కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రేణుకుంట బ్రిడ్జి సమీపంలో మంగళవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. తెల్లవారుజామున 5 గంటల ప్రాంతంలో వెళ్తున్న ట్రాక్టర్‌ను వెనుకనుంచి మెట్పల్లి డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఢీకొట్టిన తీవ్రతకు బస్సు ముందు భాగం దెబ్బతింది. ప్రమాద సమయంలో బస్సులో ఉన్న 15 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. వారిని స్థానికులు వెంటనే కాపాడి కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రయాణికులలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఘటన స్థలానికి పోలీసులు చేరుకుని పరిశీలించారు. ప్రమాదానికి కారణం దట్టమైన పొగమంచు లేదా డ్రైవర్ నిర్లక్ష్యమా అన్నదానిపై విచారణ కొనసాగుతోంది. ఈ ప్రమాదం వల్ల ఆ రహదారిపై కొంతసేపు ట్రాఫిక్ నిలిచిపోయింది. స్థానికులు ప్రమాదాన్ని చూసి భయాందోళనకు గురయ్యారు.

Post A Comment: