మేడిగడ్డ, న్యూస్ హనుమకొండ,ప్రతినిధి
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఏబీవీపీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి మాచర్ల రాంబాబు, విభాగ వ్యవస్థ ప్రముఖ్ ఎలేటి నాగరాజు, విభాగ్ సంఘటన కార్యదర్శి కుంట హర్షవర్ధన్, ఆర్ట్స్ కళాశాల ప్రొఫెసర్ సుంకరి జ్యోతి, స్టేట్ వర్కింగ్ కమిటీ మెంబర్ ఆరేపెల్లి సుజిత్, మరియు కొత్తపల్లి సుధాకర్, ఈ కార్యక్రమంలో పాల్గొని జెండా ఆవిష్కరణ మరియు జ్యోతి ప్రజ్వలన అనంతరం రాష్ట్ర కార్యదర్శి మాచర్ల రాంబాబు మాట్లాడుతూ దేశంలో యువత రోజు రోజుకు మత్తు పదార్థాలకు, మాదక ద్రవ్యాలకు బానిసై ఏంతో మంది విద్యార్ధులు తమ ప్రాణాలను కోల్పోతున్నారు. విద్యార్ధులు సుభాష్ చంద్రబోస్ వంటి స్వాతంత్ర సమరయోధులను విద్యార్థులు స్ఫూర్తిగా తీసుకొని జీవితంలో ముందుకు సాగాలని యువతకు సూచించారు. నేతాజీ కి జయంతి ఏ కానీ వర్ధంతి లేని ఏకైక స్వాతంత్ర సమరయోధుడు అని విద్యార్థులతో అన్నారు, స్వామి వివేకానంద ప్రపంచ దేశాలకు హిందుత్వాన్ని, భరత దేశ ఔన్నత్యాన్ని చాటిచెప్పారు. భారత సంస్కృతినీ ప్రపంచ దేశాలకు చెరవేసిన మొట్ట మొదటి వ్యక్తి స్వామీ వివేకానంద. వీరిద్దరి అడుగు జాడల్లో ప్రతినిత్యం ఏబీవీపీ నడుస్తుంది అని అన్నారు, ఒక అప్పటి కాలంలో దేశానికి సైనిక దళాన్ని, దేశభక్తులను,స్వాతంత్ర సమరయోధులను అందించినటువంటి పంజాబ్ రాష్ట్రం నేడు మత్తు పదార్థాలకు, వ్యసనాలకు అలవాటు పడి పంజాబ్ రాష్ట్రం నాశనం అవుతుంది అని మాట్లాడారు, భగత్ సింగ్, రాజ్ గురు , సుక్దేవ్ లాంటి మహా వీరులు పుట్టిన ఈ నెలలో నా దేశ యువత నేడు మత్తుపదర్థలకు అలవాటు పడి చెడిపోతున్నారు అని అన్నారు. రాష్ట్రంలో విచ్చల విడిగా డ్రగ్స్ రాకెట్ దందాలు రోజు రోజుకు ఎక్కువ అవుతున్నాయి అని, ప్రభుత్వాలు కట్టడి చేసిన బయటి రాష్ట్రాల్లో నుండి అక్రమ రవాణా జరుగుతుంది అని దీనికి ఆనకట్ట వేయాలంటే కేవలం దేశ యువత తోనే సాధ్యం అవుతుంది అని మాట్లాడారు. దేశంలో క్రీడారంగంలో యువకులను రాణించాలని, వారి ప్రతిభను కలశాల క్యాంపస్ నుండి దేశానికి మంచి పేరు తెచ్చే విధంగా విద్యార్ధులు తయారు చేసే కేంద్రంగా భరత్ ముందుకు వెళుతుంది అని అన్నారు. ఖేలో భారత్ అనేది దేశంలోనీ ప్రతీ కలశాల, పాఠశాల క్యాంపస్ లలో ఏబీవీపీ నిర్వహిస్తుందని నషా విముక్త్ భారత్ ను తయారు చేయడమే ఏబీవీపీ ఏకైక లక్ష్యమని తెలియజేశారు కార్యక్రమంలో జిల్లా స్పోర్ట్స్ కన్వీనర్ హరిచరణ్ , రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శ్రవణ్ భరత్ , సర్దార్ , రాహుల్, సలీం , క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.