పెద్దపల్లి:గోదావరిఖని:సెప్టెంబర్:15: సింగరేణి వ్యాప్తంగా ఉన్న వేలాది మంది కార్మికుల దశాబ్దాల కల అయిన,సొంతింటి సహకారం,పథకంపై రేపు జరగబోయే శాసనసభ (అసెంబ్లీ) సమావేశాల్లో ప్రస్తావించనున్న రామగుండం శాసనసభ్యులు మక్కాన్ సింగ్ రాజ్‌ఠాకూర్ కు సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ (సిఐటియు)రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తుమ్మల రాజారెడ్డి ప్రత్యేక అభినందనలు తెలియజేశారు.ఈ సందర్భంగా తుమ్మల రాజారెడ్డి మాట్లాడుతూ...సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్(సీఐటీయూ)గత ఐదేళ్లుగా నిరంతరాయంగా పోరాటం చేస్తున్న"సొంతింటి పథకం"ప్రతిపాదనను,తమ వినతి మేరకు ఎమ్మెల్యే ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లడం అత్యంత అభినందనీయమని కొనియాడారు.ఈ పథకం వల్ల కలిగే ప్రధాన ప్రయోజనాలు:యాజమాన్యానికి రూపాయి ఖర్చు లేదు:ప్రభుత్వం లేదా సింగరేణి యాజమాన్యంపై ఒక్క పైసా కూడా ఆర్థిక భారం పడకుండా ఈ మోడల్‌ను రూపొందించడం జరిగింది.వడ్డీ లేని రుణం క్వార్టర్లు లేని కార్మికులకు సింగరేణి నుండి వచ్చే హెచ్ఆర్ఏ అలాగే రాష్ట్ర ప్రభుత్వం అందించే వడ్డీ లేని రుణ సహాయాన్ని అనుసంధానిస్తూ కార్మికులు సులభంగా సొంత ఇల్లు నిర్మించుకునే వెసులుబాటు కలుగుతుంది.ప్రభుత్వానికి రాబడి:కార్మికులు ఇళ్లు నిర్మించుకోవడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి రిజిస్ట్రేషన్లు,విద్యుత్ శాఖ మరియు మున్సిపల్ కార్పొరేషన్ల రూపంలో గణనీయమైన రాబడి సమకూరుతుంది.కార్మికులు స్థానికంగా స్థిరనివాసం ఏర్పరచుకోవడం వల్ల సింగరేణి ప్రాంతాల నుండి వ్యాపార సంస్థలు తరలిపోకుండా,బొగ్గు గని పరిసర పట్టణాలు ఆర్థికంగా నిలదొక్కుకుని నిరంతరం అభివృద్ధి చెందుతాయి.అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీని నెరవేర్చే దిశగా సాగుతున్న ఈ ప్రయత్నం పట్ల సింగరేణి కార్మికులందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. కార్మికుల సమస్యలపై అసెంబ్లీలో గళమెత్తుతున్న ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్‌ఠాకూర్ గారికి మరియు కాంగ్రెస్ ప్రభుత్వానికి కార్మికులందరూ భవిష్యత్తులో వెన్నుదన్నుగా ఉంటారని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు – RG-2 బ్రాంచ్ సెక్రెటరీ కుంట ప్రవీణ్ కుమార్, RG-1 అధ్యక్షులు వంగల శివరాం రెడ్డి, RG-3 అధ్యక్షులు అంబాల శ్రీనివాస్, తోట నరహరిరావు, సోమారపు వెంకన్న, ఎద్దు కుమార్, SK గౌస్, శ్రీహరి, ఎడ్ల వెంకటేష్, సురేష్, వినేష్, అహ్మద్ పాషా,గుగులోత్ రామకృష్ణ,కొమ్మ రమేష్ ,జంగ సమ్మయ్య,బుద్ధర్తి సంతోష్,తుమ్మ లక్ష్మణ్, కుమారస్వామి,బుర్ర శ్రీనివాస్,పోతు నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

Post A Comment: