కాటారం, అక్టోబర్ 1 మేడిగడ్డ టీవీ న్యూస్ : జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం టీజీఎన్‌పీడీసీఎల్ డివిజన్ కార్యాలయంలో పీఎం సూర్య ఘర్: ముఫ్త్ బిజ్లీ యోజనపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు మూడు రోజుల ‘సేవా సేతు’ అవగాహన శిబిరాన్ని గురువారం నిర్వహించారు. అక్టోబర్ 1 నుంచి 3వ తేదీ వరకు కొనసాగనున్న ఈ కార్యక్రమాన్ని డీఈఈ డి. నాగరాజు ఆధ్వర్యంలో నిర్వహించారు.

ఈ సందర్భంగా రూఫ్‌టాప్ సోలార్ వ్యవస్థల ఏర్పాటు, కేంద్ర ప్రభుత్వం అందించే ఆర్థిక సహాయం, విద్యుత్ బిల్లుల తగ్గింపు, నెట్ మీటరింగ్ విధానం తదితర అంశాలపై విద్యుత్ వినియోగదారులకు అధికారులు అవగాహన కల్పించారు. ఇంటి పైకప్పులపై సౌర విద్యుత్ వ్యవస్థలను ఏర్పాటు చేసుకోవడం ద్వారా విద్యుత్ అవసరాలను కొంతవరకు సొంతంగా తీర్చుకోవడంతో పాటు విద్యుత్ ఖర్చులను తగ్గించుకునే అవకాశాలపై వివరించారు.

కార్యక్రమంలో కాటారం ఏఈడీ బి. రమేష్‌తో పాటు వివిధ బ్యాంకులకు చెందిన సిబ్బంది పాల్గొన్నారు. రూఫ్‌టాప్ సోలార్ ఏర్పాటు విధానం, బ్యాంకుల ద్వారా లభించే రుణ సౌకర్యాలు, కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సహాయం, పథకం అమలు ప్రక్రియకు సంబంధించిన వివరాలను విద్యుత్ వినియోగదారులు, మీడియా ప్రతినిధులకు వివరించారు.

గృహ విద్యుత్ వినియోగదారులు, రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్లు, వెల్ఫేర్ అసోసియేషన్లు, ఆసక్తి ఉన్న ప్రజలు అక్టోబర్ 1, 2, 3 తేదీల్లో నిర్వహించే ఈ అవగాహన శిబిరానికి హాజరై పీఎం సూర్య ఘర్ పథకం ప్రయోజనాలను తెలుసుకుని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.



Next
This is the most recent post.
Previous
Older Post
Axact

ANAPARTHI SRINIVAS GOUD

CEO MEDIGADDA TV NEWS Mobile Number 9848223934 9502908070

Post A Comment: