చిన్నంబావి మండలంలోని వెలగొండ గ్రామ పంచాయతీ ఉపసర్పంచ్‌గా ఎన్నికైన రాచాల రజిత వినోద్ గౌడ్‌ను జై గౌడ్ ఉద్యమం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమం జై గౌడ్ ఉద్యమం కొల్లాపూర్ తాలూకా అధ్యక్షుడు సూరగౌని వెంకస్వామి గౌడ్ నేతృత్వంలో నిర్వహించారు. ఈ సన్మాన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జై గౌడ్ ఉద్యమం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు గుండ్రాతి నారాయణ గౌడ్, జిల్లా అధ్యక్షుడు తమటం వెంకటస్వామి గౌడ్, మహిళా విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శి సోమ శశికళ గౌడ్, రాష్ట్ర కార్యదర్శులు వేముల లచ్చ గౌడ్, సోమ భాస్కర్ గౌడ్ హాజరయ్యారు. అలాగే జై గౌడ్ ఉద్యమ నేతలు గుర్రం వరలక్ష్మి, వెంకటస్వామి గౌడ్, గుండ్రాతి సత్యం గౌడ్‌తో పాటు వెలగొండ గ్రామ గౌడ సంఘం అధ్యక్షుడు ఈశ్వరయ్య గౌడ్, కార్యదర్శి పరమేశ్వర్ గౌడ్, లక్ష్మణ్ గౌడ్, గోవింద్ గౌడ్, మోహన్ గౌడ్, బాబు గౌడ్, భాస్కర్ గౌడ్ తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ సందర్భంగా పలువురు నేతలు మాట్లాడుతూ, రాచాల రజిత వినోద్ గౌడ్ ప్రజల విశ్వాసంతో ఉపసర్పంచ్‌గా ఎన్నిక కావడం గర్వకారణమని పేర్కొన్నారు. గ్రామ అభివృద్ధికి ఆమె అంకితభావంతో పనిచేయాలని ఆకాంక్షించారు.

Post A Comment: