కాటారం, ఆగస్టు 16: ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని, వాటిని త్వరితగతిన పరిష్కరించేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మండల స్థాయిలో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించనుంది. రాష్ట్ర, జిల్లా, డివిజనల్ స్థాయిలో నిర్వహిస్తున్న ప్రజావాణితో పాటు ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి సోమవారం మండల స్థాయి ప్రజావాణి కార్యక్రమం నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా రేపు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు కాటారం ఎంపీడీవో కార్యాలయంలో మండల స్థాయి ప్రజావాణి కార్యక్రమం జరగనుంది..ఈ కార్యక్రమంలో మండల స్థాయి అధికారులు పాల్గొని ప్రజల నుంచి వివిధ సమస్యలపై దరఖాస్తులు స్వీకరించనున్నారు. ప్రజలు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం కోసం వినతిపత్రాలు సమర్పించవచ్చు. కాటారం మండల పరిధిలోని ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం నిర్ణీత సమయంలో ఎంపీడీవో కార్యాలయానికి హాజరై ప్రజావాణి కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు కోరారు. మండల స్థాయిలోనే ప్రజల సమస్యలను తెలుసుకుని, సంబంధిత శాఖల అధికారుల సమన్వయంతో పరిష్కరించేందుకు ఈ కార్యక్రమం ఉపయోగపడుతుందని తెలిపారు. నోడల్ అధికారి అడ్డూరి బాబు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకురావాలని కోరారు.

Next
This is the most recent post.
Previous
Older Post
Axact

ANAPARTHI SRINIVAS GOUD

CEO MEDIGADDA TV NEWS Mobile Number 9848223934 9502908070

Post A Comment: