జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలంలోని మద్దులపల్లి గ్రామంలో ఆదివారం పెన్షన్ దరఖాస్తుల క్షేత్రస్థాయి వెరిఫికేషన్ నిర్వహించారు. గ్రామంలో పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకున్న వారి వివరాలను అధికారులు ఇంటింటికీ వెళ్లి పరిశీలించారు.
ఎంపీడీవో రవీంద్రనాథ్, గ్రామ సర్పంచ్ సరితతో కలిసి ఆయా దరఖాస్తుదారుల ఇళ్లకు వెళ్లి వారి పరిస్థితులను, అర్హతకు సంబంధించిన వివరాలను స్వయంగా పరిశీలించారు. ముఖ్యంగా ఒంటరి మహిళలు, వితంతువులు తదితర కేటగిరీలకు చెందిన దరఖాస్తుదారుల వివరాలను క్షేత్రస్థాయిలో నమోదు చేసి పరిశీలన చేపట్టారు.
మద్దులపల్లి గ్రామం నుంచి వివిధ కేటగిరీల కింద మొత్తం 15 మంది పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. దరఖాస్తుదారులు సమర్పించిన వివరాలు, వారి అర్హత, వాస్తవ పరిస్థితులను పరిశీలించిన అనంతరం నిబంధనల ప్రకారం తదుపరి చర్యలు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు.
ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా అర్హులైన వారికి ప్రయోజనం అందేలా దరఖాస్తుల పరిశీలన పారదర్శకంగా నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. క్షేత్రస్థాయి పరిశీలనలో గ్రామపంచాయతీ కార్యదర్శి స్వాతి, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Post A Comment: