జయశంకర్ భూపాలపల్లి జిల్లా: స్వాతంత్య్ర పోరాటం, నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేక ఉద్యమం, ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమాల్లో కీలక పాత్ర పోషించిన ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ మూడు తరాల ఉద్యమ నేతగా చిరస్మరణీయులని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. ఆదివారం కొండా లక్ష్మణ్ బాపూజీ 111వ జయంతి వేడుకలను బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఐడీఓసీలో ఘనంగా నిర్వహించారు.

తొలుత మంజూరునగర్‌లోని కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావుతో పాటు ప్రజాప్రతినిధులు, అధికారులు, బీసీ సంఘాల నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. బాపూజీ నిజాయితీ, నిస్వార్థతకు ప్రతీకగా నిలిచారని అన్నారు. ఐదుసార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా ప్రజలకు విశేష సేవలందించారని తెలిపారు.

ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం మంత్రి పదవికి రాజీనామా చేసి ఉద్యమంలో పాల్గొనడం ఆయన నిబద్ధతకు నిదర్శనమన్నారు. తెలంగాణ కోసం ఢిల్లీలో ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన మహనీయుడని కొనియాడారు. బాపూజీ ఆశయాలు, సిద్ధాంతాలను నేటి తరం ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. తెలంగాణ ఆత్మగౌరవ పోరాటంలో ఆయన చేసిన సేవలు, త్యాగాలు తరతరాలకు స్ఫూర్తినిస్తాయని అన్నారు.

ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ అధికారి ఇ. ఇందిర, ఆర్డీఓ హరికృష్ణ, మున్సిపల్ చైర్మన్ బుర్ర కొమురయ్య, వైస్ చైర్మన్ అంబాల శ్రీనివాస్, కౌన్సిలర్ అప్పం కిషన్, పద్మశాలి సంఘం జిల్లా అధ్యక్షుడు క్యాతం సతీష్, ఎలగొండ రాజేంద్ర ప్రసాద్, సత్యనారాయణ, గూట్ల తిరుపతి, కృష్ణమోహన్, అడ్డగట్ల శ్రీధర్, భాగవతం భిక్షపతి, కూచన కిషన్ ప్రసాద్, గొనె భాస్కర్, శేఖర్, పాశికంటి శ్రీనివాస్, షేరు కుమారస్వామి, గుండా వీరస్వామి, సుజాత, ప్రభాకర్, శ్రీధర్‌తో పాటు వివిధ బీసీ సంఘాల ప్రతినిధులు, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ బీసీ సంక్షేమ శాఖ అధికారి ఇ. ఇందిర కృతజ్ఞతలు తెలిపారు.

Axact

ANAPARTHI SRINIVAS GOUD

CEO MEDIGADDA TV NEWS Mobile Number 9848223934 9502908070

Post A Comment: