మద్దులపల్లి, ఆగస్టు 22: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలం మద్దులపల్లి గ్రామంలో సర్ఫ్ డీఆర్‌డీఏ ద్వారా అందిన బాంబూ మొక్కలను రైతులకు పంపిణీ చేశారు. గ్రామ సర్పంచ్ సరిత ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో రైతులు పన్నాల కేతక్క, స్వరూప, రాజక్కలకు బాంబూ మొక్కలను అందజేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ సరిత మాట్లాడుతూ.. ప్రస్తుతం వర్షాలు సరిగా కురవకపోవడంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ప్రభుత్వం సబ్సిడీ కింద అందజేస్తున్న బాంబూ మొక్కలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మొక్కల పెంపకం ద్వారా భవిష్యత్తులో రైతులకు అదనపు ఆదాయం వచ్చే అవకాశం ఉందన్నారు. అలాగే వీబిజి రామ్ పథకం ద్వారా రైతులకు 15 గంటల పనికి దాదాపు రూ.15 వేల వరకు ప్రోత్సాహకం అందించడం జరుగుతుందని సర్పంచ్ సరిత తెలిపారు. ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ, అభివృద్ధి పథకాలపై రైతులు అవగాహన పెంచుకోవాలని సూచించారు. ప్రభుత్వం అందిస్తున్న పథకాలను రైతులు సద్వినియోగం చేసుకుని వ్యవసాయంతో పాటు ప్రత్యామ్నాయ ఆదాయ మార్గాలను అభివృద్ధి చేసుకోవాలని సర్పంచ్ కోరారు. గ్రామీణ ప్రాంత రైతుల ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం అందిస్తున్న సహకారాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని అన్నారు. కార్యక్రమంలో ఐకెపి సీసీ శశికాంత్, వార్డు మెంబర్ సంతోష్, వీఓఏ మొండయ్య, నాయకులు సురేందర్, సమ్మయ్యతో పాటు పలువురు పాల్గొన్నారు.

Post A Comment: