కాళేశ్వరం: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవ్‌పూర్ మండలం కాళేశ్వరం గ్రామంలో నూతన బస్టాండ్‌ను అటవీ ప్రాంతంలోని హనుమాన్ ఆలయం ఎదుట సర్వే నంబర్ 129లో నిర్మించాలని 9 మంది వార్డు సభ్యులు, స్థానికులు డిమాండ్ చేశారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ అశోక్‌కుమార్‌కు సయ్యద్ ఇమ్రాన్‌తో పాటు స్థానికులు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కాళేశ్వరం గ్రామంలో నూతన బస్టాండ్ నిర్మాణానికి సర్వే నంబర్ 129 అనువైన ప్రదేశమని తెలిపారు. ప్రతి పుష్కర సమయంలో ఇదే ప్రాంతంలో తాత్కాలిక బస్టాండ్ ఏర్పాటు చేస్తున్నారని, అదే స్థలంలో శాశ్వత బస్టాండ్ నిర్మిస్తే ప్రజలకు మరింత సౌకర్యంగా ఉంటుందని పేర్కొన్నారు. సర్వే నంబర్ 129లో బస్టాండ్ ఏర్పాటు చేస్తే కాళేశ్వరాన్ని ఆనుకుని ఉన్న పరిసర గ్రామాలతో పాటు కాళేశ్వరం గ్రామంలోని పలు వార్డుల ప్రజలకు కూడా రవాణా సౌకర్యం మెరుగుపడుతుందని అన్నారు. బస్టాండ్ ఏర్పాటు వల్ల గ్రామ విస్తీర్ణం పెరగడంతో పాటు అభివృద్ధి మరింత వేగవంతమయ్యే అవకాశం ఉందని తెలిపారు. అటవీ ప్రాంతంలో బస్టాండ్ నిర్మాణానికి కాళేశ్వరం గ్రామానికి చెందిన 500 మందికి పైగా ప్రజలు సంతకాలు చేసి తమ మద్దతు తెలిపినట్లు వెల్లడించారు. ప్రత్యక్షంగా 500 మందికి పైగా సంతకాలు చేసినప్పటికీ, పరోక్షంగా మరెంతో మంది ప్రజలు ఈ ప్రతిపాదనకు మద్దతు ఇస్తున్నారని తెలిపారు. కాళేశ్వరం పాలకవర్గంలోని 12 మంది సభ్యుల్లో 9 మంది వార్డు సభ్యులు కూడా అటవీ ప్రాంతంలోని సర్వే నంబర్ 129లోనే బస్టాండ్ నిర్మించాలని కోరుతూ సంతకాలు చేసినట్లు పేర్కొన్నారు.

సాకి కుంట చెరువును పునరుద్ధరించాలి.

అదేవిధంగా కాళేశ్వరం గ్రామంలోని సాకి కుంట చెరువుకు పూర్వ వైభవం తీసుకురావాలని స్థానికులు కోరారు. చెరువులను కాపాడేందుకు హైడ్రా తీసుకుంటున్న చర్యలు అభినందనీయమని, అదే విధంగా సాకి కుంట చెరువు కబ్జాలకు గురికాకుండా అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. సాకి కుంట చెరువు పైభాగం నిండుకుండలా ఉండేలా అవసరమైన చర్యలు చేపట్టాలని కోరారు. గతంలో చెరువు కింది భాగంలో కాళేశ్వరం యువత క్రీడలు ఆడేవారని, ప్రస్తుతం క్రీడలకు అనువైన స్థలం లేక యువత ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. చెరువును పునరుద్ధరించడంతో పాటు క్రీడా స్థలాన్ని కూడా అభివృద్ధి చేసి యువతకు అందుబాటులోకి తీసుకురావాలని కోరారు. కాళేశ్వరం గ్రామ ప్రజల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని సర్వే నంబర్ 129లోనే శాశ్వత బస్టాండ్ నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని వారు అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో కాళేశ్వరం స్థానికులు ఆడప సంతోష్, మబ్బు సాయికిరణ్, తోట చంద్రశేఖర్‌తో పాటు పలువురు పాల్గొన్నారు.

Axact

ANAPARTHI SRINIVAS GOUD

CEO MEDIGADDA TV NEWS Mobile Number 9848223934 9502908070

Post A Comment: