మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండేపై స్టాండప్ కమెడియన్ కునాల్ కమ్రా చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. షిండేను ఉద్దేశించి దేశద్రోహి అంటూ చేసిన వ్యాఖ్యలు ఆగ్రహానికి దారి తీశాయి. షిండే అభిమానులు, శివసేన కార్యకర్తలు హాస్య నటుడుకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళనలు, నిరసనలు చేపట్టారు. దీనికి సంబంధించిన వివరాలు కునాల్ కమ్రా షో జరిగిన హోటల్‌పై దాడి ఆదివారం రాత్రి ముంబైలోని ఖార్‌లోని హోటల్ యూనికాంటినెంటల్‌లో జరిగిన స్టాండప్ కమెడియన్ కునాల్ కామ్రా "నయా భారత్"లో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్ షిండేను "గద్దార్" (ద్రోహి) అని పరోక్షంగా సూచిస్తూ వ్యాఖ్యలు చేశాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో ఆగ్రహించిన షిండే నేతృత్వంలోని శివసేన సభ్యులు తీవ్రంగా స్పందించారు. ఆదివారం రాత్రి శివసేన కార్యకర్తలు కామ్రా షో జరిగిన హోటల్‌పై దాడి చేసి ఆస్తిని ధ్వంసం చేశారు. కమెడియన్ కామ్రాను అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ ఖార్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. శివసేన ఎంపీ నరేష్ మ్హాస్కే కామ్రాను హెచ్చరిస్తూ, అతను దేశవ్యాప్తంగా స్వేచ్ఛగా తిరగలేని విధంగా చేస్తామని, బాలాసాహెబ్ థాకరే శివ సైనికులు అతన్ని వదిలిపెట్టరని హెచ్చరికలు జారీ చేశారు. శివసేన నేత ఉద్ధవ్ ఠాక్రే నుంచి కునాల్ కమ్రా డబ్బులు తీసుకున్నారని, అందుకే ఏక్‌నాథ్ షిండేను లక్ష్యంగా చేసుకున్నారని లోక్‌సభ ఎంపీ నరేష్ మ్హాస్కే ఆరోపించారు. కునాల్‌ను "కాంట్రాక్ట్ కమెడియన్" అని కూడా ఆయన వ్యాఖ్యానించారు. శివసేన(యూబీటీ) ఎమ్మెల్యే ఆదిత్య ఠాక్రే శివసేన కార్యకర్తల దౌర్జన్యాన్ని ఖండించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయంటూ ధ్వజమెత్తారు. ఈ సంఘటన మహారాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపింది.
BREAKING NEWS:-
బెంగుళూరులో దారుణం జరిగింది. 6 ఏళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. కాలుతో తొక్కి చంపాడు ఓ కామాంధుడు. సమాచారం అందుకున్న పోలీసులు అతని అరెస్టు చేసి హుటా హుటిన పోలీస్ స్టేషన్ కి తరలించారు. పోలీసుల కథనం ప్రకారం. నిందితుడు బీహార కు చెందిన రోజు కూలీగా పని చేస్తున్నట్టు తెలుస్తుంది. భవన నిర్మాణ కూలీగా పనిచేస్తూ. తనతో కలిసి పని చేస్తున్న కూతురిపై తల్లిదండ్రులు లేని సమయం చూసి అత్యాచారానికి పాల్పడ్డాడు.
న్యూఢిల్లీ: భారత దేశ మాజీ PM మన్మోహన్ సింగ్ మృతదేహాన్ని కాంగ్రెస్ హెడ్కోటర్స్ లో ఉంచారు. పార్థివ దేహం యొక్క అంతిమ యాత్ర ఈరోజు ఉదయం 9.30 గంటలకు AICC నుండి శ్మశాన వాటికకు ప్రారంభమైంది" అని ఆయన అంత్యక్రియలకు సంబంధించిన సమాచారాన్ని అధికారులు తెలిపారు. దేశం తన ప్రియమైన 14వ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ మృతిపై ఆయనకు హృదయపూర్వక నివాళులు అర్పిస్తున్న వేళ, ఆయన అంతిమ వీడ్కోలు ఈరోజు కాంగ్రెస్ ప్రధాన కార్యాలయం నుండి ప్రారంభం అవుతుంది. ఢిల్లీలోని నిగమ్బేధ్ ఘాట్లో ఉదయం 11:45కు అంత్యక్రియలు జరుగుతాయి. మన్మోహన్ సింగ్ కు రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ తదితరుల నివాళి అర్పించారు.
చౌటుప్పల్ టౌన్ ప్రతినిధి చింతకింది కార్తీక్
హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్
సమక్షంలో చౌటుప్పల్ ఎంపీపీ తాడూరి వెంకట్ రెడ్డి, మాజీ జడ్పీటీసీ పెద్దిటి బుచ్చిరెడ్డి, మాజీ సర్పంచ్ ఎడ్ల మహేందర్ రెడ్డి, పార్టీ సీనియర్ నాయకులు కంది లక్ష్మా రెడ్డిలు మంగళవారం హైదరాబాద్ లో బిజెపి తీర్థం పుచ్చుకున్నారు.
ఈటెల రాజేందర్ వారికి కాషాయ కండువాలను కప్పి పార్టీలోకి ఆహ్వానిం చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న రోజుల్లో టిఆర్ఎస్,
కాంగ్రెస్ మూలన పడనున్నాయన్నారు. బిజెపి అన్ని విధాలుగా పుంజుకొని అధికారం సాధించడం ఖాయమన్నారు. కార్య కర్తలు అధైర్య పడవద్దని, రానున్న రోజులన్నీ బిజెపివే అన్నారు.