మునుగోడులో ప్రజా దీవెన సభకు పని మాన్పించి తీసుకుపోయారని, తమకు కూలి డబ్బులు ఇవ్వాలని శనివారం రాత్రి చౌటుప్పల్లో బస్సులను స్థానిక అడ్డా కూలీలు అడ్డుకున్నారు. కూలి పనులు చేసుకుని పొట్ట పోసుకునే తమను స్థానిక నాయకులు సభకు తీసుకు పోయారని, తిరిగొచ్చాక డబ్బులివ్వకుండా జారుకొన్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రైవేటు కళాశాల బస్సులను కదలనీ చౌటుప్పల్లో బస్సులకు అడ్డుగా నిల్చున్న స్థానిక కూలీలు యకుండా కూర్చున్నారు. డబ్బు చెల్లించే వరకు కదలనీయ బోమని భీష్మించారు. స్థానిక అధికార పార్టీ నేత ఒకరు అక్క డికొచ్చి తాను డబ్బు ఇప్పిస్తానని భరోసా ఇచ్చి వారిని పక్కకు తప్పించి బస్సులను పంపించారు. సమాచారంతో పోలీసులు అక్కడికి చేరుకగోగా.. కూలీలు తమ సమస్యను చెప్పడంతో వారు మిన్నకుండి పోయారు.
Post A Comment: