కాటారం : కాటారం మండలంలోని చిదినేపల్లి గ్రామ పంచాయతీలో బుధవారం ఇందిరమ్మ గృహ నిర్మాణ పథకం కింద ఎంపికైన లబ్ధిదారులకు మంజూరు పత్రాలను గ్రామ సర్పంచ్ జగదీశ్వర్ చేతుల మీదుగా అందజేశారు. ఇందిరమ్మ కమిటీ సభ్యుల సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమంలో దుర్గం శ్రీకృష్ణ, అంబాల పోసు, మంతెన రాజశ్రీ, రంగు ఊర్మిళ, ఆకుల సత్యక్క, నగునూరి రాజేశ్వరి, బౌతు పార్వతి, దాగం స్రవంతి, మొల్లు మాధవి తదితర లబ్ధిదారులు మంజూరు పత్రాలను స్వీకరించారు. ఈ సందర్భంగా సర్పంచ్ జగదీశ్వర్ మాట్లాడుతూ, సొంత ఇల్లు లేని ప్రతి పేద కుటుంబానికి పక్కా ఇల్లు అందించాలన్నదే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ప్రత్యేక చొరవతో అర్హులైన లబ్ధిదారులకు దశలవారీగా ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తున్నట్లు చెప్పారు. మొదటి విడతలో అవకాశం రాని వారు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రభుత్వం అర్హత కలిగిన ప్రతి పేద కుటుంబానికి దశలవారీగా ఇళ్లను మంజూరు చేస్తుందని సర్పంచ్ స్పష్టం చేశారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి దేవేందర్, ఉప సర్పంచ్ రాజయ్య, వార్డు సభ్యులు, ఇందిరమ్మ కమిటీ సభ్యులు లింగయ్య, బి. రమేష్, గణేష్, ఇతర ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు, లబ్ధిదారుల కుటుంబ సభ్యులు మరియు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Post A Comment: