కాటారం, జూలై 14: కేంద్రమంత్రి, బొగ్గు మరియు గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డిని, తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామ్‌చంద్రరావును కాటారం డివిజన్ బీఆర్ఎస్ సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడు, కాటారం సర్పంచ్ పంతకాని సడవలి మర్యాదపూర్వకంగా కలిసి కాటారం గ్రామపంచాయతీ అభివృద్ధికి సంబంధించిన వినతిపత్రాన్ని అందజేశారు. వినతిపత్రంలో సీఎస్‌ఆర్ నిధుల ద్వారా గ్రామంలో 1,200 సోలార్/ఎల్ఈడీ స్ట్రీట్ లైట్ల ప్యానల్ సెట్లను మంజూరు చేయాలని కోరారు. అలాగే 1,300 ఎకరాల వ్యవసాయ భూమిలో సాగు చేస్తున్న రైతులకు ఎకరానికి 40 చొప్పున మొత్తం 52 వేల కొబ్బరి మొక్కలను అందించాలని విజ్ఞప్తి చేశారు. ఈ ప్రతిపాదనలతో గ్రామంలో మౌలిక సదుపాయాలు మెరుగుపడటంతో పాటు రైతుల ఆదాయం పెరగడం, పర్యావరణ పరిరక్షణ, గ్రామ సౌందర్యవృద్ధికి దోహదపడుతుందని సడవలి వివరించారు. వినతిపత్రాన్ని సానుకూలంగా పరిశీలించి, సంబంధిత సీఎస్‌ఆర్ సంస్థల ద్వారా అవసరమైన సహకారం అందించేందుకు కృషి చేస్తామని కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి హామీ ఇచ్చినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో 10వ వార్డు సభ్యులు మానేం రాజబాబు, కొండ రాము తదితరులు పాల్గొన్నారు.


Axact

ANAPARTHI SRINIVAS GOUD

CEO MEDIGADDA TV NEWS Mobile Number 9848223934 9502908070

Post A Comment: