భూపాలపల్లి: భూపాలపల్లి జిల్లా కేంద్రంలో జరిగిన జిల్లా సర్వసభ్య సమావేశంలో పాల్గొని ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలపై మాట్లాడడం జరిగింది. సమస్యల పరిష్కారంలో మండల శాఖకు సహకరించిన జిల్లా అధ్యక్షులు సుభాకర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి కిరణ్ కుమార్ కృతజ్ఞతలు తెలపడం జరిగింది. ముఖ్యంగా ఈ సమావేశంలో పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలని, ఇటీవల 317 జీవోకు సంబంధించిన నోటిఫికేషన్లో బాధిత ఉపాధ్యాయుల్లో కొందరికి మాత్రమే అవకాశం , మరి కొంతమంది బాధ్యత ఉపాధ్యాయులకు అవకాశం ఇవ్వలేదు కావున ప్రతి ఒక బాధిత ఉపాధ్యాయులకు ఈ ఒక నోటిఫికేషన్ లో అప్లై చేసుకోవడానికి అవకాశం ఇచ్చేలా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని కోరడం జరిగింది.పై సమస్యను వెంటనే పరిష్కరించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని మీ ద్వారా రాష్ట్ర శాఖకు ఈ సమాచారం తెలియజేయాలని కోరడమైనది. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు, నాయకులు ఎన్. సురేషు, అసోసియేట్ మహిళ అధ్యక్షులు బాసాని రజిత మరియు పెద్ద ఎత్తున ఉపాధ్యాయులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Post A Comment: