చౌటుప్పల్ టౌన్ ప్రతినిధి చింతకింది కార్తీక్
కరోనా సమయంలో సైతం సుశీలమ్మ ఫౌండేషన్ ద్వారా ప్రజలకు నిత్యావసర
సరుకుల పంపిణి, ఆపదలో ఉన్న వారికి తన వంతుసాయంగా ఆర్థికంగా ఆదుకున్న మాజీ ఎమ్మెల్యేకోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కి ప్రజలు పూర్తి మద్దతుగా నిలువాలని పబ్బు శ్రీకాంత్ గౌడ్
ప్రజలను కోరారు. మునుగోడు ప్రజల క్షేమాన్ని కోరితన ఎమ్మెల్యే పదవికి సైతం రాజీనామా చేసి,మరుగున పడిన పనులను కూడా పరుగులు పెట్టిస్తున్న, ఆయన రాజీనామా చాలా గొప్పదని ప్రశంసించారు. అధికార పార్టీ నేతలు, రాజగోపాల్
రెడ్డిని ఎదురించే శక్తి లేకనే, ప్రజలను ఇబ్బందులకుగురి చేస్తూ, ఎన్నో అభివృద్ధి పనులను సైతం కక్ష పూరితంగా నిలిపి వేశారని, ఇప్పుడు ఆయన రాజీనామాతో తెర మీదికి వచ్చాయనిఅన్నారు. ఆసరా పెన్షన్ లు, రేషన్ కార్డులు, రోడ్లమరమ్మత్తులు, కొత్త రోడ్ల నిర్మాణం,
ప్రభుత్వ కార్యాలయాలలో మొండి కేసులు వంటి ఎన్నో సమస్యలు తీరనున్నాయని
అన్నారు. కుటుంబ పరిపాలనఅవలంబిస్తూ, పార్టీ నాయకులకు ప్రజా ధనంజమచేయిస్తున్న తెరాస పార్టీ కి ప్రజలు ఓటు హక్కుతో తగిన బుద్ధి చెప్పాలని అన్నారు.
నేడు మునుగోడులో జరుగనున్న ఆత్మ గౌరవ సభకు ప్రతి ఒక్కరు పెద్ద ఎత్తున
తరలిరావాలని కోరారు.
Post A Comment: