ప్రతాపగిరి అక్టోబర్ 2 మేడిగడ్డ టీవీ న్యూస్ : జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం ప్రతాపగిరి గ్రామపంచాయతీ పరిధిలో సామాజిక గ్రామసభ, సాధారణ గ్రామసభతో పాటు గాంధీ జయంతి వేడుకలను శుక్రవారం నిర్వహించారు. స్థానిక గ్రామపంచాయతీ సర్పంచ్ ఊర వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలను నిర్వహించారు.

ముందుగా జాతిపిత మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. గాంధీజీ చూపిన సత్యం, అహింస, గ్రామ స్వరాజ్య స్ఫూర్తితో గ్రామాల అభివృద్ధికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఈ సందర్భంగా పలువురు పేర్కొన్నారు.

అనంతరం గ్రామపంచాయతీ కార్యాలయ ఆవరణలో సామాజిక గ్రామసభ, సాధారణ గ్రామసభ నిర్వహించి గ్రామానికి సంబంధించిన పలు అభివృద్ధి అంశాలపై చర్చించారు. గ్రామపంచాయతీ పరిధిలోని విలేజ్ మ్యాప్, వేసిరూట్ మ్యాప్‌లపై సర్పంచ్ ఊర వెంకటేశ్వరరావు గ్రామ ప్రజలకు అవగాహన కల్పించారు. గ్రామంలో ఉన్న వనరులు, ప్రజలకు అవసరమైన సౌకర్యాలు, భవిష్యత్‌లో చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై వివరించారు.

గ్రామసభలో ప్రజల అవసరాలను గుర్తించి పలు నూతన అభివృద్ధి పనులను చేపట్టేందుకు ప్రతిపాదనలు చేశారు. ముఖ్యంగా గ్రామ ప్రజలకు రాకపోకలు, సౌకర్యాలు మెరుగుపడేలా అవసరమైన మౌలిక వసతుల కల్పనపై చర్చించారు. ప్రజల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని ఆయా పనులను ప్రాధాన్యత క్రమంలో చేపట్టేందుకు తీర్మానాలు చేశారు.

అలాగే గొంతెమ్మ సమీపంలోని బేతాళస్వామి దేవాలయం ప్రాంతంలో కల్వర్టు నిర్మాణం చేపట్టాల్సిన అవసరాన్ని గ్రామసభలో చర్చించారు. వర్షాకాలంలో ప్రజలు, వాహనదారులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని అక్కడ కల్వర్టు నిర్మాణంతో పాటు ప్రాంత అభివృద్ధికి అవసరమైన చర్యలు చేపట్టాలని గ్రామసభలో తీర్మానం చేశారు.

గ్రామంలో ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలను గుర్తించి వాటి పరిష్కారానికి గ్రామసభల ద్వారా ప్రాధాన్యత ఇవ్వాలని సర్పంచ్ తెలిపారు. గ్రామ అభివృద్ధిలో ప్రజల భాగస్వామ్యం కీలకమని, గ్రామస్తులు తమ సమస్యలను గ్రామసభలో అధికారుల దృష్టికి తీసుకువచ్చి పరిష్కారానికి సహకరించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో టెక్నికల్ అసిస్టెంట్ రవి, పంచాయతీ కార్యదర్శి శంకరయ్య, ఫీల్డ్ అసిస్టెంట్ బందెల స్వామి, కారోబార్ మెండ మల్లేష్, డీలర్ సురేందర్, గ్రామపంచాయతీ సిబ్బంది, గ్రామ ప్రజలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.

Axact

ANAPARTHI SRINIVAS GOUD

CEO MEDIGADDA TV NEWS Mobile Number 9848223934 9502908070

Post A Comment: