Articles by "జగిత్యాల జిల్లా"
Showing posts with label జగిత్యాల జిల్లా. Show all posts
Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day


జగిత్యాల: జిల్లాలోని ఎస్టీ హాస్టల్లో చోటుచేసుకున్న అమానుష ఘటన కలకలం రేపింది. హాస్టల్‌లో పనిచేస్తున్న శ్రీనివాస్ అనే సిబ్బంది పడుకున్న విద్యార్థులపై చీపురుతో దాడి చేసిన ఘటన తీవ్ర ఆగ్రహానికి దారితీసింది. బాధిత విద్యార్థుల వాంగ్మూలాల ప్రకారం, రాత్రి సమయంలో నిద్రలో ఉన్న వారిని లేపుతూ విచక్షణారహితంగా కొట్టినట్లు తెలుస్తోంది. విద్యార్థులు “మమ్మల్ని కొట్టొద్దు” అంటూ వేడుకున్నప్పటికీ అతను ఆగకుండా దాడి కొనసాగించినట్లు సమాచారం. ఈ ఘటనతో హాస్టల్‌లో భయానక వాతావరణం నెలకొంది. కొంతమంది విద్యార్థులు గాయపడినట్లు కూడా తెలిసింది. ఇక, శ్రీనివాస్ తరచూ మద్యం మత్తులో ఉండి విద్యార్థులపై దాడులకు పాల్పడుతున్నాడని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గతంలో కూడా ఇలాంటి సంఘటనలు చోటుచేసుకున్నాయని, అయితే ఎవరూ పట్టించుకోలేదని విద్యార్థులు వాపోతున్నారు. విద్యార్థుల భద్రతపై నిర్లక్ష్యం వహించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు, ప్రజాసంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు వెలుగులోకి రావాల్సి ఉంది.