పెద్దపల్లి,గోదావరిఖని,ఏప్రిల్ 20: పెద్దపల్లి,అనారోగ్యంతో పోరాడుతున్న డయాలసిస్ రోగికి సమాజం నుంచి అందిన సహాయం మరోసారి మానవత్వాన్ని ప్రతిబింబించింది.పెద్దపల్లి పట్టణానికి చెందిన శివసాయి మల్టీ ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్ ఆధ్వర్యంలో,సోమవారం,తురకల మద్దికుంట గ్రామానికి చెందిన డయాలసిస్ బాధితుడు రాచకొండ లక్ష్మణ్‌కు ఆర్థిక సహాయం అందజేశారు.ఈ సహాయాన్ని పెద్దపల్లి మున్సిపల్ కౌన్సిలర్ ములుగురి కమల్ చేతుల మీదుగా బాధిత కుటుంబానికి అందజేశారు.ఈ సందర్భంగా కౌన్సిలర్ ములుగురి కమల్ మాట్లాడరు,శివసాయి సంస్థ తమ లాభాల్లో భాగాన్ని కష్టాల్లో ఉన్నవారికి పంచడం గొప్ప విషయం అని అన్నారు.ఇటువంటి సహాయ కార్యక్రమాలు బాధిత కుటుంబాలకు కొంత ఊరటనిచ్చే ప్రయత్నమని పేర్కొన్నారు.సమాజంలో ఇలాంటి సేవా కార్యక్రమాలు మరింత పెరగాలని ఆకాంక్షించారు.శివసాయి సంస్థ చైర్మన్,డైరెక్టర్లు పెద్దపల్లి ప్రాంతంలో ప్రత్యేక శ్రద్ధతో సామాజిక సేవా కార్యక్రమాలు చేపడుతున్న తీరు ప్రశంసనీయం అని కమల్ అన్నారు.సంస్థ సేవలు వ్యాపార అభివృద్ధితో పాటు సామాజిక బాధ్యతను కూడా ప్రతిబింబిస్తున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు.మహిళల సాధికారతకు ప్రాధాన్యత ఇస్తూ,పెద్దపల్లి బ్రాంచ్‌లో కూడా కుట్టు శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేయాలని కౌన్సిలర్ సూచించారు.ప్రభుత్వం అందజేస్తున్న స్కూల్ యూనిఫాంల కుట్టు పనులను మహిళలకు అప్పగించేలా చైర్మన్,కమిషనర్‌లతో చర్చించి వారికి ఆర్థిక అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.శివసాయి సొసైటీ చేపడుతున్న సేవా కార్యక్రమాలు ఇతర సంస్థలకు ఆదర్శంగా నిలుస్తున్నాయని స్థానికులు పేర్కొన్నారు.కష్టాల్లో ఉన్నవారికి చేయూత అందించడంలో సమాజం ముందుకు రావడం అవసరమని ఈ సందర్భంగా పలువురు అభిప్రాయపడ్డారు

Axact

ANAPARTHI SRINIVAS GOUD

CEO MEDIGADDA TV NEWS Mobile Number 9848223934 9502908070

Post A Comment: