పెద్దపల్లి,గోదావరిఖనిలో,ఆగస్టు,7: తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణాలకు తెగించి పోరాడిన ఉద్యమకారులను ప్రభుత్వం విస్మరించడం బాధాకరమని,రాష్ట్ర ప్రభుత్వం ఉద్యమకారులకు ఎన్నికల సమయంలో,రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఇచ్చిన హామీలను ఇకపై జాప్యం లేకుండా వెంటనే అమలు చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఉద్యమకారుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరిని వీడి, వారికి న్యాయం చేయాలని స్పష్టం చేశారు. గురువారం గోదావరిఖనిలో తెలంగాణ ఉద్యమకారుల సమితి కార్యాలయంలో నిర్వహించిన తెలంగాణ ఉద్యమకారుల సమితి గోదావరిఖని ఆఫీసులో రాష్ట్ర మహిళా కమిటీ జిల్లా మహిళా కమిటీ ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది రాష్ట్ర అధ్యక్షురాలుగా అనుముల కళావతి రాష్ట్ర కార్యదర్శిగా తోడేటి స్వరూప రాష్ట్ర ఉపాధ్యక్షురాలుగా కోడిపుంజుల జ్యోతి రాష్ట్ర ఉపాధ్యక్షురాలు గా గంగారపు శాంతలక్ష్మి ఎన్నుకోవడం జరిగింది మేకల సరోజన జిల్లా ఉపాధ్యక్షురాలుగా పున్నం మంజుల జిల్లా కార్యదర్శిగా సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించిన వేలాది మంది ఉద్యమకారులు ఇప్పటికీ తమ హక్కులు,సంక్షేమ పథకాల కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొనడం విచారకరమని అన్నారు.ఉద్యమకారులకు ఇచ్చిన ప్రతి హామీని ప్రభుత్వం అమలు చేయడం నైతిక బాధ్యత అని పేర్కొన్నారు.హామీల అమలులో ప్రభుత్వం మరింత ఆలస్యం చేస్తే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామని తోడేటి శంకర్ గౌడ్ తెలిపాడు,ఉద్యమకారులంతా పార్టీలు,వ్యక్తిగత భేదాభిప్రాయాలకు అతీతంగా ఐక్యంగా నిలిచి తమ హక్కుల సాధన కోసం పోరాటాన్ని మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు.ఉద్యమకారుల గౌరవాన్ని కాపాడడం,వారి సంక్షేమాన్ని నిర్ధారించడం ప్రభుత్వ ప్రాథమిక బాధ్యత అనిఆయన పేర్కొన్నారు.సమావేశంలో ఎన్టీపీసీ పట్టణ కమిటీ బలోపేతం,సభ్యత్వ నమోదు,ఉద్యమకారుల సమస్యలపై భవిష్యత్ కార్యాచరణ,రాష్ట్రవ్యాప్తంగా చేపట్టాల్సిన ఆందోళన కార్యక్రమాలపై విస్తృతంగా చర్చించారు.కమిటీని మరింత పటిష్టం చేసి ఉద్యమకారుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు కార్యాచరణ రూపొందించారు,ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమకారుల సమితి నగునూరి రాజయ్య గౌడ్ చీఫ్ అడ్వైజర్,జనరల్ సెక్రటరీ చిలుక శంకర్,రాష్ట్ర ఉపాధ్యక్షులు ఈదునూరి పర్వతాలు,ఎరుకల పోసక్క ఈదునూరి పద్మ,జున్ను రమాదేవి,గంగారపు శాంత లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Axact

ANAPARTHI SRINIVAS GOUD

CEO MEDIGADDA TV NEWS Mobile Number 9848223934 9502908070

Post A Comment: