Articles by "Mahamutharam ( మహాముత్తారం )"
Showing posts with label Mahamutharam ( మహాముత్తారం ). Show all posts
Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

మహాముత్తారం: అటవీ హక్కుల చట్టం–2006లో ఇతర సంప్రదాయ అటవీ నివాసితులు (OTFD) ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్‌కు ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం మహాముత్తారం మండల అధ్యక్షుడు రామగిరి రాజు వినతిపత్రం అందజేశారు. OTFDలకు వర్తించే మూడు తరాలు లేదా 75 సంవత్సరాల నిబంధనను సడలించేలా చట్ట సవరణకు సిఫారసు చేయాలని కోరారు. పాతకాలంలో సరైన రెవెన్యూ, అటవీ, సర్వే రికార్డులు అందుబాటులో లేకపోవడంతో నిజమైన అటవీ నివాసితులు 75 ఏళ్ల నిరంతర చారిత్రక ఆధారాలు సమర్పించలేక హక్కులు కోల్పోతున్నారని పేర్కొన్నారు. చట్ట సవరణ జరిగే వరకు OTFDలను తొలగింపులు, వేధింపుల నుంచి రక్షించేలా జిల్లా కలెక్టర్లు, అటవీ అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో తెలంగాణ ప్రజా ఫ్రంట్ జిల్లా అధ్యక్షుడు పీక కిరణ్, AIAYS మండల గౌరవ అధ్యక్షుడు లింగమళ్ల సడవలిరావు, సలహాదారు గంధం రాజేష్, ప్రధాన కార్యదర్శి లింగమళ్ల శంకర్, ప్రచార కార్యదర్శి పులియాల సురేష్ పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

మహాముత్తారం, ఆగస్టు 19: మహాముత్తారం మండలం కోనంపేటలోని మిషన్ భగీరథ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్‌లో కార్మికుల శ్రమదోపిడీకి పాల్పడుతున్న కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకోవాలని కుల సంఘాల జేఏసీ జిల్లా చైర్మన్ పీక కిరణ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్యకు వినతిపత్రం సమర్పించారు. ప్లాంట్‌లో 60–80 మంది సిబ్బంది పనిచేయాల్సి ఉండగా, ప్రస్తుతం 16 మందితోనే పనులు చేయిస్తున్నారని ఆరోపించారు. కార్మికులకు సెలవులు, ఓవర్‌టైమ్ వేతనాలు చెల్లించడం లేదని, జీతాల నుంచి పీఎఫ్, ఈఎస్‌ఐ, మెడిక్లెయిమ్, పెట్రోల్ అలవెన్సుల పేరుతో రూ.8 వేల నుంచి రూ.12 వేల వరకు కోతలు విధిస్తున్నారని పేర్కొన్నారు. ఈ సమస్యపై జూలై 27, ఆగస్టు 3, ఆగస్టు 17న జిల్లా కలెక్టర్‌కు ప్రజావాణి ద్వారా ఫిర్యాదు చేసినా స్పందన లేకపోవడంతో రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ను ఆశ్రయించినట్లు తెలిపారు. కాంట్రాక్టర్‌పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీతో పాటు క్రిమినల్ కేసులు నమోదు చేసి, కార్మికుల బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఉన్నతస్థాయి విచారణ జరిపి న్యాయం చేయకపోతే ఆందోళన చేపడతామని పీక కిరణ్ హెచ్చరించారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

మహా ముత్తారం, ఆగస్టు 19: మహా ముత్తారం గ్రామపంచాయతీ కార్యాలయంలో కాటారం డివిజన్ సర్పంచుల ఫోరం అధ్యక్షుడు కొండగొర్ల బాపు ఆధ్వర్యంలో గ్రామపంచాయతీ పాలకవర్గ సమావేశం నిర్వహించారు. గ్రామ అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలపై సభ్యులు చర్చించారు. గ్రామంలో పారిశుధ్యం, తాగునీటి సరఫరా, వీధి దీపాల నిర్వహణ, రోడ్ల మరమ్మతులు, మొక్కల సంరక్షణతో పాటు ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనపై నిర్ణయాలు తీసుకున్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హులైన లబ్ధిదారులకు చేరేలా చర్యలు చేపట్టాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ ప్రజల సమస్యలను గుర్తించి త్వరితగతిన పరిష్కరించేందుకు పాలకవర్గ సభ్యులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. అనంతరం మంత్రి దుద్దిల్ల శ్రీధర్‌బాబు ఆదేశాల మేరకు ఇందిరమ్మ ఇళ్ల పథకంలో అర్హత పొందిన 15 మంది లబ్ధిదారులకు పత్రాలను అందజేశారు. అర్హులైన కుటుంబాలకు పారదర్శకంగా ఇళ్లు మంజూరు చేస్తామని, మధ్యవర్తులు, సిఫార్సులు అవసరం లేదని తెలిపారు. అనంతరం పర్యావరణ పరిరక్షణలో భాగంగా గ్రామంలో మొక్కలు నాటారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని సర్పంచ్ కోరారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్, వార్డు సభ్యులు, పంచాయతీ కార్యదర్శి, గ్రామ నాయకులు పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day


మహాముత్తారం, ఆగస్టు 18: గ్రామపంచాయతీ నిధులను వ్యక్తిగత ప్రయోజనాలకు వినియోగించారని ఆరోపిస్తూ బీజేపీ మండల ఉపాధ్యక్షుడు లింగమల్ల సడవలిరావు విమర్శలు చేశారు. కాంగ్రెస్ పార్టీ నాయకుడు మార్క బాపు సొంత భూమికి ఉపాధి హామీ నిధులతో సీసీ రోడ్డు నిర్మించారని ఆరోపించారు. ప్రజలకు ఉపయోగపడని ప్రాంతంలో, ఇరువైపులా చెట్లు మాత్రమే ఉన్న చోట సీసీ రోడ్డు నిర్మించడం ఎందుకని ఆయన ప్రశ్నించారు. ప్రజలకు అత్యవసరంగా అవసరమైన ప్రాంతాల్లో రోడ్లు నిర్మించాల్సి ఉండగా, వ్యక్తిగత ప్రయోజనాల కోసం రోడ్లు వేయడం సరికాదన్నారు. గ్రామపంచాయతీ పాలకవర్గ సభ్యులు వ్యక్తిగత ప్రయోజనాలకు సంబంధించిన తీర్మానాలపై సంతకాలు చేయవద్దని, సంబంధిత బిల్లులను చెల్లించవద్దని సడవలిరావు కోరారు. ఇప్పటికే నిర్మించిన సీసీ రోడ్డుపై జిల్లా కలెక్టర్, ఉన్నతాధికారులు సమగ్ర విచారణ చేపట్టి నిధుల దుర్వినియోగం జరిగిందా లేదా పరిశీలించాలని డిమాండ్ చేశారు. ప్రజాధనం ప్రజల అవసరాలకే వినియోగించాలని ఆయన కోరారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

మహాముత్తరం: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాముత్తరం మండల పరిషత్ కార్యాలయంలో రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ చిత్రపటాన్ని అవమానించిన ఘటనపై ప్రజా సంఘాలు, అంబేడ్కర్ వాదులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మండల అభివృద్ధి అధికారి (ఎంపీడీఓ) కార్యాలయంలో తాను కూర్చునే గదిలో తెలంగాణ ముఖ్యమంత్రి చిత్రపటాన్ని తన కుర్చీ పైన గోడపై గౌరవప్రదమైన స్థానంలో ఉంచి, దేశానికి రాజ్యాంగాన్ని అందించిన డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ చిత్రపటాన్ని మాత్రం కుర్చీ పక్కన రికార్డులు పడేసే పాత టేబుల్‌పై నిలబెట్టడం క్షమించరాని నేరమని కుల సంఘాల జేఏసీ జిల్లా కన్వీనర్ అజ్మీరా పూల్ సింగ్ నాయక్ మండిపడ్డారు. అంబేడ్కర్ చిత్రపటాన్ని తక్కువ చేసి చూపుతూ కావాలనే అవమానించిన సదరు అధికారిపై తక్షణమే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉంటూ రాజ్యాంగ నిర్మాతనే అవమానించిన ఎంపీడీఓను వెంటనే విధుల నుంచి తొలగించి (సస్పెండ్ చేసి) సమగ్ర విచారణ జరిపించాలని కోరారు. ఆధిపత్య అగ్రవర్ణ అహంకారంతోనే ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. జిల్లా ఉన్నతాధికారులు తక్షణమే స్పందించకపోతే జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు, ధర్నాలు చేపడతామని హెచ్చరించారు. దేశ గౌరవానికి, రాజ్యాంగ విలువలకే భంగం కలిగించేలా వ్యవహరించిన సదరు అధికారిపై జిల్లా కలెక్టర్, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ తక్షణమే స్పందించి కఠిన చర్యలు తీసుకోవాలని కుల సంఘాల జేఏసీ, అంబేడ్కర్ వాదులు డిమాండ్ చేశారు. ఈ ఘటనను తీవ్రస్థాయిలో ఖండించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జేఏసీ జిల్లా చైర్మన్ పీక కిరణ్, కో-కన్వీనర్ రామగిరి రాజు తదితరులు పాల్గొన్నారు.



Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

 

భూపాలపల్లి, ఆగస్టు 4: జయశంకర్ భూపాలపల్లి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో మహాముత్తారం మండల కేంద్రం, కొర్లకుంట, మాదారం గ్రామాల్లో మొబైల్ లీగల్ అవేర్‌నెస్ వ్యాన్ ద్వారా న్యాయ అవగాహనా సదస్సులు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ పుప్పాల శ్రీనివాస్ మాట్లాడుతూ, ఆర్థికంగా వెనుకబడిన వారు, కోర్టు కేసుల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారు, కుటుంబ, సివిల్, ప్రామిసరీ నోట్ తదితర వివాదాల్లో చిక్కుకున్న బాధితులు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ద్వారా ఉచిత న్యాయ సహాయం పొందవచ్చని తెలిపారు. డిప్యూటీ చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ కే. అక్షయ, ప్యానెల్ లాయర్ పారానంది సురేందర్, సూపరింటెండెంట్ రఘురామ్ మాట్లాడుతూ, వివాదాలను రాజీ మార్గంలో పరిష్కరించుకోవాలని, న్యాయపరమైన సమస్యలను సామరస్యంతో అధిగమించాలని సూచించారు. కార్యక్రమంలో కాటారం ఆర్డీఓ రవీందర్, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ జి. నవీన్ రెడ్డి, న్యాయ సేవాధికార సంస్థ సిబ్బంది అంబాల దేవేందర్, కే. వెంకటేష్, ఎం. రాజ్‌కుమార్, పారా లీగల్ వాలంటీర్ లింగమళ్ల రమాదేవి, పి. అంజయ్య, కిరణ్ తదితరులు పాల్గొన్నారు. మొబైల్ వ్యాన్ ద్వారా గ్రామీణ ప్రజలకు ఉచిత న్యాయ సేవలు, హక్కులు, చట్టాలపై విస్తృత అవగాహన కల్పించారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

జయశంకర్ భూపాలపల్లి, ఆగస్టు 3: మహాముత్తారం మండలం కోనంపేట మిషన్ భగీరథ వాటర్ ట్రీట్‌మెంట్ ప్లాంట్ (WTP)లో కాంట్రాక్టర్ల అక్రమాలు, కార్మికుల శ్రమదోపిడీ, అలవెన్సుల కుంభకోణంపై కుల సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ (JAC) జిల్లా చైర్మన్ పీక కిరణ్ నాయకత్వంలోని ప్రతినిధులు సోమవారం జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మకు ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. జూలై 27న ఇదే అంశంపై వినతిపత్రం సమర్పించినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ఆగస్టు 3న రిమైండర్ లేఖను అందజేశారు. ప్లాంట్‌లో నిబంధనల ప్రకారం 60 నుంచి 80 మంది సిబ్బంది ఉండాల్సి ఉండగా ప్రస్తుతం కేవలం 16 మందితోనే నిర్వహణ కొనసాగుతోందని ఆరోపించారు. దీంతో కార్మికులపై అధిక పనిభారం పడటమే కాకుండా ఆదివారాలు, పండుగ సెలవులు కూడా ఇవ్వడం లేదని పేర్కొన్నారు. కార్మికుల జీతాల నుంచి PF, ESI, మెడిక్లెయిమ్, పెట్రోల్ అలవెన్సుల పేరుతో నెలకు రూ.8 వేల నుంచి రూ.12 వేల వరకు అక్రమ కోతలు విధిస్తున్నారని, లేని ఉద్యోగులను రికార్డుల్లో చూపించి బిల్లులు డ్రా చేస్తున్నారని ఆరోపించారు. సూపర్‌వైజర్ పోస్టుల పేరుతో లక్షల రూపాయల అక్రమ వసూళ్లు జరుగుతున్నాయని కూడా తెలిపారు. కాంట్రాక్టర్‌పై క్రిమినల్ కేసులు నమోదు చేయడంతో పాటు, కార్మికులకు బకాయి అలవెన్సులు, PF, ESI, ఓవర్‌టైమ్ వేతనాలు చెల్లించాలని, ఖాళీ పోస్టులను పారదర్శకంగా భర్తీ చేయాలని జేఏసీ డిమాండ్ చేసింది. ఫిర్యాదును స్వీకరించిన జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ స్పందిస్తూ, మిషన్ భగీరథ మరియు కార్మిక శాఖ అధికారులతో సమగ్ర విచారణ జరిపించి బాధ్యులపై తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

 

మహాముత్తారం: మహాముత్తారం మండల కేంద్రంలో ఉన్న బీసీ బాలుర వసతి గృహాన్ని గత నెల రోజుల క్రితం ఎలాంటి సమాచారం లేకుండా కాటారం మండల కేంద్రానికి తరలించడంపై కుల ప్రజా సంఘాల జేఏసీ, డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ (DTF) ఆధ్వర్యంలో ఆందోళనలు చేపట్టారు. వివిధ రూపాల్లో నిరసనలు నిర్వహిస్తూ హాస్టల్‌ను తిరిగి మహాముత్తారంలోనే కొనసాగించాలని డిమాండ్ చేశారు.


ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్, ఉన్నతాధికారులు స్పందించి బీసీ హాస్టల్‌ను తిరిగి మహాముత్తారం మండల కేంద్రానికి తరలించారు. అనంతరం కుల ప్రజా సంఘాల జేఏసీ జిల్లా చైర్మన్ పీక కిరణ్‌తో పాటు అజ్మీరా పూల్‌సింగ్ నాయక్, ఐత బాపు, రామగిరి రాజు, లింగామల్ల సడవాలి రావు తదితరులు హాస్టల్‌ను సందర్శించి పరిసరాలను పరిశీలించారు. హాస్టల్ తరలింపు కోసం కుల ప్రజా సంఘాల జేఏసీ చేసిన పోరాటాన్ని పలువురు అభినందించారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

 

మహాముత్తారం: ఎల్‌నినో ప్రభావంతో తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నందున రైతులు తక్కువ నీటితో సాగు చేయగల ఆరుతడి పంటలపై దృష్టి సారించాలని మండల వ్యవసాయ అధికారి జి. అనుష సూచించారు. మహాముత్తారం మండలం బోర్లగూడెం రైతువేదికలో శనివారం విత్తన మేళాను ప్రారంభించారు. ఈ సందర్భంగా రైతులకు తక్కువ వర్షపాతంలోనూ సాగు చేసుకునే కంది, పెసర, మినుము తదితర పప్పుధాన్యాల విత్తనాలను అందుబాటులో ఉంచినట్లు అధికారులు తెలిపారు. ఈ విత్తన మేళా ఈ నెల 29వ తేదీ వరకు కొనసాగుతుందని పేర్కొన్నారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని తమకు అనుకూలమైన పంటలను ఎంచుకోవాలని సూచించారు. ఎల్‌నినో ప్రభావం కారణంగా రానున్న రోజుల్లో వర్షపాతం తక్కువగా నమోదయ్యే పరిస్థితులు ఉండే అవకాశం ఉందని, ఈ నేపథ్యంలో వరి వంటి అధిక నీటి అవసరం ఉన్న పంటలకు బదులుగా తక్కువ నీటితో సాగు చేయగల పప్పుధాన్యాలు, కూరగాయల వంటి ఆరుతడి పంటలను సాగు చేయడం ద్వారా రైతులు నీటి వనరులను పొదుపుగా వినియోగించుకోవచ్చని అధికారులు సూచించారు. రైతులు వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని పంటల ఎంపికలో వ్యవసాయ శాఖ అధికారుల సూచనలు పాటించాలని కోరారు. విత్తన మేళాలో అందుబాటులో ఉన్న విత్తనాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని మండల వ్యవసాయ అధికారి జి. అనుష విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారులు శివకృష్ణ, ప్రవళిక, శశివర్ధన్, ఉద్యాన శాఖ అధికారి రామదాస్, విత్తన డీలర్లు, రైతులు పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

మహాముత్తారం, జూలై 20: మహాముత్తారం మండలం యామన్‌పల్లి గ్రామంలో రూ.10 లక్షల వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్ల నిర్మాణ పనులను గ్రామ సర్పంచ్ అట్టెం రమేష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు ప్రత్యేక చొరవతో ఉపాధి హామీ పథకం నిధుల నుంచి ఈ పనులకు నిధులు మంజూరయ్యాయని తెలిపారు. గ్రామాల్లో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందన్నారు. గ్రామ అభివృద్ధికి సహకరించిన మంత్రి శ్రీధర్ బాబుకు గ్రామ ప్రజలు, కాంగ్రెస్ నాయకులు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో డీసీసీ కార్యదర్శి, ఉప సర్పంచ్ తలారి అఖిల్, రత్నం సడవలి, మండల కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రామోజీ, వార్డు సభ్యులు రత్నం లక్ష్మీస్వామి, అంతర్గం రాజయ్య తదితరులు పాల్గొన్నారు.






Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

 

మహా ముత్తారం, జూలై 19: కాటారం డివిజన్ సర్పంచుల ఫోరం నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన కొండగోర్ల బాపును మహా ముత్తారం మండల TPCC సోషల్ మీడియా కోఆర్డినేటర్ పుట్టల వెంకటేష్ శాలువాతో ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయనకు పుష్పగుచ్ఛం అందించి అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా పుట్టల వెంకటేష్ మాట్లాడుతూ, కొండగోర్ల బాపు సర్పంచుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తూ, డివిజన్‌లోని గ్రామాల అభివృద్ధికి సమన్వయంతో పనిచేయాలని ఆకాంక్షించారు. ప్రజా సమస్యల పరిష్కారంలో సర్పంచులకు అండగా నిలుస్తూ, స్థానిక సంస్థలను మరింత బలోపేతం చేసేలా తన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. కొండగోర్ల బాపు మాట్లాడుతూ తనపై ఉంచిన నమ్మకానికి కృతజ్ఞతలు తెలుపుతూ, డివిజన్ పరిధిలోని అన్ని గ్రామాల సర్పంచులను కలుపుకొని వారి సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లేందుకు కృషి చేస్తానని చెప్పారు. గ్రామాభివృద్ధి, ప్రజా సంక్షేమమే తన ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, సర్పంచులు, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొని కొండగోర్ల బాపుకు శుభాకాంక్షలు తెలిపారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

మహా ముత్తారం: సర్పంచుల ఫోరం కాటారం డివిజన్ నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన కొండగోర్ల బాపును మహా ముత్తారం మండల కాంగ్రెస్ నాయకులు ఘనంగా సన్మానించారు. ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఆదేశాల మేరకు మండల కాంగ్రెస్ అధ్యక్షుడు పక్కల సడవలి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో బాపుకు శాలువా కప్పి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, సర్పంచుల సమస్యల పరిష్కారంతో పాటు గ్రామాభివృద్ధికి కొండగోర్ల బాపు కృషి చేయాలని ఆకాంక్షించారు. నూతన బాధ్యతలను విజయవంతంగా నిర్వహించాలని శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డీసీసీ కార్యదర్శి అంగజాల అశోక్ కుమార్, మాజీ PACS చైర్మన్ ముక్కెర రాజమల్లు గౌడ్, మహిళా మండల అధ్యక్షురాలు సుజాత, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు జాటోత్ వంశిరాజ్, మండల కాంగ్రెస్ నాయకులు, సర్పంచులు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.






Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

 

మహా ముత్తారం: కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మహా ముత్తారం మండల కేంద్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (SIR) ప్రక్రియపై BLAలు, BLA సూపర్వైజర్లకు అవగాహన సమావేశం నిర్వహించారు. TPCC ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్, ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, TPCC ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీను బాబు ఆదేశాల మేరకు జరిగిన ఈ కార్యక్రమంలో డీసీసీ కార్యదర్శి, SIR మండల ఇన్‌చార్జి అంగజాల అశోక్ పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రతి BLA సూపర్వైజర్ చురుకుగా వ్యవహరించి అర్హులైన ప్రతి ఓటరు పేరు ఓటర్ల జాబితాలో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఓటర్ల జాబితాలో ఎలాంటి పొరపాట్లు లేకుండా ప్రతి ఇంటిని సందర్శించి అవసరమైన దరఖాస్తులు పూర్తి చేయించడంతో పాటు, హెల్ప్‌డెస్క్‌ల ద్వారా ప్రజలకు సహాయం అందించాలని కోరారు. నిబంధనల ప్రకారం SIR ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించాలని, పార్టీ శ్రేణులంతా సమన్వయంతో పనిచేసి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు పక్కల సడవలి, సర్పంచుల ఫోరం కాటారం డివిజన్ అధ్యక్షుడు కొండగోర్ల బాపు, మాజీ PACS చైర్మన్ ముక్కెర రాజమల్లు గౌడ్, మహిళా మండల అధ్యక్షురాలు సుజాత, యూత్ కాంగ్రెస్ నాయకులు, BLAలు, BLA సూపర్వైజర్లు, సర్పంచులు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.




Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

మహాముత్తారం, జూలై 18: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాముత్తారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 24 గంటల పాటు వైద్య సేవలు అందుబాటులో ఉండేలా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని తెలంగాణ ప్రజా ఫ్రంట్ (టీపీఎఫ్) జిల్లా అధ్యక్షుడు పీక కిరణ్ డిమాండ్ చేశారు. శనివారం మహాముత్తారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించిన ఆయన అక్కడి పరిస్థితులను పరిశీలించి అనంతరం విలేకరులతో మాట్లాడారు. ఏజెన్సీ ప్రాంతమైన మహాముత్తారంలో అత్యవసర వైద్య సేవలు అందుబాటులో లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు, స్థానిక ప్రజాప్రతినిధులు ఈ సమస్యను నిర్లక్ష్యం చేయడం వల్ల పేద ప్రజలు సరైన సమయంలో చికిత్స పొందలేక ప్రాణాపాయ పరిస్థితులను ఎదుర్కొంటున్నారని విమర్శించారు. ప్రస్తుతం డెంగ్యూ, మలేరియా వంటి సీజనల్ వ్యాధులు పెరుగుతున్న నేపథ్యంలో రోగులకు తక్షణ వైద్యం అవసరమవుతోందని తెలిపారు. అదే విధంగా రాత్రింబవళ్లు పొలాల్లో శ్రమించే రైతులు పాము, తేలు కాట్లకు గురయ్యే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని, అలాంటి అత్యవసర పరిస్థితుల్లో ఆస్పత్రిలో వైద్యులు అందుబాటులో లేకపోతే ప్రజల ప్రాణాలకు ముప్పు వాటిల్లే అవకాశం ఉందన్నారు. ఏజెన్సీ ప్రాంతాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి మహాముత్తారం పీహెచ్‌సీలో 24 గంటల పాటు వైద్యులు, నర్సింగ్ సిబ్బంది, అవసరమైన మందులు, అత్యవసర వైద్య సదుపాయాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. వైద్యం అనేది ప్రతి పౌరుడి ప్రాథమిక హక్కు అని, ఆ హక్కును కల్పించడంలో ప్రభుత్వం విఫలమైతే ప్రజలు సహించబోరని హెచ్చరించారు. స్థానిక అధికారులతో పాటు అధికార, ప్రతిపక్ష ప్రజాప్రతినిధులు కూడా ఈ సమస్యపై స్పందించకపోవడం దురదృష్టకరమని అన్నారు. ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడుతున్న అధికారులపై ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు. మహాముత్తారం పీహెచ్‌సీలో 24 గంటల వైద్య సేవలు ప్రారంభించకపోతే ప్రజలను సమీకరించి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని పీక కిరణ్ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం మండల అధ్యక్షుడు రామగిరి రాజుతో పాటు పలువురు స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day
మహా ముత్తారం, జూలై 14: మహా ముత్తారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్‌సీ) డాక్టర్ డెప్యుటేషన్‌ను వెంటనే రద్దు చేయాలని, మండల కేంద్రంలోని బీసీ హాస్టల్‌ను యథావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ కుల సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో మంగళవారం యామనపల్లి రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. ప్రభుత్వానికి, అధికారుల వైఖరికి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా జేఏసీ జిల్లా చైర్మన్ పీక కిరణ్ మాట్లాడుతూ వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలుతున్న సమయంలో మహా ముత్తారం పీహెచ్‌సీ డాక్టర్‌ను డెప్యుటేషన్‌పై పంపడం ప్రజారోగ్యాన్ని ప్రమాదంలోకి నెట్టడమేనని విమర్శించారు. నిరుపేదలు ప్రైవేట్ ఆస్పత్రులను ఆశ్రయించే స్థోమత లేక ఇబ్బందులు పడుతున్నారని, వెంటనే డెప్యుటేషన్ ఉత్తర్వులను రద్దు చేసి డాక్టర్‌ను తిరిగి విధుల్లోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. అదే విధంగా పేద విద్యార్థులకు ఉపయోగపడుతున్న బీసీ హాస్టల్‌ను తరలించే ప్రయత్నాలను విరమించుకుని, యథావిధిగా కొనసాగించాలని కోరారు. ప్రజల సమస్యలను అధికారులు, ప్రజాప్రతినిధులు వెంటనే పరిష్కరించకపోతే మండలవ్యాప్తంగా ఉద్యమాలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కుల సంఘాల జేఏసీ జిల్లా కన్వీనర్ అజ్మీర పూల్ సింగ్ నాయక్, జిల్లా కో-కన్వీనర్ రామగిరి రాజు, అయిత బాపు, మండల కో-కన్వీనర్ లింగమల్ల సడవలరావు, సురేష్, కాసర్ల రాజకుమార్, బానోత్ రాజు నాయక్, పులియాల దుర్గేష్, జనగామ రాజయ్య తదితరులు పాల్గొన్నారు.
Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day
మహా ముత్తారం, జూలై 13: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహా ముత్తారం మండలం మహబూబ్‌పల్లి గ్రామంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన రత్నం సారయ్య (60)ను ఆయన కుమారుడు రవీందర్ గొడ్డలితో దాడి చేసి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు.
ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో రవీందర్ గొడ్డలితో సారయ్యపై దాడి చేయడంతో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. కుటుంబ సభ్యులు వెంటనే చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో సారయ్య మృతిచెందారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించి కేసు నమోదు చేశారు. హత్యకు గల కారణాలపై దర్యాప్తు కొనసాగుతున్నట్లు పోలీసులు వెల్లడించారు.
Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day
మహా ముత్తారం, జూలై 8 : జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహా ముత్తారం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్‌సీ)లో విధులు నిర్వహించాల్సిన డ్యూటీ డాక్టర్‌ను నిబంధనలకు విరుద్ధంగా డిప్యుటేషన్‌పై జిల్లా కేంద్రానికి పంపడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు కుల సంఘాల జేఏసీ జిల్లా చైర్మన్ పీక కిరణ్ తెలిపారు. మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో ఆయన మాట్లాడుతూ, మహా ముత్తారం ప్రభుత్వ ఆసుపత్రిలో ఇద్దరు డ్యూటీ డాక్టర్లు పోస్టింగ్‌లో ఉన్నప్పటికీ, వారిలో ఒకరు అధికారుల సిఫార్సులు, పైరవీలతో జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రానికి డిప్యుటేషన్‌పై వెళ్లి అక్కడ విధులు నిర్వహిస్తున్నారని ఆరోపించారు. ఈ చర్య గ్రామీణ ప్రజల ఆరోగ్య హక్కులను దెబ్బతీసేదిగా ఉందని ఆయన విమర్శించారు.
ప్రస్తుతం వర్షాకాలం ప్రారంభమైన నేపథ్యంలో డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ వంటి సీజనల్ వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని పీక కిరణ్ పేర్కొన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఏజెన్సీ, వెనుకబడిన ప్రాంతాల ప్రజలకు వైద్య సేవలు అందించాల్సిన డాక్టర్లను జిల్లా కేంద్రాలకు తరలించడం వల్ల స్థానిక పేద రోగులు ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.
ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి సంబంధిత డాక్టర్ డిప్యుటేషన్‌ను వెంటనే రద్దు చేసి, ఆయనను యథావిధిగా మహా ముత్తారం పీహెచ్‌సీకి విధులకు హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. స్థానిక ప్రజలకు పూర్తిస్థాయిలో వైద్య సేవలు అందేలా చూడాలని, లేనిపక్షంలో కుల సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కో-కన్వీనర్ రామగిరి రాజు సురేష్ తదితరులు పాల్గొన్నారు.
Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day
మహముత్తారం, జూలై 4 (న్యూస్): మహముత్తారం మండల కేంద్రంలోని బీసీ బాలుర వసతి గృహాన్ని కాటారంకు తరలించడం అన్యాయమని, ఇందుకు బాధ్యులైన హాస్టల్ వార్డెన్‌ను వెంటనే సస్పెండ్ చేయాలని ప్రజా కుల సంఘాల జేఏసీ జిల్లా చైర్మన్ పీక కిరణ్ డిమాండ్ చేశారు. శనివారం మహముత్తారం మండల కేంద్రంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఉన్నతాధికారుల అనుమతి లేకుండా వార్డెన్ స్వయంగా నిర్ణయం తీసుకుని రాత్రికి రాత్రే హాస్టల్‌ను కాటారంకు తరలించడం తీవ్రంగా ఖండించారు. ఈ చర్య వల్ల మారుమూల గ్రామాలకు చెందిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారని ఆందోళన వ్యక్తం చేశారు. గత 40 ఏళ్లుగా మహముత్తారంలోని బీసీ బాలుర వసతి గృహం పేద విద్యార్థులకు వసతి, భోజన సౌకర్యాలు కల్పిస్తూ విద్యాభ్యాసానికి అండగా నిలుస్తోందని తెలిపారు. ప్రస్తుతం జడ్పీ హైస్కూల్‌లో చదువుతున్న విద్యార్థులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా హాస్టల్‌ను తరలించడం వెనుక ఉద్దేశం ఏమిటో అర్థం కావడం లేదన్నారు. జడ్పీ హైస్కూల్ ఉపాధ్యాయులు ఇటీవల 45 మంది విద్యార్థులకు అడ్మిషన్లు కల్పించారని, హాస్టల్ తరలింపుతో పాఠశాలలో విద్యార్థుల సంఖ్య తగ్గే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. ఉన్నతాధికారులు వెంటనే జోక్యం చేసుకుని బీసీ బాలుర వసతి గృహాన్ని తిరిగి మహముత్తారానికే తరలించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో జిల్లా జేఏసీ కన్వీనర్ అజ్మీర పూల్ సింగ్, కో-కన్వీనర్ రామగిరి రాజు, మండల చైర్మన్ ముక్కెర వెంకటస్వామి గౌడ్, మండల కన్వీనర్ లింగమల సడవాలిరావు తదితరులు పాల్గొన్నారు.
Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

మహాముత్తారం, జూన్ 11: మహాముత్తారం పోలీస్ స్టేషన్ నూతన ఎస్సైగా బాధ్యతలు స్వీకరించిన రమేష్‌ను నేతకాని హక్కుల పరిరక్షణ సంఘం నాయకులు, కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో నేతకాని హక్కుల పరిరక్షణ సంఘం మండల అధ్యక్షుడు, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు దుర్గం సడువలి పాల్గొన్నారు. అలాగే నేతకాని రాష్ట్ర యువజన విభాగం ప్రధాన కార్యదర్శి, యూత్ కాంగ్రెస్ నాయకుడు రాజబాబు నేత కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ మహాముత్తారం మండలం వెనుకబడిన ప్రాంతమని, ఇక్కడి ప్రత్యేక పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ప్రజలకు ఉత్తమ సేవలు అందించాలని ఎస్సై రమేష్‌ను కోరారు. ముఖ్యంగా శాంతిభద్రతల పరిరక్షణలో పారదర్శకత పాటిస్తూ మండల అభివృద్ధికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. దీనికి స్పందించిన ఎస్సై రమేష్, ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తూ శాంతిభద్రతల పరిరక్షణలో సమర్థవంతంగా పనిచేస్తానని తెలిపారు. మహాముత్తారం మండల అభివృద్ధికి తనవంతు సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. అనంతరం దుర్గం సడువలి, రాజబాబు నేతలు ఎస్సై రమేష్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

మహాముత్తారం మండల కేంద్రానికి చెందిన పలువురు బీఆర్ఎస్ నాయకులు గురువారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. బీఆర్ఎస్‌కు చెందిన పంగ సురేష్, మారగోని బాపు (పులి బాపు), జాడి బాపులు సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు కొండ గొర్ల బాపు ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరగా, రాష్ట్ర ఐటీ మరియు పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు వారికి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న ప్రజా సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నాయకులు కాంగ్రెస్‌లో చేరుతున్నారని పేర్కొన్నారు. పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తాటి లచ్చయ్య గౌడ్, మార్క బాపు, మహిళా మండల ఉపాధ్యక్షురాలు బౌతు రమ్య, యూత్ కాంగ్రెస్ మండల ఉపాధ్యక్షుడు గాదె రవీందర్, మహాముత్తారం టౌన్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు తాళ్లపల్లి సుధాకర్ గౌడ్, గ్రామ యూత్ అధ్యక్షుడు మాడెం ప్రసాద్, యువజన కాంగ్రెస్ నాయకుడు గడ్డం రాజేష్ తదితరులు పాల్గొన్నారు.