జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం చిదినేపల్లిలో రాజకీయ వేడి పెరుగుతోంది. రాబోయే స్థానిక ఎన్నికలను ఎదురు చూస్తున్న గ్రామ ప్రజల్లో ఒక్క మాటే వినిపిస్తోంది… ఈసారి మార్పు కావాలి, యువ నాయకత్వం రావాలి!” గ్రామ అభివృద్ధి కోసం కొత్త ఆలోచనలు కావాలి… సమకాలీన నిర్ణయాలు తీసుకునే ధైర్యం కావాలి… అందుకే ఈసారి యువ నేతకే అవకాశం ఇవ్వాలన్న అభిప్రాయం చిదినేపల్లి గ్రామం మొత్తంలో వినిపిస్తోంది. చిదినేపల్లి లో రోడ్లు, డ్రైనేజీ, తాగునీరు, స్కూల్ సదుపాయాలు, యువతకు ఉద్యోగ అవకాశాలు—ఇలా ఎన్నో సమస్యలు పెండింగ్‌లోనే ఉన్నాయి. పెద్దలు, యువత ఎవర్నైనా అడిగినా ఒకే సమాధానం… “ఆలోచన మార్చే నాయకుడు వస్తే తప్ప గ్రామం మారదు.” “పాత నాయకులు బాగానే చేశారు, కానీ ఇప్పుడు మా గ్రామానికి వేగం ఉన్న నాయకుడు కావాలి. యువ నాయకుడు వస్తే గ్రామం ముందుకు దూసుకెళ్తుంది.” డిజిటల్ సర్వీసులు, ట్రాన్స్‌పరెన్సీ, ప్రభుత్వ పథకాల అమలులో స్పీడ్—all these need young leadership. ఈసారి మార్పు పక్కా.” సరికొత్త ఆలోచనలు, స్మార్ట్ అడ్మినిస్ట్రేషన్, గ్రామ సమస్యలకు ఫాస్ట్ రెస్పాన్స్… యువ నాయకుడు వస్తే చెడ్నెపల్లి కొత్త దిశలో అడుగులు వేస్తుందని ప్రజలు నమ్ముతున్నారు. “ చిదినేపల్లి లో మార్పు తరంగం ఎటు వైపు తిరుగుతుందో చూడాలి. కానీ ప్రజల మాట మాత్రం స్పష్టంగా ఉంది… ఈ ఎన్నికల్లో గ్రామాభివృద్ధి కోసం యువ నేతకే ఛాన్స్ ఇవ్వాలి. రాబోయే రోజుల్లో పరిస్థితులు ఎలా మారతాయో…చిదినేపల్లి మీద మా స్పెషల్ రిపోర్ట్‌తో ముందుకి తెస్తూనే ఉంటాం.”

Post A Comment: