Articles by "hanamkonda (హనుమకొండ)"
Showing posts with label hanamkonda (హనుమకొండ). Show all posts
Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

హనుమకొండ: యువత రాజకీయాల్లో ముందుండి నడవాలని, రాష్ట్ర రాజకీయాల్లో యువత కీలక పాత్ర పోషించాలని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న పిలుపునిచ్చారు. హనుమకొండ అంబేద్కర్ భవన్‌లో నిర్వహించిన “జెన్జీ యువత చర్చ విత్ తీన్మార్ మల్లన్న” కార్యక్రమంలో సుమారు 2,000 మంది విద్యార్థులతో ఆయన భవిష్యత్ రాజకీయాలు, యువత పాత్రపై చర్చించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధ్యక్షుడు రవి పటేల్ ఆధ్వర్యంలో జిల్లాలోని వివిధ కళాశాలలకు చెందిన విద్యార్థులు భారీగా హనుమకొండకు తరలివచ్చారు. పబ్లిక్ గార్డెన్ ఎదుట నినాదాలు చేస్తూ ఉత్సాహంగా కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులు.. అక్కడి నుంచి అంబేద్కర్ సెంటర్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. తీన్మార్ మల్లన్న ఆశయాలు, ఆకాంక్షలకు ఆకర్షితులైన పలువురు విద్యార్థులు తెలంగాణ రాజ్యాధికార పార్టీ కండువాలు కప్పుకొని పార్టీలో చేరారు. అనంతరం రవి పటేల్ ఆధ్వర్యంలో విద్యార్థులు అంబేద్కర్ భవన్‌లో జరిగిన యువత చర్చా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ.. రాష్ట్రంలో రాజకీయ మార్పు తీసుకురావడంలో యువత పాత్ర అత్యంత కీలకమన్నారు. యువతకు తెలంగాణ రాజ్యాధికార పార్టీ తగిన అవకాశాలు కల్పిస్తుందని తెలిపారు. విద్యార్థులు తమ భవిష్యత్‌పై స్పష్టమైన అవగాహనతో ముందుకు సాగడంతో పాటు ప్రజా సమస్యలపై పోరాడాలని సూచించారు. కార్యక్రమంలో జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఉపాధ్యక్షుడు ఇనుగాల ప్రణయ్ రాజ్, జనరల్ సెక్రటరీ పిట్టల వెంకటేష్, క్రమశిక్షణ కమిటీ చైర్మన్ గండు కరుణాకర్, బొగ్గు గని కార్మిక విభాగం అధ్యక్షుడు అనంతుల సంపత్ బొట్టు, జిల్లా పార్టీ మీడియా ఇన్‌చార్జి మడే సంతోష్, బసవరాజుపల్లి గ్రామ కమిటీ అధ్యక్షుడు అంబటి అశోక్ యాదవ్, వనం నరేష్ తదితరులు పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

 
హనుమకొండ, జూన్ 22: తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు వెంటనే యూనిఫార్మ్స్ అందించాలని, రాష్ట్రంలో ఫీజుల నియంత్రణ చట్టాన్ని అమలు చేయాలని ఎస్ఎఫ్ఐ హనుమకొండ జిల్లా కమిటీ డిమాండ్ చేసింది. ఈ మేరకు సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట విద్యార్థులతో కలిసి భారీ ధర్నా చేపట్టింది. కలెక్టర్‌కు వినతిపత్రం అందించేందుకు కార్యాలయంలోకి వెళ్లేందుకు ప్రయత్నించిన ఎస్ఎఫ్ఐ నాయకులను పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేసి సుబేదారి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి మంద శ్రీకాంత్ మాట్లాడుతూ.. పాఠశాలలు ప్రారంభమై పది రోజులు గడిచినా ఇప్పటికీ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు యూనిఫార్మ్స్ అందకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని విమర్శించారు. ప్రభుత్వ పాఠశాలల్లో మరుగుదొడ్లు, తాగునీరు, సరైన తరగతి గదులు, ఫ్యాన్లు, కంప్యూటర్ ల్యాబ్స్, క్రీడా సామగ్రి వంటి మౌలిక వసతులు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. హనుమకొండ నగరంలో అనుమతులు లేని ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థలు పుట్టగొడుగుల్లా పెరిగిపోతున్నప్పటికీ విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు. కొన్ని ప్రైవేట్ పాఠశాలలు ఎల్‌కేజీ, యూకేజీ విద్యార్థుల నుంచే లక్ష రూపాయల వరకు ఫీజులు వసూలు చేస్తున్నాయని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఫీజుల నియంత్రణ చట్టాన్ని తీసుకురావాలని, పెండింగ్‌లో ఉన్న స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను విడుదల చేయాలని, రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రిని నియమించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం వెంటనే విద్యార్థుల సమస్యలను పరిష్కరించకపోతే రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని ఎస్ఎఫ్ఐ నాయకులు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు బొచ్చు కళ్యాణ్, జిల్లా సహాయ కార్యదర్శి బిరెడ్డి జస్వంత్, జిల్లా కమిటీ సభ్యులు బొచ్చు ఈశ్వర్, ఎండి ఇస్మాయిల్, చెన్నూరి సాయికుమార్, పవన్ కుమార్, సాల్మన్ రాజ్, అభిషేక్, రణదీప్, ప్రభాస్, మల్లేష్, నాగరాజ్, సురాజ్, రాహుల్ తదితరులు పాల్గొన్నారు.



Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

హనుమకొండ, మే 29 (ప్రతినిధి): రాష్ట్రంలో ప్రజాపాలన పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తోందని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాటలు కోటలు దాటుతున్నా చేతల్లో మాత్రం శూన్యమే కనిపిస్తోందని పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి తీవ్రస్థాయిలో విమర్శించారు. శుక్రవారం పరకాల, నడికూడ మండలాలకు చెందిన సర్పంచులు, ఉపసర్పంచులతో కలిసి హనుమకొండలోని తన నివాసంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. గ్రామాల్లో నెలకొన్న సమస్యలు, అభివృద్ధి పనుల దుస్థితి, పార్టీ పరిస్థితులు, సభ్యత్వ నమోదు కార్యక్రమం, ఎస్‌ఐఆర్ కార్యక్రమంపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా చల్లా ధర్మారెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర పాలన పూర్తిగా గాడితప్పిందన్నారు. ఎన్నికల సమయంలో ఆరు గ్యారంటీలు అంటూ ప్రజలకు భారీ హామీలు ఇచ్చిన కాంగ్రెస్ నేతలు ఇప్పుడు వాటి అమలులో పూర్తిగా విఫలమయ్యారని విమర్శించారు. ప్రజల దృష్టి మళ్లించేందుకు ప్రతిరోజూ కొత్త మాటలు చెబుతున్నారే తప్ప అభివృద్ధి ఎక్కడా కనిపించడం లేదన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సీఎం కేసీఆర్ నాయకత్వంలో గ్రామాలు అభివృద్ధి బాటలో నడిచాయని, పల్లె ప్రగతి, రైతుబంధు, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ వంటి పథకాలతో గ్రామీణ ప్రాంతాల రూపురేఖలు మారాయని గుర్తుచేశారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గ్రామ పంచాయతీలకు నిధులు నిలిపివేసి సర్పంచులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోందని ఆరోపించారు. గ్రామాల్లో తాగునీరు, పారిశుద్ధ్యం, డ్రైనేజీ, వీధి దీపాలు వంటి కనీస సౌకర్యాలు కూడా లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, ప్రభుత్వం మాత్రం ప్రకటనలకే పరిమితమైందని మండిపడ్డారు. ప్రజాపాలన పేరుతో ప్రచారం చేసుకుంటున్న ప్రభుత్వం ప్రజల సమస్యలపై కనీస చిత్తశుద్ధి చూపడం లేదన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం రాజకీయ కక్షసాధింపులతో ముందుకెళ్తోందని, ప్రతిపక్షాలపై విమర్శలు చేయడం తప్ప రాష్ట్ర అభివృద్ధిపై దృష్టి పెట్టడం లేదని ఆరోపించారు. రైతులు, నిరుద్యోగులు, మహిళలు, గ్రామీణ ప్రజలు కాంగ్రెస్ పాలనపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారని పేర్కొన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, రాబోయే రోజుల్లో ప్రజలే ఈ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెబుతారని చల్లా ధర్మారెడ్డి హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్‌పై అప్రమత్తంగా ఉండాలని, పార్టీ చేపట్టిన సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని పార్టీ శ్రేణులు బాధ్యతగా నిర్వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పరకాల, నడికూడ మండలాల బీఆర్ఎస్ సర్పంచులు, ఉపసర్పంచులు తదితరులు పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

 

హనుమకొండ నయీమ్ నగర్‌లో తెలంగాణ రాజ్యాధికార పార్టీ భూపాలపల్లి జిల్లా నాయకుడు వైద్య లక్ష్మణ్ ఆధ్వర్యంలో నూతన జాబ్ కన్సల్టెన్సీ ఆఫీస్ ప్రారంభమైంది. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి జిల్లా అధ్యక్షుడు రవి పటేల్ ముఖ్య అతిథిగా హాజరై రిబ్బన్ కట్ చేసి కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడంలో ఈ కన్సల్టెన్సీ కీలక పాత్ర పోషించాలని ఆకాంక్షించారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు సమాజానికి ఎంతో ఉపయోగకరమని, యువతకు మార్గదర్శకంగా నిలుస్తాయని పేర్కొన్నారు.

వైద్య లక్ష్మణ్ చేపట్టిన ఈ ప్రయత్నాన్ని అభినందిస్తూ, కొత్తగా ప్రారంభమైన ఈ ఆఫీస్ విజయవంతంగా కొనసాగాలని, మరింత అభివృద్ధి సాధించాలని శుభాకాంక్షలు తెలియజేశారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

 

TG: మానవత్వాన్ని మర్చిపోయేలా చేసిన దారుణ ఘటన హనుమకొండ జిల్లా పున్నేలులో చోటుచేసుకుంది. కొడుకు కావాలనే అంధ విశ్వాసం, మూర్ఖమైన ఆశ ఒక తండ్రిని కిరాతకుడిగా మార్చింది. అజహరుద్దీన్ అనే వ్యక్తి తన గర్భిణి భార్యతో పాటు ఇద్దరు అమాయక కూతుళ్లను స్విమ్మింగ్ పూల్‌లో ముంచి హత్య చేసిన ఘటన రాష్ట్రాన్ని కుదిపేస్తోంది. ఇంకోసారి కూడా ఆడపిల్ల పుడుతుందేమోనన్న అనుమానంతో, తనకే ప్రాణంగా ఉండాల్సిన కుటుంబాన్ని చంపేయడం ప్రతి ఒక్కరినీ కలచివేస్తోంది. “నాన్న” అని పిలిచిన ఆ చిన్నారుల ప్రేమ కూడా అతని గుండెను కరిగించలేకపోయింది. ఈ ఘటనపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కూతుళ్లపై వివక్ష ఇంకా సమాజంలో బతికే ఉందనే చేదు నిజాన్ని ఈ దారుణం మరోసారి బయటపెట్టింది.