కాటారం అక్టోబర్ 2 మేడిగడ్డ టీవీ న్యూస్ : జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం చిదినేపల్లి గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో జాతిపిత మహాత్మా గాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. గాంధీ జయంతిని పురస్కరించుకుని గ్రామపంచాయతీ కార్యాలయ ఆవరణలో ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

అనంతరం గ్రామపంచాయతీ పరిధిలో గ్రామసభ నిర్వహించారు. గ్రామ అభివృద్ధి, ప్రజలకు అందుతున్న మౌలిక వసతులు, పారిశుద్ధ్యం తదితర అంశాలపై గ్రామసభలో చర్చించారు. గ్రామంలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులు, ప్రజల అవసరాలను గుర్తించి వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాల్సిన అంశాలపై చర్చ జరిగినట్లు తెలిపారు.

గ్రామపంచాయతీ అభివృద్ధిలో భాగస్వాములుగా పనిచేస్తున్న సిబ్బందిని ఈ సందర్భంగా ఘనంగా సన్మానించారు. గ్రామ ప్రజలకు అందిస్తున్న సేవలను గుర్తించి సిబ్బందిని అభినందించారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో చిదినేపల్లి గ్రామపంచాయతీ సర్పంచ్ జగదీశ్వర్ రెడ్డి, ఉపసర్పంచ్ రాజయ్య, పంచాయతీ కార్యదర్శి దేవేందర్, గ్రామపంచాయతీ సిబ్బంది, గ్రామస్తులు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. గ్రామసభలో గ్రామస్తులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Axact

ANAPARTHI SRINIVAS GOUD

CEO MEDIGADDA TV NEWS Mobile Number 9848223934 9502908070

Post A Comment: