కోల్‌కతాలోని ఓ ప్రముఖ లా కాలేజీలో చదువుతున్న విద్యార్థినిపై జరిగిన గ్యాంగ్‌రేప్ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. తాజాగా, ఈ కేసులో మరో నిందితుడు అరెస్ట్ అయ్యాడు. శనివారం రోజున, ఆ కాలేజీలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న పినాకి బెనర్జీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఇప్పటికే ఈ కేసులో ముగ్గురు అరెస్ట్ అయ్యారు. వారిలో ప్రధాన నిందితుడు తృణమూల్ కాంగ్రెస్ (TMC) నాయకుడు, కాలేజీకి మాజీ విద్యార్థి ఉండటం గమనార్హం. ప్రస్తుతం అరెస్ట్ అయిన పినాకి బెనర్జీ కూడా ఈ ఘటనలో భాగస్వామిగా ఉన్నట్టు విచారణలో తేలడంతో అతడినీ అరెస్ట్ చేశారు.
ఈ ఘటనపై దర్యాప్తు ఇంకా కొనసాగుతోంది. బాధితురాలికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు.

Post A Comment: