మహా ముత్తారం: కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మహా ముత్తారం మండల కేంద్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (SIR) ప్రక్రియపై BLAలు, BLA సూపర్వైజర్లకు అవగాహన సమావేశం నిర్వహించారు. TPCC ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్, ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, TPCC ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీను బాబు ఆదేశాల మేరకు జరిగిన ఈ కార్యక్రమంలో డీసీసీ కార్యదర్శి, SIR మండల ఇన్‌చార్జి అంగజాల అశోక్ పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రతి BLA సూపర్వైజర్ చురుకుగా వ్యవహరించి అర్హులైన ప్రతి ఓటరు పేరు ఓటర్ల జాబితాలో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఓటర్ల జాబితాలో ఎలాంటి పొరపాట్లు లేకుండా ప్రతి ఇంటిని సందర్శించి అవసరమైన దరఖాస్తులు పూర్తి చేయించడంతో పాటు, హెల్ప్‌డెస్క్‌ల ద్వారా ప్రజలకు సహాయం అందించాలని కోరారు. నిబంధనల ప్రకారం SIR ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించాలని, పార్టీ శ్రేణులంతా సమన్వయంతో పనిచేసి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు పక్కల సడవలి, సర్పంచుల ఫోరం కాటారం డివిజన్ అధ్యక్షుడు కొండగోర్ల బాపు, మాజీ PACS చైర్మన్ ముక్కెర రాజమల్లు గౌడ్, మహిళా మండల అధ్యక్షురాలు సుజాత, యూత్ కాంగ్రెస్ నాయకులు, BLAలు, BLA సూపర్వైజర్లు, సర్పంచులు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.




Axact

ANAPARTHI SRINIVAS GOUD

CEO MEDIGADDA TV NEWS Mobile Number 9848223934 9502908070

Post A Comment: