కాటారం, అక్టోబర్ 4 మేడిగడ్డ టీవీ న్యూస్ : జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం ప్రతాపగిరి గ్రామపంచాయతీ పరిధిలోని గొంతెమ్మ గుట్ట వద్ద కొలువుదీరిన శ్రీ బేతాళ స్వామివారిని స్థానిక సర్పంచ్ వూర వెంకటేశ్వరావు ఆదివారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయానికి చేరుకున్న సర్పంచ్‌కు ఆలయ పూజారి మల్లికార్జున స్వామి ఆధ్వర్యంలో స్వామివారి దర్శనం కల్పించారు. అనంతరం శ్రీ బేతాళ స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, భక్తిశ్రద్ధలతో మొక్కులు చెల్లించుకున్నారు. స్వామివారి సన్నిధిలో కొంతసేపు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. గ్రామ ప్రజలు, గ్రామపంచాయతీ అభివృద్ధి, ప్రజల సుఖసంతోషాల కోసం స్వామివారిని వేడుకున్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ వూర వెంకటేశ్వరావు మాట్లాడుతూ.. శ్రీ బేతాళ స్వామి భక్తుల కొంగుబంగారమని, స్వామివారిని భక్తిశ్రద్ధలతో కొలిచే వారికి కోరిన కోరికలు నెరవేరుతాయని విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రతాపగిరి గ్రామపంచాయతీ ప్రజలందరిపై శ్రీ బేతాళ స్వామివారి కృపాకటాక్షాలు ఎల్లవేళలా ఉండాలని ఆకాంక్షించారు. గ్రామంలోని ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో జీవించాలని కోరుకున్నట్లు తెలిపారు. అలాగే రైతులకు పాడిపంటలు సమృద్ధిగా పండాలని, గ్రామంలో పశుసంపద వృద్ధి చెందాలని, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సంతోషకరమైన వాతావరణం నెలకొనాలని స్వామివారిని ప్రార్థించినట్లు పేర్కొన్నారు. ప్రతాపగిరి గ్రామానికి శ్రీ బేతాళ స్వామివారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని, గ్రామ ప్రజల ఐక్యత, అభివృద్ధి మరింత ముందుకు సాగాలని సర్పంచ్ ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఆలయ పూజారి మల్లికార్జున స్వామి, మాజీ సర్పంచ్ క్రాంతికుమార్, వెంకటయ్య, స్థానిక నాయకులు, గ్రామ పెద్దలు, భక్తులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

Post A Comment: