భూపాలపల్లి: ఆర్టీసీ కార్మికుల హక్కులు, ఉద్యోగ భద్రత, సంక్షేమం కోసం బహుజన వర్కర్స్ యూనియన్ (BWU) నిరంతరం పోరాడుతుందని తెలంగాణ రాజ్యాధికార పార్టీ (TRP) భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు రవి పటేల్ అన్నారు. ఆదివారం భూపాలపల్లి ఆర్టీసీ డిపోలో BWU–TRP సంయుక్తంగా చేపట్టిన ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు, టెక్నీషియన్లు, ఇతర సిబ్బందిని కలిసి కత్తెర గుర్తుపై ఓటు వేసి BWU–TRP అభ్యర్థులను గెలిపించాలని కోరారు. కరపత్రాలను పంపిణీ చేస్తూ యూనియన్ మేనిఫెస్టోలోని ప్రధాన అంశాలను కార్మికులకు వివరించారు. రవి పటేల్ మాట్లాడుతూ.. కార్మికుల ఉద్యోగ భద్రత, గౌరవం, సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు. ‘రిమూవల్’ అనే పదాన్ని ఆర్టీసీ నుంచి శాశ్వతంగా తొలగించేలా కృషి చేస్తామని, డ్రైవర్లు, కండక్టర్ల ప్రమోషన్లలో వన్ ప్లస్ వన్ విధానాన్ని తీసుకురావడానికి ప్రయత్నిస్తామని చెప్పారు. BWU–TRP గెలిచిన ఆరు నెలల్లో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడానికి కృషి చేస్తామని స్పష్టం చేశారు. అలాగే కార్మికులపై ఎలాంటి ఆర్థిక భారం లేకుండా రూ.5 లక్షల ఇన్సూరెన్స్ పాలసీ కల్పిస్తామని హామీ ఇచ్చారు. మేనిఫెస్టోలో ప్రకటించిన హామీలను కార్మికుల ప్రయోజనాల కోసం అమలు చేయడానికి కట్టుబడి ఉంటామని అన్నారు. భూపాలపల్లి ఆర్టీసీ కార్మికులు గతంలో సమ్మె చేపట్టిన సమయంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ వారి సమస్యలకు మద్దతుగా మూడు రోజుల పాటు కార్మికులతో కలిసి రోడ్డుపై కూర్చొని పోరాటం చేసిందని రవి పటేల్ గుర్తుచేశారు. TRP వ్యవస్థాపక అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న శాసనమండలిలో ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగులు, ప్రస్తుత కార్మికుల సమస్యలను ప్రస్తావిస్తూ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారని తెలిపారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు చెందిన ఆర్టీసీ ఉద్యోగుల భవిష్యత్తు, ఉద్యోగ భద్రత, సంక్షేమం కోసం BWU–TRP అండగా ఉంటుందని రవి పటేల్ భరోసా ఇచ్చారు. కార్మికుల సమస్యల పరిష్కారం కోసం పోరాడుతున్న బహుజన వర్కర్స్ యూనియన్‌కు మద్దతుగా కత్తెర గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా నాయకులు ఇనుగల ప్రణయ్ రాజ్, సామల చంద్రశేఖర్, కుమార్, అరవింద్, సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు.

Axact

ANAPARTHI SRINIVAS GOUD

CEO MEDIGADDA TV NEWS Mobile Number 9848223934 9502908070

Post A Comment: