మహాదేవపూర్: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలం మద్దులపల్లి గ్రామంలో ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన సకినారపు వెంకయ్య కుటుంబాన్ని గ్రామ సర్పంచ్ వేల్పుల సరిత పరామర్శించారు. మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీనుబాబు ఆదేశాల మేరకు మృతుని కుటుంబాన్ని కలిసిన ఆమె, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ సందర్భంగా కుటుంబానికి నిత్యావసర సరుకులను అందజేశారు. కష్టకాలంలో కుటుంబానికి అండగా ఉంటామని సర్పంచ్ సరిత భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ లచ్చిరెడ్డి, నాయకులు సురేందర్, బానయ్య, సమ్మయ్య, బాపు, రవి తదితరులు పాల్గొన్నారు.

Post A Comment: