పెద్దపల్లి,గోదావరిఖని,మే,1: కార్మిక హక్కులను హరిస్తున్న 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలి-సిఐటియు సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్(సీఐటీయు ఆర్జి -2ఏరియా కార్యాలయంలో శుక్రవారం 140వ అంతర్జాతీయ కార్మిక దినోత్సవ వేడుకలు బానోత్ వినయ్ అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు,ఈ సందర్భంగా మేడే జెండాను ఆవిష్కరించిన ఏరియా సెక్రెటరీ కుంట ప్రవీణ్ కుమార్ మాట్లాడరు,చికాగో అమరవీరుల త్యాగాలతో సాధించుకున్న 8 గంటల పని దినానికి నేడు తీవ్ర ముప్పు పొంచి ఉందని హెచ్చరించారు.12 గంటల పని దినం,కేంద్ర ప్రభుత్వం తెచ్చిన,ఆక్యుపేషనల్ సేఫ్టీ అండ్ హెల్త్ కోడ్-2020'ద్వారా కార్మికులతో 12 గంటల వరకు పని చేయించుకునే వెసులుబాటును కల్పించడం అత్యంత దుర్మార్గమని,దీనిని తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.ప్రభుత్వ జీవోల వైఖరి తో కేవలం పెట్టుబడిదారుల లాభాల కోసం 8 గంటలకు బదులు 10 గంటల పనిని ప్రోత్సహిస్తూ రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసిన జీవో నెంబర్ 282 వంటి వాటిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు.శ్రమ దోపిడీకి పరాకాష్టగా ఇన్ఫోసిస్ నారాయణమూర్తి,ఎల్&టి సుబ్రహ్మణ్యం వంటి కార్పొరేట్ శక్తులు వారంతపు సెలవులు లేకుండా 18 గంటల వరకు పనిచేయాలని కోరడం ఆధునిక బానిసత్వానికి నిదర్శనమని మండిపడ్డారు. కార్మికులకు రక్షణ కవచాలుగా ఉన్నటువంటి 44 చట్టాలను ఈ4లేబర్ కోడ్స్ చేయడం వల్ల కార్మికులకు కనీస వేతనం,పీఎఫ్,ఈఎస్ఐ వంటి సౌకర్యాలు దూరం కావడమే కాకుండా,పర్మనెంట్ ఉద్యోగాల స్థానంలో ఎఫ్ టిఇ ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ నియామకాలతో ఉద్యోగ భద్రత కరువవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు ఉల్లి మొగలి,శ్రీహరి,మంద భూమయ్య,లక్ష్మీరాజం,వినేష్,తిరుపతి,శివకుమార్,రమేష్, శ్రావణ్,రాకేష్,లక్ష్మీనారాయణ,రాములు,రవీందర్,రాజు,ఓదేలు తదితరులు పాల్గొన్నారు.

Post A Comment: