Articles by "Telangana( తెలంగాణ )"
Showing posts with label Telangana( తెలంగాణ ). Show all posts
Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం రేలకాయలపల్లిలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. ప్రియుడి వేధింపులు, సోషల్ మీడియాలో చేసిన చిత్రాల పోస్టింగ్‌తో కుంగిపోయిన 20 ఏళ్ల సందీప్తి ఆత్మహత్యకు పాల్పడి చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందింది. వివరాల్లోకి వెళ్తే—

రేలకాయలపల్లికి చెందిన సందీప్తి, అదే గ్రామానికి చెందిన ఆర్ఎంపీ నరేశ్‌తో కొంతకాలంగా ప్రేమలో ఉన్నట్టు తెలుస్తోంది. ఈ ప్రేమ వ్యవహారం వారి ఇళ్ల వారికి తెలిసిన తర్వాత సందీప్తిని కాలేజీ మాన్పించి ఇంట్లోనే ఉంచారు. అయినప్పటికీ నరేశ్ ఆమెపై ఒత్తిడి కొనసాగించినట్టు పోలీసులు పేర్కొన్నారు. పెళ్లి చేసుకోవాలని డిమాండ్ చేస్తూ, ఇద్దరూ కలిసి ఉన్నప్పుడు దిగిన ఫోటోలను సోషల్ మీడియా, వాట్సాప్ స్టేటస్‌లలో పెట్టాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ పరిణామాలన్నింటితో కుటుంబ పరువు పోయిందని భావించిన సందీప్తి తీవ్ర మనస్తాపానికి గురై పురుగు మందు తాగింది. తక్షణమే కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినా, చికిత్స పొందుతూ చివరికి ఆమె ప్రాణాలు విడిచింది. ఈ ఘటనపై గ్రామంలో తీవ్ర కలకలం రేగగా, యువతులను లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న సోషల్ మీడియా వేధింపులపై మరొకసారి చర్చ మొదలైంది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

 

హైదరాబాద్‌: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ఫలితాలపై బీజేపీ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ మండిపడ్డారు. శుక్రవారం వెలువడిన ఫలితాల తర్వాత మీడియాతో మాట్లాడిన ఆయన, తెలంగాణ బీజేపీ రాష్ట్ర నాయకత్వంపై పేలుడు వ్యాఖ్యలు చేసి పార్టీ వర్గాల్లో సంచలనం రేపారు. ఉపఎన్నికలో బీజేపీకి డిపాజిట్ కూడా రాకపోవటం పార్టీ “పూర్తిగా వైఫల్యం” అనే మాటకు నిదర్శనమని రాజాసింగ్ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ నేతలు ఏకతాటిపైకువచ్చి తమ అభ్యర్థి విజయానికి అహర్నిశలు శ్రమిస్తుంటే, బీజేపీ నేతలు మాత్రం పార్టీ అభ్యర్థిని గెలిపించేందుకు కాదు—ఎలా ఓడించాలనే దానిపై పనిచేశారు అంటూ ఆరోపించారు. పార్టీ కీలక నేతలైన కేంద్రమంత్రులు జి.కిషన్ రెడ్డి, బండి సంజయ్, రాజ్యసభ సభ్యుడు డాక్టర్ లక్ష్మణ్ పేర్లను సూటిగా ప్రస్తావిస్తూ రాజాసింగ్ ఘాటుగా విమర్శలు గుప్పించారు. “ఇంత పెద్ద పరాభవంపై వారు సాధారణ కార్యకర్తలకు ఏమి సమాధానం చెబుతారు?” అని ప్రశ్నించారు. ప్రస్తుతం తెలంగాణ బీజేపీలో అసంతృప్తి అలలు ఎగసిపడుతున్న తరుణంలో రాజాసింగ్ వ్యాఖ్యలు మరింత చర్చనీయాంశంగా మారాయి. ఉపఎన్నిక ఫలితాలతో పార్టీ బలహీనత స్పష్టమైందని, ఇకనైనా కేంద్రం జోక్యం చేసుకుని రాష్ట్ర నాయకత్వాన్ని వెంటనే మార్చాలని డిమాండ్ చేశారు. అయన వ్యాఖ్యలతో బీజేపీ అంతర్గత రాజకీయాలు మళ్లీ ద్రవీభవించాయి. పార్టీ శ్రేణుల్లో ప్రత్యర్థి వర్గాలు మళ్లీ ముందుకు వచ్చాయి. ఉపఎన్నికల్లో పరాజయం తర్వాత బీజేపీ రాష్ట్ర యంత్రాంగాన్ని పూర్తిగా పునర్వ్యవస్థీకరించాల్సిన అవసరం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.



Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

పెద్దపల్లి.లక్షెట్టిపేట.నవంబర్.14(మేడిగడ్డటీవీన్యూస్ ఛానల్.బ్యూరోఆఫ్ తెలంగాణ)లక్షెట్టిపేట మున్సిపల్ కమిషనర్ కు కార్మికుల సమస్యలపై వినతి పత్రం అందజేసిన నాయకులు.తెలంగాణ మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మిక సంఘం ఆధ్వర్యంలో లక్షేట్టిపేట్ మున్సిపాలిటీలో పనిచేస్తున్నటువంటి మున్సిపల్ కార్మికులను అధికారులు ఆదివారాలు సెలవు ఇవ్వకుండా నెల రోజులు పని చేస్తున్న అధికారులు ఇది చట్ట విరుద్ధం ఆదివారం కార్మికులు పనిచేస్తే డబ్బులు మాస్టర్ ఇవ్వాలి లేదా సెలవు దినముగా ఉండాలి.అలా కాదని అధికారులు కార్మికులపై జులుం చెలాయిస్తూ పనిభారం మోపడం మంచి పద్ధతి కాదని తెలిపారు.దేశంలో ఎక్కడ లేనటువంటి విధానాన్ని లక్షట్పేట్ మున్సిపాలిటీలో అమలు చేస్తున్నారు కాబట్టి మంచిర్యాల జిల్లాలోని ఉన్న ఏడు మున్సిపాలిటీలలో అత్యవసరము తప్ప ఆదివారాలు మున్సిపల్ కార్మికులు విధులు నిర్వహించే విధానం ఎక్కడ లేనందున లక్ష్యపేట మున్సిపాలిటీలో కూడా ఇకనుండి ఆదివారాలు సెలవు ఇవ్వాలని.కొత్తగా ఏర్పడిన అటువంటి మున్సిపాలిటీలో జిఓ ఎంఎస్ నెంబర్ 14 ప్రకారంగా ట్రాలీ.డ్రైవర్ గా విధులు నిర్వహిస్తున్నటువంటి డ్రైవర్లకి డ్రైవర్ల వేతనాలు ఇస్తున్నారు,లక్షేట్టిపేట్ మున్సిపల్ లో కూడా ట్రాలీ మరియు ట్రాక్టర్ల డ్రైవర్లకి డ్రైవర్ వేతనాలు ఇవ్వాలని. శుక్రవారం తెలంగాణ మున్సిపల్ కాంట్రాక్టు కార్మిక సంఘం గౌరవ అధ్యక్షులు దేవి సత్యం.లక్షేట్టిపేట్ మున్సిపల్ అధ్యక్షులు ఆవునూరు లింగయ్య ఆధ్వర్యంలో లక్షట్పేట్ మున్సిపల్ కమిషనర్ కి వినతిపత్రం ఇచ్చి సమస్యలు పరిష్కరించాలని.ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు ఆవునూరి సత్తయ్య,శేఖర్,మొగిలి,కృష్ణ తదితరులు పాల్గొన్నారు....

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

 

చౌటుప్పల్  : చౌటుప్పల్ శ్రీ బాలాజీ రామకృష్ణ దేవాలయంలో అయ్యప్ప స్వామి నిత్య అన్నదానం కార్యక్రమాన్ని చౌటుప్పల్ మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ నాయకులు బత్తుల వాణి – విప్లవ్ కుమార్ గౌడ్ దంపతులు భక్తిశ్రద్ధలతో ప్రారంభించారు. ఈ సందర్భంగా విప్లవ్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ – “అయ్యప్ప స్వామి మాలదారులకు అన్నదానం చేయడం పూర్వ జన్మ సుప్రాప్తం, ఈ సేవలో భాగం కావడం మా అదృష్టం” అని అన్నారు. అయ్యప్ప స్వామి మాలదారులు, శివదీక్ష – హనుమాన్ దీక్ష మాలదారులు విప్లవ్ కుమార్ గౌడ్ కుటుంబానికి అయ్యప్ప స్వామి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని, ఆయురారోగ్యాలు – అష్ట ఐశ్వర్యాలు ప్రసాదించాలని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో అన్నదానం నిర్వాహకుడు తొర్పు నూరి నర్సింహ గౌడ్, సన్నిధానం గురుస్వామి చెరుకు అశోక్ గౌడ్, కళ్ళెం నాగరాజు గౌడ్, చెవగొని మహేష్ గౌడ్, మార్గం శేఖర్ యాదవ్, అందొజు సన్నిధ్ చారి, పోల్డాస్ రాజు, దాసరి మురళి స్వామి, బందరపు శివ గౌడ్, చెరుకు చైతన్య స్వాములు, అలాగే ఆలయ కమిటీ సభ్యులు, చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిసర ప్రాంత రాజకీయ నాయకులు, పారిశ్రామిక వేత్తలు తదితరులు పాల్గొన్నారు.


Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలం అన్నారం సరస్వతి బ్యారేజీ వద్ద లభించిన మృతదేహం గుర్తింపు లభించింది. ఈ ఘటన ప్రాంతంలో తీవ్ర విషాదాన్ని నింపింది. సమాచారం ప్రకారం, గోదావరి నదిలో స్నానానికి వెళ్లిన యువకుడు ప్రమాదవశాత్తు గల్లంతైన ఘటన మంథని పరిధిలో ఇటీవల చోటుచేసుకుంది. ఆ యువకుడే అన్నారం వద్ద లభించిన మృతదేహమని పోలీసులు నిర్ధారించారు. మృతుడు పెద్దపల్లి జిల్లా మంథని పట్టణానికి చెందిన రావికంటి సాయికృష్ణ గా గుర్తించారు. పోలీసుల సమాచారం మేరకు, సాయికృష్ణ స్నానానికి గోదావరి ప్రవాహంలోకి దిగి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. బంధువుల ఫిర్యాదు ఆధారంగా మంథని పోలీసులు గల్లంతు కేసు నమోదు చేసి గాలింపు చేపట్టారు. చివరికి ఎగువ నుంచి ప్రవాహంలో కొట్టుకుపోయిన శవం మహాదేవపూర్ మండలం అన్నారం సరస్వతి బ్యారేజీ వద్దకు చేరింది. స్థానికులు మృతదేహాన్ని గమనించి కాళేశ్వరం పోలీసులకు సమాచారం అందించగా, వారు సంఘటనా స్థలానికి చేరుకుని పత్రాలు, దుస్తుల ఆధారంగా గుర్తింపు ప్రక్రియ చేపట్టారు. అనంతరం మంథని పోలీసులు సంఘటనా స్థలానికి వచ్చి దర్యాప్తు నిర్వహించి, మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. ఈ ఘటనపై స్థానికులు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. గోదావరిలో స్నానం చేసేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులు ప్రజలకు సూచించారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రేణుకుంట బ్రిడ్జి సమీపంలో మంగళవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. తెల్లవారుజామున 5 గంటల ప్రాంతంలో వెళ్తున్న ట్రాక్టర్‌ను వెనుకనుంచి మెట్పల్లి డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఢీకొట్టిన తీవ్రతకు బస్సు ముందు భాగం దెబ్బతింది. ప్రమాద సమయంలో బస్సులో ఉన్న 15 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. వారిని స్థానికులు వెంటనే కాపాడి కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రయాణికులలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఘటన స్థలానికి పోలీసులు చేరుకుని పరిశీలించారు. ప్రమాదానికి కారణం దట్టమైన పొగమంచు లేదా డ్రైవర్ నిర్లక్ష్యమా అన్నదానిపై విచారణ కొనసాగుతోంది. ఈ ప్రమాదం వల్ల ఆ రహదారిపై కొంతసేపు ట్రాఫిక్ నిలిచిపోయింది. స్థానికులు ప్రమాదాన్ని చూసి భయాందోళనకు గురయ్యారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

భూపాలపల్లి: భూపాలపల్లి జిల్లా కేంద్రంలో జరిగిన జిల్లా సర్వసభ్య సమావేశంలో పాల్గొని  ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలపై మాట్లాడడం జరిగింది. సమస్యల పరిష్కారంలో మండల శాఖకు సహకరించిన జిల్లా అధ్యక్షులు సుభాకర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి కిరణ్ కుమార్  కృతజ్ఞతలు తెలపడం జరిగింది. ముఖ్యంగా ఈ సమావేశంలో పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలని, ఇటీవల 317 జీవోకు సంబంధించిన నోటిఫికేషన్లో బాధిత ఉపాధ్యాయుల్లో కొందరికి మాత్రమే అవకాశం , మరి కొంతమంది బాధ్యత ఉపాధ్యాయులకు అవకాశం ఇవ్వలేదు కావున ప్రతి ఒక బాధిత ఉపాధ్యాయులకు ఈ ఒక నోటిఫికేషన్ లో అప్లై చేసుకోవడానికి అవకాశం ఇచ్చేలా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని కోరడం జరిగింది.పై సమస్యను వెంటనే పరిష్కరించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని మీ ద్వారా రాష్ట్ర శాఖకు ఈ సమాచారం తెలియజేయాలని కోరడమైనది. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు, నాయకులు ఎన్. సురేషు, అసోసియేట్ మహిళ  అధ్యక్షులు బాసాని రజిత మరియు పెద్ద ఎత్తున ఉపాధ్యాయులు కార్యకర్తలు పాల్గొన్నారు.