భూపాలపల్లి జిల్లా, మహదేవపూర్: మండలంలోని బొమ్మాపూర్ గ్రామానికి చెందిన శనిగరం శ్రీకాంత్ (27) అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందిన ఘటన ఆదివారం వెలుగులోకి వచ్చింది. రెండు రోజులుగా కనిపించకుండా పోయిన శ్రీకాంత్ శవం ఎలికేశ్వరం గ్రామ శివారులో లభ్యమైంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు, ఇది హత్యా, ఆత్మహత్యా లేక ఇతర కారణమా అన్న కోణాల్లో విచారణ కొనసాగిస్తున్నారు.

Post A Comment: