భూపాలపల్లి, : జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో అఖిల భారత విద్యార్థి సంఘం (ఐసా) ఆధ్వర్యంలో ఈ నెల 26, 27 తేదీల్లో నిర్వహించనున్న రాజకీయ శిక్షణ తరగతుల కరపత్రాన్ని ఏఐసీటీయూ రాష్ట్ర కమిటీ సభ్యులు బంధు క్రాంతి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జిల్లాలో ఐసా విద్యార్థి సంఘం విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాటాలు చేస్తూ విద్యార్థుల హక్కుల పరిరక్షణలో కీలక పాత్ర పోషిస్తోందని అన్నారు. ఇటీవల దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్ ప్రశ్నాపత్రం లీకేజీ ఘటనపై జరిగిన నిరసన కార్యక్రమాల్లో ఐసా చురుకుగా పాల్గొన్నట్లు తెలిపారు. రాష్ట్రంలో తమిళనాడు తరహా విద్యా విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ కూడా ఐసా నిరంతర ఉద్యమాలు నిర్వహిస్తోందన్నారు. విద్యార్థుల సంక్షేమానికి సంబంధించిన సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో పాటు వారి హక్కుల సాధన కోసం సంఘం కృషి చేస్తోందని చెప్పారు. పోరాటాలతో పాటు డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్, భగత్ సింగ్, సావిత్రిబాయి ఫూలే, మహాత్మా జ్యోతిరావు ఫూలే వంటి మహనీయుల ఆశయాలను విద్యార్థులకు పరిచయం చేస్తూ జయంతులు, వర్ధంతులను నిర్వహిస్తోందని పేర్కొన్నారు. విద్యార్థుల్లో నైతిక విలువలు, శాస్త్రీయ దృక్పథం, సామాజిక బాధ్యతను పెంపొందించడమే రాజకీయ శిక్షణ తరగతుల ప్రధాన ఉద్దేశమని తెలిపారు. భవిష్యత్తులో విద్యారంగ సమస్యలపై సమర్థవంతంగా పోరాడే నాయకత్వాన్ని తీర్చిదిద్దడంతో పాటు రాజకీయ, సామాజిక, ఆర్థిక అంశాలపై అవగాహన కల్పించేందుకు ఈ శిక్షణ తరగతులు దోహదపడతాయని అన్నారు. దేశంలో కుల, మత, ప్రాంతీయ విద్వేషాలను రూపుమాపుతూ భగత్ సింగ్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు ఐసా కృషి చేస్తోందని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విద్యా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పోరాటాలను మరింత బలోపేతం చేసేందుకు ఈ శిక్షణ తరగతులు ఉపయోగపడతాయని తెలిపారు. ఈ నేపథ్యంలో రాజకీయ శిక్షణ తరగతులను విజయవంతం చేసేందుకు పెద్దలు, మేధావులు, విద్యార్థి మిత్రులు, విద్యాసంస్థల ప్రతినిధులు, ప్రజలు తమ వంతు ఆర్థిక, నైతిక సహకారాన్ని అందించి ఐసా విద్యార్థి సంఘాన్ని బలోపేతం చేయాలని బంధు క్రాంతి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఐసా జిల్లా కార్యదర్శి బి. సుజాత, జిల్లా అధ్యక్షురాలు బుర్ర స్వాతి, జిల్లా కమిటీ నాయకులు అశ్విత, నాగమణి, లక్ష్మణ్, అభిరామ్ తదితరులు పాల్గొన్నారు.


Axact

ANAPARTHI SRINIVAS GOUD

CEO MEDIGADDA TV NEWS Mobile Number 9848223934 9502908070

Post A Comment: