Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

పేద్దపల్లి :ఏడుగురు అరెస్ట్..రూ.35,200 నగదు,ఏడు మొబైల్ ఫోన్లు,52 పేకముక్కలు స్వాధీనం రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని రామగిరి పోలీస్ స్టేషన్ పరిధి నాగేపల్లి గ్రామంలో నిర్వహిస్తున్న పేకాట స్థావరంపై రామగిరి ఎస్ఐ శ్రీనివాస్ ఆధ్వర్యంలో పోలీసులు మెరుపుదాడి నిర్వహించి ఏడుగురు జూదరులను అరెస్ట్ చేశారు.వారి వద్ద నుంచి రూ.35,200 నగదు,52 పేకముక్కలు,ఏడు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.పోలీసుల కథనం ప్రకారం..నాగేపల్లి గ్రామంలోని ఓ నివాస గృహంలో నగదును పందెంగా పెట్టుకుని పేకాట నిర్వహిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం అందడంతో రామగిరి పోలీసులు ఆదివారం రాత్రి ఆకస్మికంగా దాడి నిర్వహించారు.దాడి సమయంలో పేకాట ఆడుతున్న ఏడుగురిని అదుపులోకి తీసుకుని,వారి వద్ద ఉన్న నగదు,పేకముక్కలు,మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.ఈ ఘటనపై కేసు నమోదు చేసి నిందితులను న్యాయస్థానం ఎదుట హాజరుపరచనున్నట్లు రామగిరి ఎస్ఐ శ్రీనివాస్ తెలిపారు.ఈ సందర్భంగా రామగుండం పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ,పేకాట,జూదం,మాదకద్రవ్యాల విక్రయం,అక్రమ మద్యం తయారీ,గుట్కా అక్రమ రవాణా వంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని స్పష్టం చేశారు.తమ పరిసర ప్రాంతాల్లో ఇటువంటి అక్రమ కార్యకలాపాలు జరుగుతున్నట్లు తెలిసిన వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు లేదా డయల్-100కు సమాచారం అందించాలని ప్రజలకు చేశారు.సమాచారం అందించిన వారి వివరాలను పూర్తిగా గోప్యంగా ఉంచుతామని,ప్రజల సహకారంతోనే నేరరహిత సమాజ నిర్మాణం సాధ్యమవుతుందని పోలీస్ కమిషనర్ పేర్కొన్నారు.