భూపాలపల్లి పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న సాధు సంగీత ముదిరాజ్ అనే మహిళ ఇటీవల ఆత్మహత్య చేసుకోవడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అయితే, సంగీత ఆత్మహత్యకు కారణమైన వ్యక్తులను ఇప్పటివరకు అరెస్ట్ చేయకపోవడం తీవ్రంగా ఖండనీయమని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఈరోజు తెలంగాణ రాజ్యాధికార పార్టీ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు రవి పటేల్ హనుమకొండలోని సాధు సంగీత కుటుంబాన్ని వారి నివాసంలో కలిసి పరామర్శించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేసి, వారికి మనోధైర్యం చెప్పి, తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. అనంతరం రవి పటేల్ మాట్లాడుతూ— రాష్ట్రంలో ఒక మహిళ కానిస్టేబుల్‌కే రక్షణ లేకపోతే సామాన్య ప్రజల పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించాల్సిన అవసరం ఉందన్నారు. ఒక బీసీ మహిళ ప్రాణాలు కోల్పోయినా, ఇప్పటివరకు బాధ్యులపై చర్యలు తీసుకోకపోవడం పోలీస్ వ్యవస్థ వైఫల్యానికి నిదర్శనమని విమర్శించారు. ఆధునిక సాంకేతికత ఉన్నప్పటికీ నిందితులు స్వేచ్ఛగా తిరగడం ఆందోళనకరమని పేర్కొన్నారు. సాధు సంగీత ఆత్మహత్యకు కారణమైన ప్రతి ఒక్కరిని వెంటనే అరెస్ట్ చేసి, చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని, అలాగే బాధిత కుటుంబానికి ఆర్థికంగా న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ డిమాండ్లు నెరవేర్చే వరకు తెలంగాణ రాజ్యాధికార పార్టీ పోరాటం కొనసాగిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు ఇనుగాల ప్రణయ్ రాజ్, జిల్లా నాయకులు మోటపోతుల సమ్మయ్య, వైద్య లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.

Post A Comment: