Articles by "Muddulapalle ( మద్దులపల్లి )"
Showing posts with label Muddulapalle ( మద్దులపల్లి ). Show all posts
Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

 

జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలంలోని మద్దులపల్లి గ్రామంలో ఆదివారం పెన్షన్ దరఖాస్తుల క్షేత్రస్థాయి వెరిఫికేషన్ నిర్వహించారు. గ్రామంలో పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకున్న వారి వివరాలను అధికారులు ఇంటింటికీ వెళ్లి పరిశీలించారు.

ఎంపీడీవో రవీంద్రనాథ్, గ్రామ సర్పంచ్ సరితతో కలిసి ఆయా దరఖాస్తుదారుల ఇళ్లకు వెళ్లి వారి పరిస్థితులను, అర్హతకు సంబంధించిన వివరాలను స్వయంగా పరిశీలించారు. ముఖ్యంగా ఒంటరి మహిళలు, వితంతువులు తదితర కేటగిరీలకు చెందిన దరఖాస్తుదారుల వివరాలను క్షేత్రస్థాయిలో నమోదు చేసి పరిశీలన చేపట్టారు.

మద్దులపల్లి గ్రామం నుంచి వివిధ కేటగిరీల కింద మొత్తం 15 మంది పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. దరఖాస్తుదారులు సమర్పించిన వివరాలు, వారి అర్హత, వాస్తవ పరిస్థితులను పరిశీలించిన అనంతరం నిబంధనల ప్రకారం తదుపరి చర్యలు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు.

ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా అర్హులైన వారికి ప్రయోజనం అందేలా దరఖాస్తుల పరిశీలన పారదర్శకంగా నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. క్షేత్రస్థాయి పరిశీలనలో గ్రామపంచాయతీ కార్యదర్శి స్వాతి, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

 

మహాదేవపూర్: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలం మద్దులపల్లి గ్రామంలో ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన సకినారపు వెంకయ్య కుటుంబాన్ని గ్రామ సర్పంచ్ వేల్పుల సరిత పరామర్శించారు. మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీనుబాబు ఆదేశాల మేరకు మృతుని కుటుంబాన్ని కలిసిన ఆమె, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ సందర్భంగా కుటుంబానికి నిత్యావసర సరుకులను అందజేశారు. కష్టకాలంలో కుటుంబానికి అండగా ఉంటామని సర్పంచ్ సరిత భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ లచ్చిరెడ్డి, నాయకులు సురేందర్, బానయ్య, సమ్మయ్య, బాపు, రవి తదితరులు పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

 

మహాదేవపూర్: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలం మద్దులపల్లి ప్రాథమిక పాఠశాలలో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం విద్యారంగానికి, ఉపాధ్యాయ వృత్తికి రాధాకృష్ణన్ అందించిన సేవలను కొనియాడారు. విద్యార్థుల జీవితాల్లో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమని, క్రమశిక్షణతో చదువుకుని ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. అనంతరం ప్రభుత్వం అందిస్తున్న స్కూల్ డ్రెస్‌లు, షూస్‌ను విద్యార్థులకు పంపిణీ చేశారు. ప్రభుత్వం కల్పిస్తున్న విద్యా సౌకర్యాలను సద్వినియోగం చేసుకుని విద్యలో రాణించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సరిత, ఉపసర్పంచ్ లచ్చిరెడ్డి, ఉపాధ్యాయులు సదయ్య, పంచాయతీ కార్యదర్శి స్వాతి, పోస్టుమాన్ కళ్యాణ్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

మహాదేవపూర్: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలం మద్దులపల్లి గ్రామ కాంగ్రెస్ శాఖ అధ్యక్షుడిగా మహేందర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మండల కాంగ్రెస్ అధ్యక్షుడు కటకం అశోక్ ఆధ్వర్యంలో గ్రామ కాంగ్రెస్ శాఖ కమిటీ ఎన్నిక జరిగింది. ఈ సందర్భంగా మహేందర్‌ను గ్రామ కాంగ్రెస్ శాఖ అధ్యక్షుడిగా పార్టీ నాయకులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నూతన అధ్యక్షుడికి నాయకులు, కార్యకర్తలు శుభాకాంక్షలు తెలిపారు. గ్రామంలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేస్తూ, అందరినీ కలుపుకొని ముందుకు సాగాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో మద్దులపల్లి సర్పంచ్ సరిత, ఉపసర్పంచ్ లచ్చిరెడ్డి, సీనియర్ నాయకులు గుడాల శ్రీనివాస్, బుర్రి శివరాజ్, సాంబయ్య, శంకర్, బ్లాక్ కాంగ్రెస్ మైనారిటీ అధ్యక్షుడు అస్రార్, మండల ఎస్సీ సెల్ అధ్యక్షుడు రాజబాబు, చంద్రుపల్లి సర్పంచ్ గురుసింగ బాపు, కుదురుపల్లి సర్పంచ్ సమ్మిరెడ్డి, కోట సమ్మన్న, సురేందర్, బాపురెడ్డి, కొట్టే రవీందర్, దుర్గయ్య, బానయ్య, సడవలి తదితరులు పాల్గొన్నారు.



Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

మద్దులపల్లి, ఆగస్టు 22: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలం మద్దులపల్లి గ్రామంలో సర్ఫ్ డీఆర్‌డీఏ ద్వారా అందిన బాంబూ మొక్కలను రైతులకు పంపిణీ చేశారు. గ్రామ సర్పంచ్ సరిత ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో రైతులు పన్నాల కేతక్క, స్వరూప, రాజక్కలకు బాంబూ మొక్కలను అందజేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ సరిత మాట్లాడుతూ.. ప్రస్తుతం వర్షాలు సరిగా కురవకపోవడంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ప్రభుత్వం సబ్సిడీ కింద అందజేస్తున్న బాంబూ మొక్కలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మొక్కల పెంపకం ద్వారా భవిష్యత్తులో రైతులకు అదనపు ఆదాయం వచ్చే అవకాశం ఉందన్నారు. అలాగే వీబిజి రామ్ పథకం ద్వారా రైతులకు 15 గంటల పనికి దాదాపు రూ.15 వేల వరకు ప్రోత్సాహకం అందించడం జరుగుతుందని సర్పంచ్ సరిత తెలిపారు. ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ, అభివృద్ధి పథకాలపై రైతులు అవగాహన పెంచుకోవాలని సూచించారు. ప్రభుత్వం అందిస్తున్న పథకాలను రైతులు సద్వినియోగం చేసుకుని వ్యవసాయంతో పాటు ప్రత్యామ్నాయ ఆదాయ మార్గాలను అభివృద్ధి చేసుకోవాలని సర్పంచ్ కోరారు. గ్రామీణ ప్రాంత రైతుల ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం అందిస్తున్న సహకారాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని అన్నారు. కార్యక్రమంలో ఐకెపి సీసీ శశికాంత్, వార్డు మెంబర్ సంతోష్, వీఓఏ మొండయ్య, నాయకులు సురేందర్, సమ్మయ్యతో పాటు పలువురు పాల్గొన్నారు.