మహా ముత్తారం: సర్పంచుల ఫోరం కాటారం డివిజన్ నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన కొండగోర్ల బాపును మహా ముత్తారం మండల కాంగ్రెస్ నాయకులు ఘనంగా సన్మానించారు. ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఆదేశాల మేరకు మండల కాంగ్రెస్ అధ్యక్షుడు పక్కల సడవలి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో బాపుకు శాలువా కప్పి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, సర్పంచుల సమస్యల పరిష్కారంతో పాటు గ్రామాభివృద్ధికి కొండగోర్ల బాపు కృషి చేయాలని ఆకాంక్షించారు. నూతన బాధ్యతలను విజయవంతంగా నిర్వహించాలని శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డీసీసీ కార్యదర్శి అంగజాల అశోక్ కుమార్, మాజీ PACS చైర్మన్ ముక్కెర రాజమల్లు గౌడ్, మహిళా మండల అధ్యక్షురాలు సుజాత, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు జాటోత్ వంశిరాజ్, మండల కాంగ్రెస్ నాయకులు, సర్పంచులు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.





Post A Comment: