భూపాలపల్లి అక్టోబర్ 3 మేడిగడ్డ టీవీ న్యూస్ : తెలంగాణ ప్రభుత్వం ఎంతో ఆర్భాటంగా ప్రవేశపెట్టిన ఇందిరమ్మ ఇండ్ల పథకంలో స్లాబ్ విస్తీర్ణ పరిమితి జీవో 352 (G.O.Ms.No.352) తెచ్చి నిరుపేద లబ్ధిదారులను ఇబ్బందులకు గురిచేయడం ఎంతవరకు సమంజసమని కుల సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ (JAC) జిల్లా చైర్మన్ పీక కిరణ్ ప్రశ్నించారు? శ్లాబ్ ఏరియా 750 చదరపు అడుగులు దాటితే బిల్లులు నిలిపివేస్తామని అధికారులు నోటీసులు ఇవ్వడంపై నిరుపేదలు ఆందోళన చెందుతున్న నేపథ్యంలో, తక్షణమే ఈ నిబంధనలను ఎత్తివేయాలని కోరుతూ జయశంకర్ భూపాలపల్లి జిల్లా హౌసింగ్ డిపార్ట్‌మెంట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ గారికి వినతిపత్రం అందజేశారు.
ఉమ్మడి కుటుంబాలకు తీరని అన్యాయం?
గ్రామీణ ప్రాంతాల్లో అత్యధికంగా ఉమ్మడి కుటుంబాలే నివసిస్తున్నందున, 400 నుండి 600 చదరపు అడుగుల ప్లింత్ ఏరియాలో స్లాబ్ పరిమాణాన్ని కుదించడం వల్ల కుటుంబ సభ్యులకు ఉండటానికి సరైన స్థలం లభించక అవస్థలు పడుతున్నారనే విషయాన్ని అధికారులు గుర్తించలేదా? ప్రభుత్వం ఇచ్చే ₹5 లక్షల సహాయానికి లబ్ధిదారులు తమ పొదుపు సొమ్మును లేదా అప్పులను తోడు చేసి బాల్కనీలు, మెట్ల వైపు అదనంగా నిర్మాణాలు చేపడితే, ఇప్పుడు ఉన్నపళంగా బిల్లులు ఆపేస్తామని అనడం లబ్ధిదారులను మోసం చేయడమేనా? అని అన్నారు.
కాంట్రాక్టర్లు పనులు నిలిపివేసి పారిపోతున్నారా?
ఇళ్లు ముగ్గు పోసే సమయంలో శ్లాబ్ విస్తీర్ణంపై ఎలాంటి ఆంక్షలు లేకపోవడంతో, సంవత్సరం క్రితం కాంట్రాక్టర్లతో కుదుర్చుకున్న ఒప్పందాల ప్రకారం పనులు జరిగాయా? అయితే ఇప్పుడు ప్రభుత్వం తెచ్చిన నిబంధనల వల్ల అదనపు వ్యయం అవుతుందని చెప్తూ కాంట్రాక్టర్లు పనులను మధ్యలోనే నిలిపివేసి చేతులెత్తేస్తున్నారు? దీనివల్ల అర్ధాంతరంగా ఆగిపోయిన ఇళ్లను చూసి నిరుపేదలు తీవ్ర ఆర్థిక శోకంలో మునిగిపోతున్నారు? అని అన్నారు.
ప్రభుత్వం తక్షణమే నిబంధనలు ఎత్తివేయాలి?
జిల్లా హౌసింగ్ ప్రాజెక్ట్ డైరెక్టర్ (PD) క్షేత్రస్థాయి పరిశీలన జరిపి, ఉమ్మడి కుటుంబాల నిరుపేదల పరిస్థితులను మానవీయ కోణంలో ఆలోచించారా? జి.ఓ. 352లోని కఠిన ఆంక్షలను సడలించాలని, లేదా తక్షణమే ఎత్తివేసేలా ఉన్నతాధికారులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి లబ్ధిదారులకు న్యాయం చేయాలని కుల సంఘాల జేఏసీ జిల్లా చైర్మన్ పీక కిరణ్ డిమాండ్ చేశారు నిలిపివేసిన బిల్లులను వెంట వెంటనే విడుదల చేసి, పేదల సొంతింటి కలను నెరవేర్చాలని వారు సవినయంగా పీక కిరణ్ విజ్ఞప్తి చేశారరు. ఈ కార్యక్రమంలో జేఏసీ కో కన్వీనర్ రామగిరి రాజు పుల్యాల సురేష్ తదితరులు పాల్గొన్నారు.

Post A Comment: