Articles by "సిరోంచ ( Sironcha ) MH"
Showing posts with label సిరోంచ ( Sironcha ) MH. Show all posts
Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

మహారాష్ట్ర రాష్ట్రంలోని గడ్చిరోలి జిల్లా, సిరొంచ తాలూకా పరిధిలోని ఇంద్రానగర్ గ్రామంలో పొలాల్లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. గ్రామానికి ఆనుకుని ఉన్న వ్యవసాయ పొలాల్లో మంటలు వేగంగా వ్యాపించడంతో గ్రామస్తులు భయాందోళనకు గురయ్యారు. పొలాలు గ్రామానికి అత్యంత సమీపంలో ఉండటంతో మంటలు ఇళ్ల వరకు వ్యాపించే ప్రమాదం ఏర్పడింది. దీంతో ఇంద్రానగర్ గ్రామం ప్రమాదంలో చిక్కుకున్న పరిస్థితి నెలకొంది. అయితే గ్రామస్తులు వెంటనే అప్రమత్తమై మోటార్లు ఆన్ చేసి నీటిని మంటలపై చల్లడంతో అగ్నిని అదుపులోకి తీసుకువచ్చారు. స్థానికుల సమయస్ఫూర్తి, చాకచక్యంతో పెద్ద ప్రమాదం తప్పిందని గ్రామస్తులు తెలిపారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడం ఊరట కలిగించింది