కాటారం, జూలై 16: జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం (కేజీబీవీ)లో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపాల్ చల్ల సునీత తెలిపారు. జూలై 17, 18 తేదీల్లో ఉదయం నుంచి అడ్మిషన్ ప్రక్రియ నిర్వహించనున్నట్లు ఆమె వెల్లడించారు. విద్యాలయంలో ప్రస్తుతం 7వ తరగతిలో 10 సీట్లు, ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ఎంపీసీ విభాగంలో 10 సీట్లు, బైపీసీ విభాగంలో 9 సీట్లు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. అర్హత కలిగిన విద్యార్థినులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. ప్రవేశాలకు హాజరయ్యే విద్యార్థినులు సంబంధిత ఒరిజినల్ విద్యార్హత సర్టిఫికెట్లు, ట్రాన్స్‌ఫర్ సర్టిఫికెట్ (టీసీ), స్టడీ సర్టిఫికెట్, ఆధార్ కార్డు, కుల ధృవీకరణ పత్రం, ఆదాయ ధృవీకరణ పత్రం, పాస్‌పోర్ట్ సైజు ఫోటోలు తదితర అవసరమైన పత్రాలతో విద్యాలయానికి హాజరుకావాలని కోరారు. అడ్మిషన్లకు సంబంధించిన పూర్తి వివరాల కోసం నేరుగా కేజీబీవీ కాటారం కార్యాలయాన్ని సంప్రదించాలని ప్రిన్సిపాల్ చల్ల సునీత సూచించారు. అర్హత కలిగిన విద్యార్థినులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ప్రభుత్వ ఆధ్వర్యంలో నాణ్యమైన విద్యను అభ్యసించాలని ఆమె విజ్ఞప్తి చేశారు.

Axact

ANAPARTHI SRINIVAS GOUD

CEO MEDIGADDA TV NEWS Mobile Number 9848223934 9502908070

Post A Comment: