Articles by "ఆంధ్రప్రదేశ్"
Showing posts with label ఆంధ్రప్రదేశ్. Show all posts
Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day
విశాఖపట్నం, మార్చి 30: నగరాన్ని కలవరపరిచిన దారుణ ఘటనలో ప్రియురాలు మౌనిక (29)ను హత్య చేసి ముక్కలుగా నరికిన కేసులో నిందితుడు రవీంద్ర ఫోటో తాజాగా బయటకు వచ్చింది. ఈ కేసులో విచారణ కొనసాగుతున్న కొద్దీ సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పోలీసుల సమాచారం ప్రకారం, రవీంద్ర-మౌనికల పరిచయం డేటింగ్ యాప్ ద్వారా ప్రారంభమై, తరువాత అది వివాహేతర సంబంధానికి దారితీసింది. ఈ సంబంధంలో భాగంగా ఇప్పటివరకు రవీంద్ర మౌనికకు సుమారు రూ.3.50 లక్షలు ఇచ్చినట్లు విచారణలో వెల్లడించాడు. ఘటన జరిగిన రోజు కూడా మౌనిక నేవీ ఐడీ కార్డు పేరుతో డబ్బులు డిమాండ్ చేయడంతో ఇద్దరి మధ్య ఘర్షణ తలెత్తినట్లు తెలుస్తోంది. ఈ వివాదం హత్యకు దారితీసిందని రవీంద్ర పోలీసులకు అంగీకరించినట్లు సమాచారం. ఇదిలా ఉండగా, హత్యకు ముందుగానే ఆన్లైన్లో కత్తి, శుభ్రపరిచే సామగ్రి కొనుగోలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం రేపింది.