కాటారం: జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం సబ్ కలెక్టర్ సౌరవ్ శర్మను కాటారం, మల్హర్, పలిమెల, మహముత్తారం మండలాల ఎంపీడీవోలు శుక్రవారం సబ్ కలెక్టర్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్‌కు పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.
అనంతరం ఆయా మండలాల్లో కొనసాగుతున్న అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాల అమలు, పంచాయతీరాజ్ శాఖ ద్వారా ప్రజలకు అందుతున్న సేవలపై సబ్ కలెక్టర్ ఎంపీడీవోలతో చర్చించారు. మండలాల వారీగా చేపడుతున్న కార్యక్రమాల పురోగతిని అడిగి తెలుసుకున్నట్లు సమాచారం.
ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ చేరేలా అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సబ్ కలెక్టర్ సూచించారు. ప్రజలకు ప్రభుత్వ సేవలు సకాలంలో అందేలా చూడడంతో పాటు, వారి సమస్యల పరిష్కారంలో ఎలాంటి జాప్యం లేకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు. అభివృద్ధి పనుల అమలులో సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు అందుతున్న సేవలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ, ప్రభుత్వ లక్ష్యాలను సమర్థవంతంగా అమలు చేయాలని ఎంపీడీవోలకు సబ్ కలెక్టర్ సూచించినట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో కాటారం, మల్హర్, పలిమెల, మహముత్తారం మండలాల ఎంపీడీవోలు బాబు, నిశాంత్, క్రాంతి, పవన్ తదితరులు పాల్గొన్నారు.

Post A Comment: