్మ ఒక వ్యక్తి మాత్రమే కాదని, ఒక పోరాట స్ఫూర్తి అని అన్నారు. అణగారిన వర్గాల ఆత్మగౌరవానికి ఆమె ప్రతీకగా నిలిచారని, మహిళా శక్తికి నిదర్శనంగా నిలిచారని పేర్కొన్నారు. భూమి, హక్కులు, ఆత్మగౌరవం కోసం నాటి ఆధిపత్య భూస్వామ్య వ్యవస్థను ఆమె ధైర్యంగా ఎదుర్కొన్నారని తెలిపారు. చాకలి ఐలమ్మ పోరాటం తెలంగాణ చరిత్రలో సామాజిక న్యాయం కోసం జరిగిన ముఖ్యమైన పోరాటాల్లో ఒకటని అన్నారు.

సమాజంలో కులం, వర్గం పేరుతో ఆధిపత్యం చెలాయించే వ్యవస్థలకు వ్యతిరేకంగా ప్రజలు చైతన్యవంతులు కావాల్సిన అవసరం ఉందన్నారు. తరతరాలుగా అవకాశాలకు దూరంగా ఉంచబడిన బహుజనులు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు, మహిళలకు రాజకీయ, ఆర్థిక, సామాజిక రంగాల్లో సముచిత వాటా దక్కాలని రవి పటేల్ అన్నారు.

చాకలి ఐలమ్మను గౌరవించడం అంటే ఆమె చిత్రపటానికి పూలమాల వేయడం మాత్రమే కాదని, ఆమె పోరాడిన ఆత్మగౌరవం, భూమి హక్కు, సామాజిక సమానత్వం కోసం నేటి తరంలో చైతన్యం తీసుకురావడమే నిజమైన నివాళి అని అన్నారు. ప్రజల హక్కుల కోసం ప్రతి ఒక్కరూ ఐక్యంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు.

తెలంగాణలో ఏ వర్గానికీ వ్యతిరేకంగా వ్యక్తిగత ద్వేషం తమ పార్టీకి లేదని రవి పటేల్ స్పష్టం చేశారు. అయితే ఆధిపత్య రాజకీయాలు, కుల అసమానతలు, పేదల హక్కులను హరించే విధానాలను మాత్రం ప్రశ్నిస్తామని తెలిపారు. రాజకీయ అధికారం కొద్దిమంది వర్గాల చేతుల్లోనే కేంద్రీకృతం కాకుండా, జనాభాలో మెజారిటీగా ఉన్న బహుజన వర్గాలకు కూడా నిర్ణయాధికారంలో సముచిత భాగస్వామ్యం కల్పించాల్సిన అవసరం ఉందన్నారు.

చాకలి ఐలమ్మ స్ఫూర్తితో ఆత్మగౌరవం, సమానత్వం, సామాజిక న్యాయం, రాజ్యాధికారం అనే లక్ష్యాలతో తెలంగాణ రాజ్యాధికార పార్టీ ముందుకు సాగుతుందని రవి పటేల్ తెలిపారు. ఐలమ్మ ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కృషి చేస్తామని అన్నారు.

ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా, మండల నాయకులు, యువజన నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో పాటు ఇనుగాల ప్రణయ్ రాజ్, జినుకల శ్రీను, అనంతుల సంపత్, రోడ్డ శ్రీను, అశోక్, వెంకటస్వామి, రమేష్, కిరణ్, రజక ఆనంద్, శ్రీనివాస్ రజక, సుర తిరుపతి తదితరులు పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

జయశంకర్ భూపాలపల్లి జిల్లా, ఘనపూర్: తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, వీరనారి చాకలి ఐలమ్మ జయంతి వేడుకలను ఘనపూర్‌లో ఏఐఎస్‌ఏ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఏఐఎస్‌ఏ జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షురాలు బుర్ర స్వాతి ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా బుర్ర స్వాతి మాట్లాడుతూ.. చాకలి ఐలమ్మ నాటి భూస్వామ్య, దోపిడీ వ్యవస్థకు వ్యతిరేకంగా ధైర్యంగా నిలబడి పేదలు, కూలీలు, మహిళల హక్కుల కోసం పోరాడిన స్ఫూర్తిదాయకమైన నాయకురాలని అన్నారు. అణచివేతకు ఏమాత్రం భయపడకుండా తన హక్కుల కోసం పోరాడిన ఐలమ్మ జీవితం నేటి విద్యార్థులు, యువతకు ఆదర్శమని పేర్కొన్నారు.

చాకలి ఐలమ్మ సాగించిన పోరాటం కేవలం భూమి కోసం మాత్రమే కాకుండా ఆత్మగౌరవం, సామాజిక న్యాయం కోసం జరిగిన ప్రజా పోరాటానికి ప్రతీకగా నిలిచిందన్నారు. ఆమె పోరాట స్ఫూర్తిని నేటి తరం విద్యార్థులు, యువత ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని అన్నారు.

ప్రస్తుతం విద్యార్థులు ఎదుర్కొంటున్న విద్యా సమస్యలు, అధిక ఫీజులు, నిరుద్యోగం, సామాజిక వివక్ష వంటి సమస్యలపై ఐక్యంగా పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్య అందేలా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని కోరారు. విద్యను వ్యాపారంగా మార్చే విధానాలను అరికట్టి, పేద విద్యార్థులకు సమాన విద్యా అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు.

విద్యార్థుల హక్కులను పరిరక్షించేందుకు ప్రజాస్వామ్య పద్ధతుల్లో ఉద్యమాలను కొనసాగిస్తామని బుర్ర స్వాతి తెలిపారు. చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తితో విద్యార్థులు, యువత తమ హక్కుల కోసం ఐక్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.

చాకలి ఐలమ్మ చూపిన పోరాట మార్గాన్ని ఆదర్శంగా తీసుకుని విద్యార్థుల హక్కులు, సామాజిక న్యాయం కోసం నిరంతరం పోరాడతామని ఏఐఎస్‌ఏ నాయకులు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో ఏఐఎస్‌ఏ విద్యార్థులు ఐశ్వర్య, అనన్య, నేహా తదితరులు పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

భూపాలపల్లి, సెప్టెంబర్ 26: గ్రామీణాభివృద్ధి, మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. శనివారం జిల్లా ఐడీఓసీ కార్యాలయంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఎంపీడీవోలు, సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు, గ్రామీణాభివృద్ధి శాఖ సిబ్బందికి నిర్వహించిన ఒకరోజు శిక్షణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామాల్లో ఉపాధి హామీ పనులను విస్తృతంగా చేపట్టడంతో పాటు స్థానిక అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి పనులను ఎంపిక చేయాలని సూచించారు. డీఎంఎఫ్‌టీ, సీఎస్‌ఆర్‌ నిధులను గ్రామాల అవసరాలకు అనుగుణంగా వినియోగించేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. గ్రామాల అభివృద్ధికి అవసరమైన పనులపై గ్రామసభల్లో తీర్మానాలు చేయాలని సూచించారు. జనాభా ప్రాతిపదికన నిధులు మంజూరయ్యే అవకాశం ఉన్నందున అందుకు అనుగుణంగా అభివృద్ధి ప్రణాళికలను రూపొందించాలని పేర్కొన్నారు.

ఎల్‌నినో ప్రభావంతో భవిష్యత్‌లో నీరు, విద్యుత్ కొరత ఏర్పడే అవకాశం ఉన్నందున ముందస్తు కార్యాచరణ రూపొందించి సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని సూచించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ జాబ్‌కార్డులు జారీ చేసి ఉపాధి హామీ పనుల్లో కూలీల సంఖ్యను పెంచాలని అన్నారు. గ్రామ పంచాయతీ, వీఓ భవనాలు, పాఠశాలలకు ప్రహరీలు, అదనపు తరగతి గదుల నిర్మాణానికి ప్రభుత్వం త్వరలో ఉత్తర్వులు జారీ చేయనున్నట్లు తెలిపారు. భూగర్భ జలాలను పెంపొందించేందుకు ఇంకుడు గుంతలు, ఫామ్‌పాండ్ల నిర్మాణంపై దృష్టి సారించాలని సూచించారు.

జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ మాట్లాడుతూ గ్రామాల అవసరాలను గుర్తించి ప్రాధాన్యత క్రమంలో అభివృద్ధి కార్యాచరణ రూపొందించాలని సూచించారు. అక్టోబర్ 2న నిర్వహించే ప్రత్యేక గ్రామసభల్లో గ్రామాభివృద్ధి పనులపై ప్రజలతో చర్చించి తీర్మానాలు ఆమోదించాలని అన్నారు. ప్రతి గ్రామానికి అవసరమైన పనులపై ముందుగానే ఇన్వెంటరీ సిద్ధం చేసుకోవాలని ఎంపీడీవోలు, పంచాయతీ కార్యదర్శులు, సర్పంచులకు సూచించారు. గ్రామీణ ప్రాంతాల సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా ‘వికసిత్ గ్రామ పంచాయతీ’ ప్రణాళికలను పక్కాగా రూపొందించాలని ఆదేశించారు.

కార్యక్రమంలో అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, డీఆర్‌డీఓ బాలకృష్ణ, డీఎంఓ కౌసల్య దేవి, డీపీఓ శ్రీలత, ఎంపీడీవోలు, సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు, గ్రామీణాభివృద్ధి శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

 

కాటారం: జయశంకర్ భూపాలపల్లి జిల్లా  కాటారం సబ్‌ కలెక్టర్‌ సౌరవ్‌ శర్మను కాటారం, మల్హర్‌, పలిమెల, మహముత్తారం మండలాల ఎంపీడీవోలు శుక్రవారం సబ్‌ కలెక్టర్‌ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సబ్‌ కలెక్టర్‌కు పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.

అనంతరం ఆయా మండలాల్లో కొనసాగుతున్న అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాల అమలు, పంచాయతీరాజ్‌ శాఖ ద్వారా ప్రజలకు అందుతున్న సేవలపై సబ్‌ కలెక్టర్‌ ఎంపీడీవోలతో చర్చించారు. మండలాల వారీగా చేపడుతున్న కార్యక్రమాల పురోగతిని అడిగి తెలుసుకున్నట్లు సమాచారం.

ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ చేరేలా అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సబ్‌ కలెక్టర్‌ సూచించారు. ప్రజలకు ప్రభుత్వ సేవలు సకాలంలో అందేలా చూడడంతో పాటు, వారి సమస్యల పరిష్కారంలో ఎలాంటి జాప్యం లేకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు. అభివృద్ధి పనుల అమలులో సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు అందుతున్న సేవలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ, ప్రభుత్వ లక్ష్యాలను సమర్థవంతంగా అమలు చేయాలని ఎంపీడీవోలకు సబ్‌ కలెక్టర్‌ సూచించినట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో కాటారం, మల్హర్‌, పలిమెల, మహముత్తారం మండలాల ఎంపీడీవోలు బాబు, నిశాంత్‌, క్రాంతి, పవన్‌ తదితరులు పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

 

భూపాలపల్లి: అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవాన్ని పురస్కరించుకుని జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో సెప్టెంబర్ 24 నుంచి అక్టోబర్ 1 వరకు వయోవృద్ధుల వారోత్సవాలను నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. శుక్రవారం ఐడీఓసీ కార్యాలయంలో వారోత్సవాలకు సంబంధించిన పోస్టర్‌ను కలెక్టర్ ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వయోవృద్ధుల సంక్షేమం, రక్షణ, గౌరవప్రదమైన జీవనానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోందన్నారు. తల్లిదండ్రులు, వయోవృద్ధుల పోషణ, సంక్షేమ చట్టం-2007పై ప్రజలు, కుటుంబ సభ్యులు అవగాహన కలిగి ఉండాలని సూచించారు. వయోవృద్ధులకు అవసరమైన సహాయం, భద్రత, సంక్షేమ సేవలు అందేలా సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేయాలని అధికారులను ఆదేశించారు.

వయోవృద్ధులు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవాలని, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. కుటుంబ సభ్యులు, సమాజం వయోవృద్ధుల పట్ల గౌరవం, బాధ్యతతో వ్యవహరించాలని కోరారు.

వారోత్సవాల్లో భాగంగా వయోవృద్ధుల హక్కులు, ఆరోగ్యం, భద్రత, సామాజిక భద్రత, ప్రభుత్వ సంక్షేమ పథకాలు, చట్టపరమైన రక్షణపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.

కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి జి. మల్లేశ్వరి, జిల్లా వైద్యాధికారి డాక్టర్ మధుసూదన్, సంక్షేమ శాఖ జూనియర్ అసిస్టెంట్ అర్జున్, డే కేర్ సెంటర్ సూపరింటెండెంట్ కొలగూరి సంజీవరావు, సీనియర్ సిటీజన్స్ అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

జయశంకర్ భూపాలపల్లి జిల్లా: భూపాలపల్లి మండలం పెద్దాపూర్ గ్రామంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ (సీతక్క), జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ కార్యక్రమంలో పాల్గొని లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను అందజేశారు.

ఈ సందర్భంగా గ్రామంలోని అర్హులైన లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు. రేషన్ కార్డుల ద్వారా అర్హులైన కుటుంబాలకు ప్రభుత్వ ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా అందించే నిత్యావసర సరుకులు, ఇతర సంక్షేమ పథకాల ప్రయోజనాలు సులభంగా అందనున్నాయి.

ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి కుటుంబానికి చేరేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. ప్రజలకు అవసరమైన సేవలను పారదర్శకంగా, సమర్థవంతంగా అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.

కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, ప్రజలు, లబ్ధిదారులు పాల్గొన్నారు. స్మార్ట్ రేషన్ కార్డులు అందుకోవడంతో లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేశారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

జయశంకర్ భూపాలపల్లి, సెప్టెంబర్ 24: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో వివిధ అభివృద్ధి, సంక్షేమ ప్రాజెక్టులకు అవసరమైన భూసేకరణ ప్రక్రియను చట్టబద్ధంగా, పారదర్శకంగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ రెవెన్యూ అధికారులను ఆదేశించారు. భూసేకరణ చట్టాలు, నిబంధనలు, ప్రభుత్వ ఉత్తర్వులు, న్యాయస్థానాల తీర్పులకు అనుగుణంగా అధికారులు వ్యవహరించాలని సూచించారు.

గురువారం ఐడీఓసీ కార్యాలయంలో రెవెన్యూ అధికారులు, సిబ్బందికి భూసేకరణపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. హెచ్‌ఎండీఏ, టీజీఐఐసీలో ఓఎస్‌డీగా విధులు నిర్వహిస్తున్న మనోహర్‌తో కలిసి కలెక్టర్ ఈ శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా భూసేకరణకు సంబంధించిన చట్టాలు, నిబంధనలు, ప్రభుత్వ ఉత్తర్వులు, న్యాయస్థానాల తీర్పులపై అధికారులకు అవగాహన కల్పించారు.

కలెక్టర్ రాహుల్ శర్మ మాట్లాడుతూ జిల్లాలో ఇరిగేషన్, సింగరేణి, జెన్‌కో, జాతీయ రహదారులు తదితర అభివృద్ధి ప్రాజెక్టులకు సంబంధించి భూసేకరణ జరుగుతోందన్నారు. జిల్లాలోని అన్ని మండలాల్లో భూసేకరణ ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో అర్హులైన రైతులకు చట్టప్రకారం పరిహారం, పునరావాసం, ఇతర పునరావాస ప్రయోజనాలు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

భూసేకరణకు సంబంధించి రైతులకు ఉన్న సందేహాలను ఎప్పటికప్పుడు నివృత్తి చేయాలని, ప్రక్రియలో ఎలాంటి జాప్యానికి తావులేకుండా అధికారులు చర్యలు చేపట్టాలని కలెక్టర్ స్పష్టం చేశారు. అర్హత కలిగిన ఏ ఒక్క రైతుకూ అన్యాయం జరగకుండా నిష్పక్షపాతంగా వ్యవహరించాలని ఓఎస్‌డీ మనోహర్ సూచించారు.

భూసేకరణ చట్టాలకు అనుగుణంగా ప్రతి దశను పక్కాగా నమోదు చేయాలని, సమావేశాల మినిట్స్‌ను తప్పనిసరిగా నమోదు చేయడంతో పాటు అవసరమైన చోట్ల వీడియో రికార్డింగ్ చేపట్టాలని తెలిపారు. భూములు ఇచ్చే రైతులను కేవలం భూమి ఇచ్చేవారిగా కాకుండా అభివృద్ధి ప్రాజెక్టుల్లో భాగస్వాములుగా గౌరవించాలని సూచించారు. అధికారుల వైఖరి కారణంగా రైతుల మనోభావాలు దెబ్బతినకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు.

అసైన్డ్, ప్రభుత్వ భూములకు సంబంధించి తలెత్తే వివాదాలను నిబంధనల ప్రకారం విచారించి పరిష్కరించాలని, ఆయా భూముల్లో సాగు చేసుకుంటున్న వారి అర్హతలను తహసీల్దార్లు క్షుణ్ణంగా పరిశీలించాలని సూచించారు. భూసేకరణలో భూమి విస్తీర్ణం, రికార్డుల వివరాలు తదితర అంశాల్లో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలని మనోహర్ తెలిపారు.

ఈ కార్యక్రమంలో కాటారం సబ్‌ కలెక్టర్ సౌరవ్ శర్మ, ఆర్డీఓ హరికృష్ణ, శిక్షణా డిప్యూటీ కలెక్టర్ నవీన్ రెడ్డి, ఏఓ శ్రీనివాసులు, అన్ని మండలాల తహసీల్దార్లు, రెవెన్యూ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

 జయశంకర్ భూపాలపల్లి జిల్లా రూరల్ పరిధిలోని నాగారం గ్రామంలో ఇటీవల మృతి చెందిన మడే సమ్మక్క దశదిన కర్మలకు తెలంగాణ రాజ్యాధికార పార్టీ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు రవి పటేల్ హాజరయ్యారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా అధికార ప్రతినిధి మడే సంతోష్ నానమ్మ మడే సమ్మక్క కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. పార్టీ తరఫున కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సహాయం అందజేశారు.

ఈ సందర్భంగా రవి పటేల్ మాట్లాడుతూ.. పార్టీ కోసం క్రమశిక్షణతో, నిబద్ధతతో పనిచేస్తున్న మడే సంతోష్ కుటుంబానికి తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు. భవిష్యత్‌లోనూ అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని భరోసా ఇచ్చారు.

నాగారం టీఆర్‌పీ గ్రామ కమిటీ అధ్యక్షుడు చిడం ధర్మయ్య ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు ఇనుగాల ప్రణయ్ రాజ్, క్రమశిక్షణ కమిటీ సభ్యులు గండు కరుణాకర్, పిట్టల వెంకటేష్, మోటపోతుల సమ్మయ్య, జిల్లా కోశాధికారి జినుకల శ్రీను, వ్యవసాయ విభాగం అధ్యక్షుడు పింగిడి శంకరయ్య, కార్మిక విభాగం అధ్యక్షుడు, భూపాలపల్లి మండల అధ్యక్షుడు మీసాల రాజు, మనోహర్రావు మండల అధ్యక్షుడు మేనం సంతోష్, నాగారం గ్రామ కమిటీ నాయకులు, టీఆర్‌పీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

 

కాటారం: జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం అటవీ రేంజ్ పరిధిలో అటవీ శాఖ ఉన్నతాధికారులు, క్షేత్రస్థాయి సిబ్బంది విస్తృతంగా పర్యటించారు. కాటారం మండలంలోని చింతకాని బీట్, చింతకాని సెక్షన్ పరిధిలోని అటవీ ప్రాంతాలను అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అటవీ సంరక్షణ చర్యలు, అటవీ ప్రాంతాల పరిస్థితి, వన్యప్రాణుల రక్షణ, అక్రమ కార్యకలాపాల నియంత్రణ తదితర అంశాలపై పరిశీలన చేపట్టారు. కాళేశ్వరం జోన్ పరిధిలో అటవీ సంరక్షణకు చేపడుతున్న చర్యలను అధికారులు పరిశీలించారు. అటవీ ప్రాంతాల్లో నిరంతర నిఘా, గస్తీ నిర్వహణపై సిబ్బందితో వివరాలు తెలుసుకున్నారు. అటవీ సంపదకు నష్టం కలగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న సమస్యలు, సిబ్బంది నిర్వహిస్తున్న విధులపై సమీక్షించారు. ఈ పర్యటనలో కాళేశ్వరం జోన్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్ డాక్టర్ ప్రభాకర్, ఐఎఫ్‌ఎస్ కిష్టగౌడ్, ఐఎఫ్‌ఎస్, జయశంకర్ భూపాలపల్లి జిల్లా అటవీ అధికారి సందీప్ రెడ్డి, మహదేవ్‌పూర్ డివిజన్ అటవీ రేంజ్ అధికారి స్వాతి, కాటారం డీవైఆర్‌ఓ హెచ్. సురేందర్ నాయక్, యమన్‌పల్లి డీవైఆర్‌ఓ ఝాన్సీ రాణి, చింతకాని సెక్షన్ అటవీ సెక్షన్ అధికారి సోనీ కిరణ్, దామెరకుంట సెక్షన్ అటవీ సెక్షన్ అధికారి చంద్రశేఖర్ పాల్గొన్నారు. అలాగే కాటారం, దొబ్బలపాడు పరిధి అటవీ బీట్ అధికారి ఎం. రాజేందర్, యమన్‌పల్లి అటవీ బీట్ అధికారి కోట సంజీవ్, యమన్‌పల్లి వెస్ట్ అటవీ బీట్ అధికారి హరీష్, ఇతర అటవీ సిబ్బంది, డ్రైవర్లు మహమూద్, రహీం, గౌస్‌తో పాటు బేస్ క్యాంప్ వాచర్లు పాల్గొన్నారు. అటవీ ప్రాంతాల్లో సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. అటవీ సంపద పరిరక్షణతో పాటు వన్యప్రాణుల సంరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు. అటవీ ప్రాంతాల్లో అక్రమ కార్యకలాపాలు చోటుచేసుకోకుండా క్రమం తప్పకుండా గస్తీ నిర్వహించాలని సూచించారు. క్షేత్రస్థాయిలో సిబ్బంది సమన్వయంతో పనిచేస్తూ అటవీ రక్షణ చర్యలను మరింత పటిష్టం చేయాలని అధికారులు సూచించినట్లు సమాచారం. కాటారం రేంజ్ పరిధిలోని చింతకాని బీట్, చింతకాని సెక్షన్ ప్రాంతాల్లో అధికారుల పర్యటనతో క్షేత్రస్థాయిలో అటవీ సంరక్షణ చర్యలపై మరింత దృష్టి సారించినట్లు తెలుస్తోంది.


Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

చెల్పూర్, సెప్టెంబర్ 22: జయశంకర్ భూపాలపల్లి జిల్లా చెల్పూర్ మండలం బసవరాజుపల్లి మీదుగా గణపురం వైపు నడిచే బస్సు రాకపోకలకు రోడ్డు పనుల కారణంగా అంతరాయం ఏర్పడటంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఐసా విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షురాలు బుర్ర స్వాతి తెలిపారు.

బసవరాజుపల్లి నుంచి గణపురం వెళ్లే ప్రధాన రహదారిలో ప్రస్తుతం రోడ్డు పనులు కొనసాగుతున్నందున బస్సు రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని డ్రైవర్ విద్యార్థులకు తెలిపినట్లు ఆమె పేర్కొన్నారు. దీంతో పాఠశాలలు, కళాశాలలకు వెళ్లే విద్యార్థులు సమయానికి చేరుకోలేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.

విద్యార్థుల చదువుకు ఆటంకం కలగకుండా ప్రత్యామ్నాయ మార్గంలో బస్సు సౌకర్యం కల్పించాలని కోరుతూ ఐసా విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో సంబంధిత బస్ డిపో మేనేజర్‌కు వినతిపత్రం అందజేశారు. అధికారులు వెంటనే స్పందించి ప్రత్యామ్నాయ మార్గంలో బస్సు నడిపించి విద్యార్థులకు నిరంతర రవాణా సౌకర్యం కల్పించాలని బుర్ర స్వాతి కోరారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణేష్ నిమజ్జనం సందర్భంగా భక్తులు, గణేష్ విగ్రహాల వాహనాల రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా విద్యుత్ శాఖ అధికారులు ముందస్తు చర్యలపై దృష్టి సారించారు. ఇందులో భాగంగా టీజీఎన్‌పీడీసీఎల్‌ చీఫ్ ఇంజినీర్, భూపాలపల్లి సర్కిల్ నోడల్ అధికారి శ్రీమతి అన్నపూర్ణ కాటారం డివిజన్ పరిధిలోని నిమజ్జన మార్గాలను పరిశీలించారు.

కాటారం, మహాదేవపూర్, కాళేశ్వరం మార్గాల మీదుగా గణేష్ విగ్రహాలను తరలించే వాహనాలు ప్రయాణించే సమయంలో విద్యుత్ లైన్లు అడ్డంకిగా మారకుండా అధికారులు ప్రత్యేకంగా పరిశీలించారు. రహదారుల వెంట ఉన్న విద్యుత్ లైన్లను పరిశీలించి, విగ్రహాల వాహనాలకు ఎలాంటి ప్రమాదం జరగకుండా అవసరమైన ముందస్తు చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులకు సూచించారు. నిమజ్జనం సందర్భంగా విద్యుత్ భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని, ఎక్కడైనా విద్యుత్ లైన్లు ప్రమాదకరంగా ఉన్నట్లు గుర్తిస్తే వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

అనంతరం కాళేశ్వరం గోదావరి నది వద్ద ఏర్పాటు చేసిన గణేష్ నిమజ్జన ప్రాంతాన్ని పరిశీలించారు. నిమజ్జన కార్యక్రమానికి వచ్చే భక్తులు, వాహనాల రాకపోకలను దృష్టిలో ఉంచుకుని విద్యుత్ సరఫరా విషయంలో ఎలాంటి అవాంతరాలు లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. నిమజ్జనం పూర్తయ్యే వరకు సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు.

ఈ పరిశీలన కార్యక్రమంలో భూపాలపల్లి సర్కిల్ ఎస్‌ఈ సదానందం, డీఈ టెక్నికల్ జగదీష్, కాటారం డీఈ నాగరాజు, కాటారం–మహాదేవపూర్ ఏఈ రమేష్, మహాదేవపూర్ సబ్‌ఇంజినీర్ ప్రశాంత్, కాళేశ్వరం లైన్ ఇన్‌స్పెక్టర్ సదానందం, విద్యుత్ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.

గణేష్ నిమజ్జనం సందర్భంగా ప్రజలకు, భక్తులకు ఎలాంటి విద్యుత్ ప్రమాదాలు చోటుచేసుకోకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడమే లక్ష్యంగా అధికారులు మార్గాలను పరిశీలించి అవసరమైన సూచనలు చేశారు.




Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

 


జయశంకర్ భూపాలపల్లి జిల్లా మలహర్ మండలం ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం సమావేశం ఈనెల 22వ తేదీ మంగళవారం రోజు నిర్వహిస్తున్నట్లు ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి లింగాల రామయ్య కార్యక్రమ నిర్వాహకులు నమూన్ల సంపత్ మహారాజు తెలిపారు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఇతర అనగారిన వర్గాల హక్కుల సాధనలో నిరంతరం   ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం పనిచేస్తుందన్నారు దళిత బహుజన అనగారిన వర్గాల కోసం పని  చేయాలనే ఆసక్తి కలిగిన వారు నూతన కమిటీ ఏర్పాటుకు హాజరై సహకరించవలసిందిగా కోరారు ఉదయం 10:30 నిమిషాలకు కొయ్యూరు లో జరిగే సమావేశానికి మండలంలోని ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఇతర అనగారిన,వర్గాలు హాజరు కావలసిందిగా కోరారు, ఈ సమావేశానికి ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం జాతీయ ఉపాధ్యక్షులు మామిడిపల్లి బాపయ్య, రిటైర్డ్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ బూడిద రాజయ్య సీనియర్ జర్నలిస్టు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బొంకూరి మధు, రాష్ట్ర ఉపాధ్యక్షులు మైస రాజేష్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తంగిరాల సందీప్,ప్రజా సంఘాల జేఏసీ జిల్లా అధ్యక్షులు పీక కిరణ్,జిల్లా కోఆర్డినేటర్ పొట్ల పోచయ్య హాజరవుతున్నట్లు ఆయన పేర్కొన్నారు 


కృతజ్ఞతలతో 

లింగాల రామయ్య 

రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి 

ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం, 

78160,68871

నమూన్ల సంపత్ మహారాజ్ 

కార్యక్రమ నిర్వాహకులు,

93813,53694

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

 

భూపాలపల్లి: బీసీల రాజ్యాధికారం, సామాజిక సమానత్వం లక్ష్యంగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఆధ్వర్యంలో చేపట్టనున్న 14,500 కిలోమీటర్ల బీసీల రాజ్యాధికార పాదయాత్రకు ప్రజలు పెద్ద సంఖ్యలో తరలిరావాలని ఆ పార్టీ జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు రవి పటేల్ పిలుపునిచ్చారు. గురువారం హైదరాబాద్‌లోని గోల్కొండ నుంచి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న పాదయాత్రను ప్రారంభించనున్నట్లు తెలిపారు. జిల్లా కేంద్రంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో రవి పటేల్ మాట్లాడుతూ.. పాదయాత్రను దశలవారీగా నిర్వహిస్తూ బీసీలకు రాజ్యాధికారం, అన్ని వర్గాలకు సమాన హక్కులు, అవకాశాలు, సామాజిక న్యాయం కోసం ప్రజాస్వామ్య పద్ధతిలో ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తామని పేర్కొన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాల ప్రజలు గోల్కొండకు తరలివచ్చి ప్రారంభ కార్యక్రమంలో పాల్గొని పాదయాత్రకు మద్దతు ఇవ్వాలని కోరారు. సమావేశంలో జిల్లా నాయకులు ప్రణయ్ రాజ్, వెంకటేష్, సంతోష్, శ్రీను, రాంబాబు, సతీష్, ముక్తేశ్వర్, బన్నీ తదితరులు పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

 


భూపాలపల్లి, సెప్టెంబర్ 16: జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎన్‌ఎస్‌యూఐ అధ్యక్షుడిగా నియమితులైన పురుషోత్తం అనూప్ బుధవారం హైదరాబాద్‌లోని అసెంబ్లీ భవన్‌లో మంత్రి, మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్‌బాబును మర్యాదపూర్వకంగా కలిశారు. తనను జిల్లా అధ్యక్షుడిగా నియమించినందుకు మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా శ్రీధర్‌బాబు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ, ఎన్‌ఎస్‌యూఐ బలోపేతానికి అంకితభావంతో పనిచేయాలని సూచించారు. జిల్లా, మండల స్థాయిలో విద్యార్థి విభాగాన్ని బలోపేతం చేయడంతో పాటు ప్రతి కళాశాలలో ఎన్‌ఎస్‌యూఐను విస్తరించాలని కోరారు. విద్యార్థుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. మంత్రి మార్గదర్శకత్వంలో జిల్లాలో ఎన్‌ఎస్‌యూఐను మరింత బలోపేతం చేసి విద్యార్థుల హక్కుల సాధనకు కృషి చేస్తానని పురుషోత్తం అనూప్ తెలిపారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

రేగొండ: జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం పెద్దంపల్లి గ్రామంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ (టీఆర్పీ)లో భారీగా యువత చేరారు. గ్రామ 8వ వార్డు మెంబర్ అంబటి కార్తీక్ ఆధ్వర్యంలో పలువురు యువకులు పార్టీలో చేరగా, టీఆర్పీ జిల్లా అధ్యక్షుడు రవి పటేల్ వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. పెద్దంపల్లి, దుంపిల్లపల్లి గ్రామాలకు చెందిన అంబటి కార్తీక్, ఎర్రబాటి హరీష్, వజ్జీరు కిరణ్, చలుకాని సైలని, బాబా, సిద్ధార్థ తదితరులకు రవి పటేల్ స్వాగతం పలికారు.

ఈ సందర్భంగా రవి పటేల్ మాట్లాడుతూ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల హక్కులు, అభ్యున్నతి, రాజ్యాధికారం కోసం టీఆర్పీ చేస్తున్న పోరాటంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. కార్యకర్తలు క్రమశిక్షణతో పనిచేస్తూ పార్టీని గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు బలోపేతం చేయాలని సూచించారు. గడపగడపకు వెళ్లి పార్టీ విధానాలను ప్రజలకు వివరించడంతో పాటు ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం పోరాడాలని కోరారు.

అంబటి కార్తీక్ మాట్లాడుతూ తీన్మార్ మల్లన్నను ఆదర్శంగా తీసుకుని, రవి పటేల్ ఆధ్వర్యంలో బహుజనుల కోసం జరుగుతున్న పోరాటాలకు ఆకర్షితుడై టీఆర్పీలో చేరినట్లు తెలిపారు. తనకు అప్పగించిన బాధ్యతలను నిబద్ధతతో నిర్వహిస్తూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తానన్నారు. అణగారిన వర్గాలకు రాజ్యాధికారం సాధించే లక్ష్యంతో యువత పెద్ద ఎత్తున ముందుకు రావాలని పిలుపునిచ్చారు.

కార్యక్రమంలో టీఆర్పీ జిల్లా మహిళా అధ్యక్షురాలు సామల శ్రీలత, జిల్లా ఉపాధ్యక్షుడు ఇనుగాల ప్రణయ్ రాజ్, క్రమశిక్షణ కమిటీ సభ్యుడు గండు కరుణాకర్, జిల్లా కోశాధికారి జినుకల శ్రీను, భూపాలపల్లి మండల అధ్యక్షుడు మీసాల రాజు, సామల చంద్రశేఖర్, పిట్టల రాంబాబు, జినుకల శ్రీకాంత్, వేల్పుల దేవేందర్, సిద్ధార్థ తదితరులు పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day


జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రం జిల్లాకు చెందిన సాంస్కృతిక, కోలాటం, భజన కళాకారులు తెలంగాణ రాజ్యాధికార పార్టీ జిల్లా అధ్యక్షుడు రవి పటేల్‌ను కలిసి తమ సమస్యలను వివరించారు. ఎన్నో ఏళ్లుగా కళలను నమ్ముకుని జీవిస్తున్న తమను ప్రభుత్వాలు పూర్తిస్థాయిలో పట్టించుకోవడం లేదని కళాకారులు ఆవేదన వ్యక్తం చేశారు.

కళాకారులకు ఇళ్ల స్థలాలు లేదా గృహ సౌకర్యం, పెన్షన్, కళాకారుల భృతి, ప్రమాద బీమా కల్పించాలని కోరారు. జిల్లాలోని దేవాలయాలు, ఇతర సాంస్కృతిక కార్యక్రమాల్లో స్థానిక కళాకారులకు ప్రాధాన్యత ఇవ్వాలని, ఉపాధి అవకాశాలు పెంచడంతో పాటు కళలను ప్రోత్సహించేందుకు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.

ఈ సందర్భంగా రవి పటేల్ మాట్లాడుతూ.. బహుజన రాజ్యాధికారం సాధించిన అనంతరం కళాకారుల సమస్యలను ప్రాధాన్యతతో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. కళలు, కళాకారులు తెలంగాణ సమాజానికి గర్వకారణమని, వారికి తగిన గౌరవం, అవకాశాలు, సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తామని తెలిపారు. కళాకారుల సమస్యలను పార్టీ అధినేత ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న దృష్టికి తీసుకెళ్లి ప్రత్యేక కార్యాచరణ రూపొందించేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు.

కార్యక్రమంలో కళాకారుల రాష్ట్ర నాయకులు కుడుముల కుమార్, జాతీయ అధ్యక్షుడు వీరభద్ర స్వామి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు చంద్రయ్య, జిల్లా అధ్యక్షుడు కుంట్ల ఉప్పలయ్య, మహిళా అధ్యక్షురాలు రజిత కీసర, జిల్లా ఉపాధ్యక్షులు గడ్డం లక్ష్మయ్య, జనగాం మహేష్, జిల్లా ప్రధాన కార్యదర్శి బందెర రవి, జిల్లా మహిళా అధ్యక్షురాలు కుడుముల రామా తదితరులతో పాటు జిల్లా కోలాటం, భజన కళాకారులు పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో వీరనారి చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా ఐసా విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షురాలు బుర్ర స్వాతి ఆమె విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా స్వాతి మాట్లాడుతూ తెలంగాణ ప్రజల హక్కులు, పేదలు, బడుగు బలహీన వర్గాల ఆత్మగౌరవం కోసం చాకలి ఐలమ్మ ధైర్యంగా పోరాడారని అన్నారు.

భూస్వామ్య దోపిడీ, అన్యాయానికి వ్యతిరేకంగా ఐలమ్మ చూపిన ధైర్యం, తెగువ నేటి తరానికి స్ఫూర్తిదాయకమన్నారు. ఆమె పోరాటం ఒక వ్యక్తికి పరిమితం కాకుండా పేదలు, బడుగు బలహీన వర్గాల ఆత్మగౌరవం కోసం సాగిన సామాజిక పోరాటానికి ప్రతీక అని పేర్కొన్నారు. నేటి సమాజంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు, అణగారిన వర్గాలకు సమాన అవకాశాలు, సామాజిక న్యాయం, రాజకీయ ప్రాధాన్యం కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. చాకలి ఐలమ్మ స్ఫూర్తితో సామాజిక న్యాయం కోసం ఐసా విద్యార్థి సంఘం నిరంతరం పోరాడుతుందని తెలిపారు. ఆమె చూపిన పోరాట మార్గంలో నడుస్తూ ఆశయాలను ముందుకు తీసుకెళ్లడమే నిజమైన నివాళి అని బుర్ర స్వాతి అన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

భూపాలపల్లి : జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో వీరనారి చాకలి ఐలమ్మ వర్ధంతిని పురస్కరించుకుని తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఆధ్వర్యంలో ఆమె చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. జిల్లా అధ్యక్షుడు రవి పటేల్ మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజల హక్కులు, పేదలు, అణగారిన వర్గాల ఆత్మగౌరవం కోసం ఐలమ్మ ధైర్యంగా పోరాడారని కొనియాడారు. భూస్వామ్య దోపిడీ, అన్యాయానికి వ్యతిరేకంగా ఆమె చూపిన తెగువ నేటి తరానికి స్ఫూర్తిదాయకమన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు, అణగారిన వర్గాలకు సమాన అవకాశాలు, సామాజిక న్యాయం, రాజకీయ ప్రాతినిధ్యం దక్కేలా పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. ఐలమ్మ ఆశయాలను ముందుకు తీసుకెళ్లడమే ఆమెకు నిజమైన నివాళి అని పేర్కొన్నారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు ఇనుగల ప్రణయ్‌రాజ్, మండల నాయకులు గంధం సతీష్, యువజన నాయకుడు పిట్టల రాంబాబు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.