జాదరావుపేట, ఆగస్టు 21: జాదరావుపేట గ్రామపంచాయతీలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం శుక్రవారం ప్రారంభమైంది. రేషన్ డీలర్ కటుక సతీష్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో సర్పంచ్ బండి సువర్ణ–రమేష్, ఉప సర్పంచ్ కోట అశోక్ లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను అందజేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీని స్వాగతిస్తున్నామని, డిజిటలైజేషన్‌లో భాగంగా ప్రజలు సకాలంలో కార్డులు పొందాలని సూచించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలుకు ప్రజలు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో తాజా, మాజీ ఎంపీటీసీ సభ్యులు పోట్ల బక్కమ్మ–ఎల్లయ్య, పోట్ల పోషయ్య, ఎండీ అజారుద్దీన్, కోట రమేష్, బండి శ్రీధర్‌తో పాటు లబ్ధిదారులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

Post A Comment: