భూపాలపల్లి: జర్నలిస్ట్ పుల్ల రవీందర్‌పై ఆదివారం రాత్రి జరిగిన దాడిని తెలంగాణ రాజ్యాధికార పార్టీ జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు రవి పటేల్ తీవ్రంగా ఖండించారు. దాడిలో గాయపడి భూపాలపల్లి 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రవీందర్‌ను పరామర్శించి, ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రవి పటేల్ మాట్లాడుతూ.. జర్నలిస్టుపై దాడి చేయడం అత్యంత దురదృష్టకరమని, ఈ ఘటనను తమ పార్టీ తీవ్రంగా ఖండిస్తుందని అన్నారు. గతంలో చిట్యాల మండలంలో బీసీ యువకుడిపై దాడి జరిగినప్పుడు బాధితుడికి అండగా నిలిచి న్యాయం కోసం పోరాడామని, ప్రస్తుతం దళిత జర్నలిస్టుపై జరిగిన దాడిని కూడా అదే విధంగా ఖండిస్తున్నామని తెలిపారు. కులం, వర్గం, రాజకీయాలకు అతీతంగా బాధితులకు అండగా నిలబడి న్యాయం కోసం పోరాడటమే తమ పార్టీ విధానమని స్పష్టం చేశారు. జర్నలిజం ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభమని, వాస్తవాలను ప్రజల ముందుకు తీసుకువచ్చే జర్నలిస్టులపై భౌతిక దాడులు చేయడం ప్రజల సమాచార హక్కుపై, ప్రజాస్వామ్య విలువలపై దాడి చేయడమేనని పేర్కొన్నారు. ఈ ఘటనపై పోలీసులు ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లకు తావులేకుండా నిష్పక్షపాతంగా, సమగ్రంగా దర్యాప్తు చేపట్టాలని రవి పటేల్ డిమాండ్ చేశారు. దాడికి పాల్పడిన వారిని వెంటనే అరెస్ట్ చేసి చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా జర్నలిస్టులకు భద్రత కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. పత్రికా స్వేచ్ఛ, జర్నలిస్టుల భద్రతను కాపాడటం ప్రజాస్వామ్య పరిరక్షణలో భాగమని పేర్కొంటూ.. జర్నలిస్ట్ పుల్ల రవీందర్‌కు తెలంగాణ రాజ్యాధికార పార్టీ సంపూర్ణ సంఘీభావం ప్రకటిస్తుందని రవి పటేల్ తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఆర్పీ జిల్లా వ్యవసాయ శాఖ విభాగం అధ్యక్షుడు పింగిడి శంకరయ్య, శ్రీకాంత్, ప్రణీత్ తదితరులు పాల్గొన్నారు.
Home
జయశంకర్ భూపాలపల్లి జిల్లా
జర్నలిస్ట్‌పై దాడిని తీవ్రంగా ఖండించిన టీఆర్పీ జిల్లా అధ్యక్షుడు రవి పటేల్.

Post A Comment: