రేలకాయలపల్లికి చెందిన సందీప్తి, అదే గ్రామానికి చెందిన ఆర్ఎంపీ నరేశ్‌తో కొంతకాలంగా ప్రేమలో ఉన్నట్టు తెలుస్తోంది. ఈ ప్రేమ వ్యవహారం వారి ఇళ్ల వారికి తెలిసిన తర్వాత సందీప్తిని కాలేజీ మాన్పించి ఇంట్లోనే ఉంచారు. అయినప్పటికీ నరేశ్ ఆమెపై ఒత్తిడి కొనసాగించినట్టు పోలీసులు పేర్కొన్నారు. పెళ్లి చేసుకోవాలని డిమాండ్ చేస్తూ, ఇద్దరూ కలిసి ఉన్నప్పుడు దిగిన ఫోటోలను సోషల్ మీడియా, వాట్సాప్ స్టేటస్‌లలో పెట్టాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ పరిణామాలన్నింటితో కుటుంబ పరువు పోయిందని భావించిన సందీప్తి తీవ్ర మనస్తాపానికి గురై పురుగు మందు తాగింది. తక్షణమే కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినా, చికిత్స పొందుతూ చివరికి ఆమె ప్రాణాలు విడిచింది. ఈ ఘటనపై గ్రామంలో తీవ్ర కలకలం రేగగా, యువతులను లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న సోషల్ మీడియా వేధింపులపై మరొకసారి చర్చ మొదలైంది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం రేలకాయలపల్లిలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. ప్రియుడి వేధింపులు, సోషల్ మీడియాలో చేసిన చిత్రాల పోస్టింగ్‌తో కుంగిపోయిన 20 ఏళ్ల సందీప్తి ఆత్మహత్యకు పాల్పడి చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందింది. వివరాల్లోకి వెళ్తే—

Post A Comment: