కాటారం, జూలై 12: కాటారం మండలం మేడిపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని మేడిపల్లి, బస్వాపూర్ గ్రామాల్లో అంతర్గత సీసీ రోడ్ల నిర్మాణ పనులకు ఆదివారం శ్రీకారం చుట్టారు. ఎంజీఎన్‌ఆర్‌ఈజీఎస్ నిధుల నుంచి రూ.5 లక్షలు, సీఆర్‌ఆర్ నిధుల నుంచి రూ.10 లక్షల వ్యయంతో చేపట్టిన ఈ అభివృద్ధి పనులను గ్రామ సర్పంచ్ గడవేణి పవిత్ర దేవేందర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ పవిత్ర దేవేందర్ మాట్లాడుతూ గ్రామాల్లో మెరుగైన మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. గ్రామాభివృద్ధికి అవసరమైన నిధులను మంజూరు చేసి సహకరించిన రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుకు గ్రామస్థులు, కాంగ్రెస్ నాయకులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ గుంటి మల్లయ్య, ఉపసర్పంచ్ రెడ్డి అనిల్, వార్డు సభ్యులు గుంటి శైలజ, మారావేణి మౌనిక, మానేటి రామచంద్రం, గుంటి లక్ష్మన్, పెరుమాళ్ల శివకుమార్, పొలం పుష్పలత, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు గడవేణి దేవేందర్ యాదవ్, కాంగ్రెస్ నాయకులు లిక్కి రాజమౌళి, గాదె లచ్చయ్య, మారావేణి లక్ష్మన్, గుంటి హన్మంత్, గుంటి సమ్మయ్యతో పాటు గ్రామస్థులు పాల్గొన్నారు.

Post A Comment: