కాటారం: పుట్ట మధు కాంగ్రెస్ నేతలు, మాజీ మంత్రి దుద్దిళ్ల శ్రీపాదరావు, మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, దుద్దిళ్ల శ్రీనుబాబుపై అసత్య ప్రచారాలు చేయడం మానుకోవాలని కాంగ్రెస్ నాయకులు ఘాటుగా హెచ్చరించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలంలో వారు మాట్లాడుతూ.. శ్రీపాదరావు ఆశయాలకు అనుగుణంగా మంథని నియోజకవర్గంలో విద్య, వైద్యం, ఉపాధి, రవాణా తదితర రంగాల్లో అభివృద్ధికి పునాదులు వేశారని తెలిపారు. అదే బాటలో మంత్రి శ్రీధర్‌బాబు సమగ్ర గ్రామీణాభివృద్ధికి కృషి చేస్తున్నారని పేర్కొన్నారు.

2022లో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో వరదలకు శివశంకర్ ప్రాజెక్టు, పొడుపులవంచ ఊర చెరువు, గూడూరు ఊర చెరువులకు నష్టం జరిగినప్పటికీ, అప్పటి జిల్లా పరిషత్ చైర్మన్‌గా ఉన్న పుట్ట మధు వాటి పనులను పూర్తి చేయించలేదని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. చిన్న కాళేశ్వరం ప్రాజెక్టుకు వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి హయాంలో శ్రీధర్‌బాబు నిధులు మంజూరు చేయించి 80 శాతం పనులు పూర్తి చేయించారని తెలిపారు. అనంతరం బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో పుట్ట మధు ప్రాజెక్టును పట్టించుకోలేదని విమర్శించారు.

శివశంకర్ ప్రాజెక్టు, పొడుపులవంచ, గూడూరు చెరువుల పనులను త్వరలో శ్రీధర్‌బాబు ప్రారంభించనున్న నేపథ్యంలో రాజకీయ దురుద్దేశంతోనే పుట్ట మధు ఆరోపణలు చేస్తున్నారని కాంగ్రెస్ నాయకులు మండిపడ్డారు. శ్రీపాదరావు, శ్రీధర్‌బాబు వద్ద పనిచేసి రాజకీయంగా ఎదిగిన పుట్ట మధు, వారి ఆశయాలను ప్రశ్నించడం సరికాదని ఎద్దేవా చేశారు.

ఈ కార్యక్రమంలో డీసీసీ అధికార ప్రతినిధి పంతకని సమ్మయ్య, కార్యదర్శి అంగజాల అశోక్, మంథని నియోజకవర్గ యూత్ అధ్యక్షుడు చీమల సందీప్, ప్రచార కమిటీ చైర్మన్ కుంభం రమేష్‌రెడ్డి, చిదనపల్లి సర్పంచ్ బాల్నే జగదీశ్వర్‌రెడ్డి, ఏఎంసీ పిలమారా రమేష్, కడారి విక్రమ్, కొట్టే శ్రీహరి, ఆత్మకూరి కుమార్ యాదవ్, గోనె మహేష్, గజ్జెల శేఖర్, కిషోర్, మారపాక రాజేంద్రప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

Axact

ANAPARTHI SRINIVAS GOUD

CEO MEDIGADDA TV NEWS Mobile Number 9848223934 9502908070

Post A Comment: